Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తమ సరికొత్త కాంపాక్ట్ కారు 'పోలో ట్రాక్' (Polo Track) యొక్క అధికారిక టీజర్ చిత్రాలను విడుదల చేసింది. ఈ చిన్న కారును ముందుగా దక్షిణ అమెరికా మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త మోడల్, ఈ మార్కెట్ కోసం ఫోక్స్‌వ్యాగన్ నుండి వస్తున్న మొదటి కాంపాక్ట్ ఫ్యామిలీ కారు అవుతుంది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రాక్ (Volkswagen Polo Track) కాంపాక్ట్ కారును ప్రస్తుతానికి దక్షిణ అమెరికా మార్కెట్ కోసం కేటాయించబడినప్పటికీ, ఈ చిన్న కారు బ్రెజిల్‌లోని టౌబేట్‌లో ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, ఈ కారును ఇతర మార్కెట్‌లకు ఎగుమతి చేసే అవకాశం ఉందని ఫోక్స్‌వ్యాగన్ సీఎఫ్ఓ అలెగ్జాండర్ సీట్జ్ సూచించారు.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ఈ కాంపాక్ట్ ఫ్యామిలీ కారు భవిష్యత్తులో ఇండియా మార్కెట్ కు వస్తుందో లేదో ఇంకా ఎటువంటి సమాచారం లేదు. అయితే, కంపెనీ దీన్ని ఇక్కడికి తీసుకురావాలని నిర్ణయించుకుంటే, అది ఓ చిన్న కుటుంబం యొక్క కార్ అవసరాలకు సరిపోతుందని తెలుస్తోంది. దక్షిణ అమెరికా మార్కెట్ కోసం ఫోక్స్‌వ్యాగన్ సంస్థ సుమారు 100 బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

గడచిన 2013 మాంద్యం తర్వాత లాటిన్ అమెరికన్ మార్కెట్ కు ఈ పెట్టుబడి గణనీయమైన రాబడిని సూచిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ జర్మన్ వాహన తయారీదారు 2021 ఆర్థిక సంవత్సరానికి గాను మంచి లాభాలను ఆశిస్తోంది. తాజా నివేదిక ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ యొక్క పోలో ట్రాక్ కూడా కంపెనీ యొక్క పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్ పై ఆధారపడి ఉంటుంది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ప్రస్తుతం, ఫోక్స్‌వ్యాగన్ ఇదే ప్లాట్‌ఫామ్ పై అనేక రకాల మోడళ్లను తయారు చేస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ తమ పోలో ట్రాక్ టీజర్ మినహా ఈ రాబోయే కారు గురించి ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు, అయితే ఈ మోడల్‌ ను 2023 లో లాటిన్ అమెరికన్ మార్కెట్‌ లో విడుదల చేయనున్నట్లు స్పష్టమైంది. ఈ కాంపాక్ట్ కారు ప్రస్తుత పోలో హ్యాచ్‌బ్యాక్ కన్నా కాస్తంత చిన్నదిగా ఉంటుందని సమాచారం.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

దక్షిణ అమెరికా మీడియా ప్రకారం, కొత్త ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రాక్ కారు దక్షిణాఫ్రికాలో నిర్మించబడిన ప్రస్తుత పోలో యొక్క సరళీకృత సంస్కరణగా ఉంటుంది మరియు ఇది చివరికి ఆ ఖండంలో గోల్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్‌ను భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. ఫోక్స్‌వ్యాగన్ గోల్ 2002 లో ప్రవేశపెట్టబడిన MK4 పోలో కారుకు ఆధారమైన పాత PQ24 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ఈ కారు పేరు (ఫోక్స్‌వ్యాగన్ పోలో ట్రాక్) లోని 'ట్రాక్' అనే పేరును చూస్తుంటే, ఈ కొత్త వాహనం డిజైన్‌ లో కొంత మేర ఎస్‌యూవీ ఫ్లేవర్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ఈ కొత్త ఎంట్రీ లెవల్ మోడల్ ను ఆధునిక MQB ప్లాట్‌ఫామ్ పైకి తరలించడం వలన కంపెనీ ఇందులో మరింత ఆధునికమైన భద్రతా ఫీచర్లు మరియు సాంకేతికతలను అందించడానికి అనుమతిస్తుంది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

అంతేకాకుండా, ఇదే సమయంలో కొత్తగా ప్లాట్‌ఫామ్ ను అభివృద్ధి చేయడానికి అవసరమయ్యే ఖర్చులను కూడా ఇది ఆదా చేస్తుంది మరియు స్కేల్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫోక్స్‌వ్యాగన్ ఈ కొత్త కారును MQB ప్లాట్‌ఫామ్ కు మార్చడం వలన, కంపెనీ ఈ ఎంట్రీ లెవల్ కారును లేటెస్ట్ కనెక్టివిటీ టెక్‌కి అప్‌గ్రేడ్ చేయబడటం కూడా కనిపిస్తుంది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

Volkswagen Taigun కోసం సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్..

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ బ్రాండ్ ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) కోసం కంపెనీ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు ఇప్పుడు ఈ కారును ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించి అద్దెకు తీసుకోవచ్చు.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ఒకవేళ, ఎవరైనా ఈ ఎస్‌యూవీని మొత్తం డబ్బు చెల్లించి కొనుగోలు చేయాలంటే, మార్కెట్లో దీని దరలు రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. ఫోక్స్‌వ్యాగన్ తమ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ క్రింద ఇతర మోడళ్లను కూడా అందిస్తోంది. తాజాగా, ఇందులోకి టైగన్‌ను చేర్చడం ద్వారా ఫోక్స్‌వ్యాగన్ తమ మొత్తం ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని సబ్‌స్క్రిప్షన్ కోసం వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఈ కారును భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన MQB-A0-IN ప్లాట్‌ఫామ్‌ పై తయారు చేసింది. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లతో కూడిన ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ బంపర్‌లో ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్‌లు, బ్లాక్డ్ అవుట్ హనీకోంబ్ గ్రిల్, బానెట్‌పై మజిక్యులర్ లైన్స్ మరియు వీల్ ఆర్చెస్, కారు చుట్టూ ప్లాస్టిక్ క్లాడింగ్ మరియు 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen Polo Track టీజర్ వచ్చేసింది.. ఈ కారు ముందుగా ఎక్కడ లాంచ్ అవుతుందంటే..?

అలాగే, ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఈ కారులో 8.0 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసి వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్‌హోల్డర్‌లతో కూడిన సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసి మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Volkswagen polo track teaser image revealed find out all the details here
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X