5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న పోలో (Polo) హ్యాచ్‌బ్యాక్ మరియు వెంటో (Vento) సెడాన్‌ల వెయిటింగ్ పీరియడ్ 5 నెలలకు చేరుకుంది. ఇటీవలి కాలంలో ఈ రెండు మోడళ్లకు డిమాండ్ భారీగా పెరిగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

అయితే, ఈ రెండు మోడళ్లలోని అన్ని వేరియంట్‌ ల కోసం ఐదు నెలల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు, వీటిలో కొన్ని వేరియంట్‌ లకు మాత్రమే ఇంత ఎక్కువ నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంటోంది. Volkswagen Polo యొక్క ట్రెండ్‌లైన్ ఎమ్‌పిఐ, కంఫర్ట్ లైన్ టిఎస్ఐ ఎమ్‌టి, హైలైన్ ప్లస్ టిఎస్ఐ ఎమ్‌టి, హైలైన్ ప్లస్ టిఎస్ఐ ఏటి, మరియు జిటి టిఎస్ఐ ఏటి వేరియంట్ల కోసం వెయిటింగ్ పీరియడ్ ఐదు నెలల వరకు ఉంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

ఇక Volkswagen Vento సెడాన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ యొక్క హైలైన్ టిఎస్ఐ ఎమ్‌టి వేరియంట్ కి మాత్రమే ఐదు నెలల నిరీక్షణ కాలం (వెయిటింగ్ పీరియడ్) ఉంది. ఇందులోని మిగిలిన వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ సాధారణంగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యం కంటే కొన్ని మోడళ్లు మరియు వేరియంట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, Volkswagen వాటి బుకింగ్‌ లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, Volkswagen డీలర్లు పోలో కంఫర్ట్ లైన్ ఎమ్‌పిఐ, పోలో కంఫర్ట్ లైన్ టిఎస్ఐ ఏటి, వెంటో కంఫర్ట్ లైన్ టిఎస్ఐ ఎమ్‌టి మరియు వెంటో హైలైన్ ప్లస్ టిఎస్ఐ ఎమ్‌టి వేరియంట్ లకు బుకింగ్స్ ను స్వీకరించడం నిలిపివేసిట్లు సమాచారం. అయితే, ఇది ఫోక్స్‌వ్యాగన్ డీలర్‌షిప్ ఉండే నగరం మరియు ప్రంతాన్ని బట్టి మారే అవకాశం ఉంటుందని గుర్తించండి.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

అయితే, Volkswagen డీలర్‌షిప్‌ లు త్వరలో ఈ ఆర్డర్‌ లపై బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేస్తున్నందున పైన పేర్కొన్న మోడల్స్ మరియు వేరియంట్‌ ల కోసం బుకింగ్‌ లను స్వీకరించడాన్ని ప్రారంభించవచ్చని ఆశిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఎదురైన సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా, ఈ కంపెనీ యొక్క కార్ల ఉత్పత్తి కూడా ప్రతికూలంగా ప్రభావితమైనట్లు తెలుస్తోంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

ప్రస్తుతం, Volkswagen Polo (ఫోక్స్‌వ్యాగన్ పోలో) హ్యాచ్‌బ్యాక్ ఒకే విధమైన డిస్‌ప్లేస్‌మెంట్ తో కూడిన రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటి 1.0 లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పి పవర్ ను మరియు 95 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

ఇందులో మొదటి 1.0 లీటర్ ఎమ్‌పిఐ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ తో స్టాండర్డ్ గా జతచేయబడి ఉంటుంది. అయితే, మరింత శక్తివంతమైన 1.0 లీర్ టిఎస్ఐ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో డీజిల్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో లేదు.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

భారత మార్కెట్లో Volkswagen Polo ధరలను పరిశీలిస్తే, దీని బేస్ వేరియంట్ ధరలు రూ. 6.27 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. కాగా, ఇందులోని టాప్-ఎండ్ అయిన జిటి వేరియంట్ కోసం రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఖర్చు అవుతుంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

ఇక Volkswagen Vento (ఫోక్స్‌వ్యాగన్ వెంటో) సెడాన్ విషయానికి వస్తే, ఈ సెడాన్ కేవలం ఒకేఒక ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి పవర్ ను మరియు 175 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో లభిస్తుంది. దేశీయ విపణిలో Volkswagen Vento ధరలు రూ. 9.99 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభమవుతాయి.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

ప్రస్తుతం Volkswagen India ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోలో మొత్తం ఆరు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో Polo (పోలో) హ్యాచ్‌బ్యాక్, Vento (వెంటో) సెడాన్, Taigun (టైగన్), T-roc (టి-రోక్), Tiguan (టిగువాన్) మరియు Tiguan All-space (టిగువాన్ ఆల్స్పేస్) అనే ఎస్‌యూవీలు ఉన్నాయి.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

Volkswagen నుండి త్వరలోనే టైగన్ ఎస్‌యూవీ మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఇది ఈ విభాగంలో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హారియర్, ఎంజి హెక్టర్, స్కోడా కుషాక్ వంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది. ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇప్పటికే 10,000 లకు పైగా ప్రీ-బుకింగ్‌లను కూడా అందుకున్నట్లు సమాచారం. ఈ బ్రాండ్ ప్రతి నెలా 6,000 యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

5 నెలలకు చేరుకున్న Volkswagen Polo మరియు Vento వెయిటింగ్ పీరియడ్

వెంటో సెడాన్ రీప్లేస్‌మెంట్‌గా.. వర్చ్యుస్

ఇదిలా ఉంటే, ప్రస్తుతం Volkswagen విక్రయిస్తున్న Vento సెడాన్ స్థానంలో కంపెనీ Virtus అనే పేరుతో ఓ కొత్త సెడాన్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త వర్చ్యుస్ సెడాన్ కూడా కంపెనీ యొక్క పాపులర్ Volkswagen MQB-A0 ప్లాట్‌ఫారమ్‌పైనే నిర్మించనున్నారు మరియు ఇది Volkswagen Vento యొక్క అవుట్‌గోయింగ్ వెర్షన్ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుందని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen polo and vento waiting period increased upto 5 months details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X