Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)ను కంపెనీ సెప్టెంబర్ 24 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పటికే Taigun ప్రీ-బుకింగ్‌లను కూడా అధికారికంగా ప్రారంభించింది.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో ఈ విభాగంలో ఇప్పటికే ఆదిపత్యం చలాయిస్తున్న Hyundai Creta తో Volkswagen Taigun నేరుగా పోటీ పడుతుంది. అంతేకాకుండా, ఈ విభాగంలోని ఇతర పాపులర్ మోడళ్లు అయిన Kia Seltos, Tata Harrier, MG Hector మరియు తాజాగా వచ్చిన Skoda Kushaq వంటి మోడళ్లను కూడా Taigun సవాల్ చేస్తుంది.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

స్కోడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు భారతదేశం కోసం సంయుక్తంగా అభివృద్ధి చేసిన పాపులర్ MQB ఆర్కిటెక్చర్ ఆధారంగా ఈ కొత్త Taigun ఎస్‌యూవీ రూపొందించబడింది. తాజాగా Skoda విడుదల చేసిన Kushaq ఎస్‌యూవీని కూడా ఇదే ప్లాట్‌ఫామ్‌పై రూపొందించారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు మోడళ్ల మధ్య అనేక పోలికలు ఉండనున్నాయి.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

Volkswagen Taigun ఎస్‌యూవీని పూణె లోని చాకన్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఈ ఎస్‌యూవీని Volkswagen బ్రాండ్ యొక్క 'ఇండియా ప్రాజెక్ట్ 2.0' లో భాగంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్ట్ క్రింది Volkswagen మరియు Skoda సంస్థలు భారతదేశంలో అనేక కొత్త కార్లను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఈ సరికొత్త Taigun ఎస్‌యూవీని కంపెనీ భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన MQB A0 IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించారు. కంపెనీ ఈ డిజైన్ ప్లాట్‌ఫామ్ ను ప్రత్యేకించి భారతదేశంలో విడుదల చేయబోయే కార్ల కోసం రూపొందించింది. ఇటీవలే విడుదలైన Skoda Kushaq ని కూడా ఇదే ప్లాట్‌ఫారమ్ పై నిర్మించారు.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

Volkswagen Taigun లో గొప్ప ఫీచర్లు

Volkswagen Taigun ఎస్‌యూవీని కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తుండగా, అనేక సార్లు కెమెరాకు చిక్కింది. ఆ సమయంలో ఈ ఎస్‌యూవీలో ఆఫర్ చేసిన కొన్ని ఫీచర్లకు సంబంధించిన కీలక సమాచారం కూడా వెల్లడైంది. ఈ సెగ్మెంట్లోని పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేలా కంపెనీ ఈ కారులో అనేక గొప్ప ఫీచర్లను అందించుంది.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

వీటిలో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్రాండ్ యొక్క లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే సపోర్ట్, బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షన్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, గ్లోవ్ బాక్స్ మరియు లెదర్‌తో చుట్టబడిన గేర్ లివర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఇంకా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పానోరమిక్ సన్‌రూఫ్, యూఎస్‌బి ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. Volkswagen Taigun ఎస్‌యూవీ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో క్రోమ్ ప్లేట్లతో కూడిన పెద్ద గ్రిల్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు 17 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

Volkswagen Taigun ఇంజన్

Skoda Kushaq మాదిరిగానే Volkswagen Taigun కూడా 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. వీటి పవర్, టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజన్లు ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో పాటుగా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభించవచ్చని సమాచారం.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

Volkswagen కొత్త లోగో

ఈ జర్మన్ కార్ బ్రాండ్ Volkswagen ఇటీవలే తమ కొత్త బ్రాండ్ లోగోను భారతదేశంలో పరిచయం చేసింది. కంపెనీ భారతదేశంలోని తమ 150 డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బ్రాండ్ లోగోను ప్రదర్శించింది. ఈ కొత్త లోగో మునుపటి కంటే మరింత ఆకర్షణీయంగా ఉందని మరియు ఇది కంపెనీ ఆవిష్కరణ వ్యూహంపై ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త లోగోతో పాటుగా కస్టమర్‌లతో సమర్థవంతంగా కనెక్ట్ అవ్వడానికి కంపెనీ తమ అన్ని డీలర్‌షిప్‌లలో డిజిటల్ కనెక్టివిటీని కూడా మెరుగుపరిచింది.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

Volkswagen Vento కి రీప్లేస్‌మెంట్ వస్తోంది..

ఇదిలా ఉంటే.. భారత మార్కెట్లో Taigun లాంచ్ తర్వాత Volkswagen మరొక సరికొత్త సెడాన్ మోడల్‌ను పరిచయం చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా దృవీకరించింది. ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ (Volkswagen Virtus) పేరుతో కంపెనీ ఓ మిడ్-సైజ్ సెడాన్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Volkswagen Taigun ఎస్‌యూవీ ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఈ కొత్త Virtus సెడాన్ ప్రస్తుతం Volkswagen బ్రాండ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న Vento సెడాన్ స్థానాన్ని రీప్లేస్ చేయనుంది మరియు మార్కెట్లో ఇది Honda City, Hyundai Verna, Maruti Suzuki Ciaz మరియు Skoda Rapid వంటి మోడళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Volkswagen taigun india launch on 24th september 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X