త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఈ ఏడాది జూన్ నెలలో తమ కొత్త Kushaq (కుషాక్) ఎస్‌యూవీని విడుదల చేసిన చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ Skoda Auto, ఇప్పుడు భారత మార్కెట్లో తమ అప్‌డేట్ Kodiaq (కొడియాక్) ఎస్‌యూవీని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కొత్త Skoda Kodiaq అప్‌డేటెడ్ డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి రానుంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

తాజా సమాచారం ప్రకారం, BS6 పెట్రోల్ ఇంజన్‌తో రానున్న కొత్త Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ ఉత్పత్తి డిసెంబర్ 2021 లో ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీని డెలివరీలు మాత్రం వచ్చే ఏడాది (2022 లో) ప్రారంభమవుతాయని అంచనా. ఈ ఏడాది జూన్ నెలలో తమ అప్‌డేటెడ్ Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని కంపెనీ ఆవిష్కరించింది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఇటీవల పలు సందర్భాల్లో కంపెనీ ఈ కారును భారత రోడ్లపై ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా టెస్ట్ చేయటం కనిపించింది. కవర్ లేకుండా పరీక్షించే మోడళ్లలో ఎస్‌యూవీ అనేకసార్లు కనిపించింది. వాస్తవానికి కంపెనీ గతేడాదే ఈ Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించాలని భావించినప్పటికీ, దేశంలో విస్తరించిన కరోనా మహమ్మారి కారణంగా, దాని విడుదల వాయిదా పడింది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

భారతదేశంలో కఠినమైన BS6 ఉద్గార నిబంధనలను అమలు చేసిన తర్వాత Skoda తమ డీజిల్ మోడళ్లను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా రానున్న Skoda Kodiaq ఫేస్‌లిఫ్ట్ మోడల్ కొత్త BS6 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్‌తో విడుదల చేయబడుతుందని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ గేర్‌బాక్స్ ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి ఈ కారు కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదని కంపెనీ పేర్కొంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

కొత్త Skoda Kodiaq లో సిగ్నేచర్ టైగర్ నోస్ ఫ్రంట్ గిల్ మరియు క్రోమ్ గార్నిష్‌లతో చాలా ప్రీమియం స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది. ఇది చూడటానికి కాంపాక్ట్ ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది, కానీ ఇది చాలా విశాలమైన ఎస్‌యూవీ. ఈ కారు మొత్తం పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మిమీగా ఉంటుంది. ఈ కొలతలతో ఇది లోపలి వైపు విశాలమైన క్యాబిన్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఈ కారులో వర్చువల్ కాక్‌పిట్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి టెయిల్‌లైట్, ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్‌లు, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

అంతేకాకుండా, ఈ కారులో 750 వాట్ సామర్థ్యం మరియు 12 స్పీకర్లతో కూడిన ఆడియో సిస్టమ్‌ను కంపెనీ అందిస్తోంది. ఇది అద్భుతమైన ధ్వని నాణ్యతను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు బ్లూటూత్ కనెక్టివిటీ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

గతంలో Skoda తమ BS4 వెర్షన్ Kodiaq 4X4 వేరియంట్ భారతదేశంలో రూ.34.49 లక్షల ధర (ఎక్స్-షోరూమ్) వద్ద విక్రయించేంది. అయితే, ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ చేసిన మార్పులు చేర్పుల కారణంగా, పాత మోడల్ కంటే ఇది కాస్తంత ఎక్కువ ధరను కలిగి ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో Ford Endeavor, Toyota Fortuner, Volkswagen Tiguan Allspace వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

Skoda Kushaq డెలివరీలు ప్రారంభం

Skoda Auto ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త Skoda Kushaq డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ఈ మోడల్ భారత మార్కెట్లో యాక్టివ్, యాంబిషన్ మరియు స్టైల్ అనే మూడు ట్రిమ్‌లలో మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు రూ.10.49 లక్షల నుండి రూ.17.59 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

కొత్త Skoda Kushaq కేవలం రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0-లీటర్, 3-సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్‌ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఇకపోతే, ఇందులో రెండవది 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా మాన్యువల్, ఆటోమేటిక్ మరియు డిఎస్‌జి గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటాయి.

త్వరలో అప్‌డేటెడ్ Skoda Kodiaq ఎస్‌యూవీ విడుదల; పూర్తి వివరాలు

ఈ ఎస్‌యూవీలో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఈఎస్‌సి, హిల్-హోల్డ్ కంట్రోల్, రెయిన్ అండ్ లైట్ సెన్సార్, క్రూయిజ్ కంట్రోల్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Updated skoda kodiaq production to start from december launch expected in early 2022 details
Story first published: Saturday, August 21, 2021, 16:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X