కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

ప్రముఖ వాహన తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తన పోలో మరియు వెంటో మోడల్స్ యొక్క స్పెషల్ ఎడిషన్లను భారత మార్కెట్లో విడుదల చేసింది. టర్బో ఎడిషన్ అని పిలువబడే కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్లలో రెండు మోడళ్లలోని స్టాండర్డ్ వేరియంట్ల కంటే అదనపు కాస్మెటిక్ మార్పులు ఉన్నాయి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

కంపెనీ విడుదల చేసిన ఈ పోలో వెర్షన్ ధర రూ. 6.99 లక్షలు కాగా, వెంటో టర్బో ఎడిషన్ ధర రూ .8.69 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా). టర్బో-ఎడిషన్ కంఫర్ట్‌లైన్ బేస్ ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ టర్బో ఎడిషన్‌లో కాస్మెటిక్స్ అప్డేట్స్ గమనించినట్లయితే ఇందులో నిగనిగలాడే బ్లాక్ స్పాయిలర్, ORVM క్యాప్స్, ఫెండర్ బ్యాడ్జ్ మరియు స్పోర్టి సీట్ కవర్లు ఉన్నాయి. వీటితోపాటు క్యాబిన్ సౌకర్యాన్ని పెంచుతూ, రెండు కార్లైన్‌లు క్లైమాట్రానిక్ ఎయిర్ కండిషనింగ్ ఫీచర్‌ను కూడా అందించారు.

MOST READ:ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

టర్బో ఎడిషన్ పోలో మరియు వెంటోలో అందించే విధంగా అన్ని కలర్స్ లో లభిస్తాయి. అయితే, టర్బో ఎడిషన్ వేరియంట్‌లను మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే అందిస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ పోలోను అందించే బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ రెండు ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడుతుంది.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

ఇందులో ఉన్న 1.0-లీటర్ MPI ఇంజిన్ 76 బిహెచ్‌పి మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్ గా వస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్లోని 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజన్ 110 బిహెచ్‌పి మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6 స్పీడ్ మాన్యువల్ లేదా కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

మరోవైపు, వెంటో అన్ని వేరియంట్లలో 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్‌తో సెడాన్ యొక్క టాప్-స్పెక్ ట్రిమ్‌లలో అందించే అప్సనల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో అందించబడుతుంది. పైన పేర్కొన్న మార్పులే కాకుండా, మిగిలిన కార్లు స్టాండర్డ్ ట్రిమ్‌ల మాదిరిగానే ఉంటాయి.

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

పోలో మరియు వెంటోలోని ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు వాయిస్ కమాండ్స్, క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షన్ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్స్ కు మద్దతు ఇచ్చే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎబిఎస్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగులు, డే అండ్ నైట్ ఇంటర్నల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో మరియు వెంటో టర్బో ఎడిషన్స్ : ధర & ఫీచర్లు

ఫోక్స్‌వ్యాగన్ కొత్త సంవత్సరం 2021 జనవరి నుండి భారతదేశంలో తన కార్ల ధరలను పెంచింది. ఇందులో భాగంగానే తన బ్రాండ్స్ అయిన పోలో మరియు వెంటో ధరలను కూడా పెంచింది. రెండు మోడళ్ల ధరలు ప్రస్తుతం 2.5 శాతం పెంచారు. ముడిపదార్ధాలు ధరలు పెరగటంవల్ల తమ కార్ల ధరలు కూడా పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Volkswagen Polo And Vento Turbo Edition Launched. Read in Telugu.
Story first published: Tuesday, February 16, 2021, 9:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X