ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ తమ టి-రోక్ ఎస్‌యూవీని తిరిగి భారత మార్కెట్లో రీ-లాంచ్ చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ కోసం అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అతి త్వరలోనే ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ డెలివరీలు కూడా ప్రాంభం కానున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.21.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీని కంపెనీ సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారైన మోడల్‌ను ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయించనుంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

అధిక దిగుమతి సుంఖాల కారణంగా ఈ మోడల్ ధర కూడా అధికంగానే ఉంటుంది. గతంలో ఫోక్స్‌వ్యాగన్ విక్రయించిన టి-రోక్ ఎస్‌యూవీకి మరియు ఈ కొత్త 2021 మోడల్‌కి మధ్య ధరల వ్యత్యాసం రూ.1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. గతంలో ఈ మోడల్ అతి తక్కువ సమయంలోనే పూర్తిగా అమ్ముడైపోయింది.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులెన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

భారతదేశంలో సవరించిన కొత్త దిగుమతి నిబంధనల ప్రకారం, ఆటోమొబైల్ కంపెనీలు దేశంలో హోమోలోగేషన్ లేకుండా సంవత్సరానికి 2500 యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు. ఇందులో భాగంగానే, గతేడాది ఫోక్స్‌వ్యాగన్ 1,000 యూనిట్లను దిగుమతి చేసుకుంది, అవి అతి తక్కువ వ్యవధిలోనే అమ్ముడైపోయాయి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

ఈ నేపథ్యంలో, ఈసారి సెకండ్ బ్యాచ్‌లో అధిక సంఖ్యలో వాహనాలను దిగుమతి చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ తమ టి-రోక్ ఎస్‌యూవీని తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది. ఆ సమయంలో ఈ మోడల్‌కి లభించిన స్పందన, డిమాండ్ కారణంగా కంపెనీ ఈ మోడల్‌ను భారత్‌లో విడుదల చేసింది.

MOST READ:ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి ప్రధాన కారణం ఇదే.. మీకు తెలుసా?

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ డిజైన్‌ను గమనిస్తే, ఇది బోల్డ్ షోల్డర్ క్రీజ్ లైన్లతో అగ్రెసివ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి కార్నరింగ్ లైట్లు మరియు ఫాగ్ లాంప్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ మరియు 10.25 ఇంచ్ 'వర్చువల్ కాక్‌పిట్' డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, పానరోమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:ఫ్రీ వ్యాక్సిన్ సర్వీస్ ప్రారంభించిన ఎంజి మోటార్.. కేవలం వారికీ మాత్రమే

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

సేఫ్టీ విషయానికొస్తే, ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్‌లో 6 ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ కేవలం 8.4 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 205 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఫోక్స్‌వ్యాగన్ టి-రోక్ ఎస్‌యూవీ బుకింగ్స్ ప్రారంభం; త్వరలోనే డెలివరీలు!

ఇంజన్ విషాయనికి వస్తే, ఇది సింగిల్ పెట్రోల్ ఇంజన్ మరియు ఒకే ఒక ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 148 బిహెచ్‌పి పవర్‌ను మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

Most Read Articles

English summary
Volkswagen T-Roc Bookings Open, Deliveries To Start Soon. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X