భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ వాహన తయారీదారు ఫోక్స్‌వ్యాగన్ తన కొత్త టైగన్ ఎస్‌యూవీని 2021 సెప్టెంబర్ మూడవ వారంలో భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపేనీ తన కొత్త టైగన్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

భారతదేశంలో నిరంతరం ఎస్‌యూవీలకు డిమాండ్ పెరిగిపోతోంది. కావున ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఎస్‌యూవీని విడుదలచేయాలని యోచిస్తోంది. టైగన్ ఎస్‌యూవీ MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే స్కోడా యొక్క కుషాక్ కూడా ఆధారపడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ఇటీవల, ఫోక్స్‌వ్యాగన్ ట్విట్టర్‌లో ఒక కస్టమర్‌కు టైగన్ ధరను సెప్టెంబర్ మూడో వారంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు తెలియజేసింది. దీనితో పాటు, అదే సమయంలో మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది, కానీ కంపెనీ ఇంకా అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది, ఈ కొత్త ఎస్‌యూవీ యొక్క ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఫాగ్ ల్యాంప్‌లు మరియు ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లైట్‌బార్‌ టైగన్ డిజైన్‌లో బూట్ లిడ్ పొడవునా పెద్ద యూనిట్‌తో ఉంచబడింది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా ఇందులో 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా మరియు క్రోమ్ గ్రిల్, రూఫ్ రైల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఇంటీరియర్‌ విషయానికి వస్తే, ఇందులో టైగన్ బ్రాండ్ యొక్క వర్చువల్ కాక్‌పిట్ డిజైన్‌ని TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో కలిగి ఉంటుంది. ఇది 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్రాండ్ యొక్క సరికొత్త కనెక్టెడ్ టెక్నాలజీ వంటి వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

పైన చెప్పినవి మాత్రమే కాకుండా ఇందులో 8 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఎసి వెంట్స్, ఫ్రంట్ & రియర్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్ హోల్డర్‌లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్‌పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ ప్రయాణికుల భద్రతకు తోడ్పడుతుంది. ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ అండ్ రియర్ వ్యూ కెమెరా, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగులు మరియు ఏబీఎస్ విత్ ఈబిడి వున్నాయి.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ అత్యంత పోటీతత్వ విభాగంలో ప్రవేశించింది. దేశీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్ వంటి వాటిని ప్రత్యర్థిగా ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ యొక్క కొత్త టైగన్ ఎస్‌యూవీ విడుదల చేయడానికి ముందే దీనిని డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే?

టైగన్ ఎస్‌యూవీ మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా ఇండియా 2.0 ప్లాన్ కింద ఉన్న ఫోక్స్‌వ్యాగన్ యొక్క మొదటి ఎస్‌యూవీ. ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Volkswagen taigun india launch timeline revealed details
Story first published: Friday, August 13, 2021, 13:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X