Just In
- 6 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 8 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 11 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 12 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అప్పుడే 12,000 దాటిన Volkswagen Taigun బుకింగ్స్.. మరింత పెరిగే అవకాశం
భారతీయ మార్కెట్లో కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) రూ. 10.49 లక్షల ప్రారంభ ధరతో విడుదలైంది. అయితే ఈ కొత్త Taigun యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున కంపెనీ ఇప్పటివరకు 12,221 బుకింగ్స్ స్వీకరించినట్లు తెలిపించి.
Volkswagen కంపెనీ తన Volkswagen Taigun యొక్క బుకింగ్స్ 2021 ఆగష్టు 14 న ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ కొత్త SUV కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్సైట్ లో లేదా కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌ను సందర్శించి ముందస్తుగా 25,000 చేల్లించి బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఈ కొత్త SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేయకముందే మంచి స్పందనను పొందింది.
భారతీయ మార్కెట్లో పండుగా సీజన్ ప్రారంభం కానుంది. కావున కొత్త Volkswagen Taigun అమ్మకాలు మరింత పెరుగుదల దిశగా పయనించే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది వాహన వినియోగారులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
Volkswagen కంపెనీ కొత్త Taigun SUV ని నెలకు దాదాపుగా 5000 నుంచి 6000 యూనిట్ల మధ్య విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ఎంతవరకు సాధించడానికి అవకాశం ఉంటుందో వేచి చూడాలి. అయితే ఇది మంచి స్పందన పొందుతుందని భావిస్తున్నాము.
Volkswagen కంపెనీ Taigun SUV ని ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద MQB-AO-IN అనే కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన మొదటి మోడల్. ఇది చాలా వరకు కొత్త మోడల్ మాదిరిగా ఉంటుంది. కావున ఇందులో రెండు కొత్త పెట్రోల్ ఇంజిన్ల ఎంపిక, అలాగే పెట్రోల్, ఆటోమేటిక్ మరియు DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక ఇవ్వబడింది.
Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, దీని ముందుభాగంలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.
Taigun SUV ఆల్‌రౌండ్ క్లాడింగ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.
ఈ కొత్త SUV లో 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నయి. ఇందులో ఉన్న 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
వీటితో పాటు Volkswagen Taigun వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్హోల్డర్లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.
ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.
Volkswagen Taigun అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.