ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెప్టెంబర్ నెలలో మార్కెట్లో విడుల కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఆగస్టు నెలలోనే కంపెనీ ఈ మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

ఫోక్స్‌వ్యాగన్ గడచిన మార్చి నెలలో టైగన్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. అయితే, ఆ వెంటనే వచ్చిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా టైగన్ లాంచ్ ఆలస్యమైంది. ఫోక్స్‌వ్యాగన్ గ్రూపుకు చెందిన స్కోడా ఇటీవలే తమ కుషాక్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

స్కోడా బాటలోనే ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ టైగన్ ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలను రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్లలో ఇంచిమించు ఒకే రకమైన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ యొక్క ఇండియా 2.0 స్ట్రాటజీలో భాగంగా, కుషాక్ మరియు టైగన్ ఎస్‌యూవీలను భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. స్కొడా కుషాక్ ఎస్‌యూవీ మాదిరిగానే టైగన్ ఎస్‌యూవీ తయారీలో కూడా ఎక్కువ భాగం స్థానికీకరణ (లోకలైజేషన్) ఉంటుంది. ఫలితంగా మార్కెట్లో దీని ధర కూడా చాలా పోటీగా ఉండే అవకాశం ఉంది.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

స్కోడా తమ కుషాక్ ఎస్‌యూవీని రూ.10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే మార్కెట్లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, కుషాక్ ధర కన్నా ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ధర తక్కువగా లేదా ఇంచుమించు అదే రేంజ్‌లో ఉండొచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలను రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న నేపథ్యంలో, వీటి కొలతలు, ఈ రెండు కార్లలో లభించే ఫీచర్లు, పరికరాలు, విడిభాగాల్లో కూడా చాలా వరకూ పోలికలు ఉండే అవకాశం ఉంది. కుషాక్ పొడవు 4,221 మిమీ, వెడల్పు 1,760 మిమీ, ఎత్తు 1,612 మిమీ మరియు వీల్‌బేస్ 2,651 మిమీగా ఉంటుంది.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

ఫోక్స్‌వ్యాగన్ ఇటీవల తమ టైగన్ ఎస్‌యూవీ టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో అనేక డిజైన్ అంశాలను కంపెనీ హైలైట్ చేసింది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో క్రోమ్ ప్లేట్‌తో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌లాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

సైడ్‌లో 17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా ఉండే పెద్ద లైట్ బార్ మరియు ఈ లైట్ బార్‌లో విలీనం అయినట్లుగా ఉండే ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ మొదలైన అంశాలను ఈ టీజర్‌లో గమనించవచ్చు.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

టైగన్ ఇంటీరియర్స్‌లో కూడా అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్- స్టాప్ ఫీచర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఆగస్టులో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ బుకింగ్స్ ఓపెన్; క్రెటా, సెల్టోస్‌లకు సవాల్!

ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, టైగన్ వీటిని కుషాక్‌తో పంచుకునే అవకాశం ఉంది. కుషాక్‌లో ఉపయోగించిన అదే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు టైగన్‌లోనూ ఉపయోగించనున్నారు. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి.

Most Read Articles

English summary
Volkswagen Taigun India Launch Around The Corner; Bookings Might Open In August. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X