ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ అతి త్వరలోనే భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన మార్చి నెలలో కంపెనీ ఈ కారును భారత మార్కెట్లో అధికారికంగా ఆవిష్కరించింది. అయితే, ఆ వెంటనే వచ్చిన కరోనా సెకండ్ వేవ్‌తో దీని విడుదల కాస్తంత ఆలస్యమైంది.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఓ కొలిక్కి వస్తుండటంతో ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసే పనులను వేగవంతం చేసింది. తాజాగా కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌కు సంబంధించిన ఓ టీజర్ వీడియోని కంపెనీ విడుదల చేసింది. పసిడి వర్ణంలో ఉన్న ప్రొడక్షన్ వెర్షన్ టైగన్ ఎస్‌యూవీని కంపెనీ ఈ వీడియోలో చూపించింది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఫోక్స్‌వ్యాగన్ ఇండియా 2.0 ప్లాన్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న మొట్టమొదటి మోడల్ ఈ టైగన్ ఎస్‌యూవీ. స్కొడా కుషాక్ ఎస్‌యూవీ మాదిరిగానే టైగన్ ఎస్‌యూవీ తయారీలో కూడా ఎక్కువ భాగం స్థానికీకరణ (లోకలైజేషన్) ఉంటుంది. ఫలితంగా మార్కెట్లో దీని ధర కూడా చాలా పోటీగా ఉండే అవకాశం ఉంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

అంతేకాకుండా, ఈ టైగన్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఫోక్స్‌వ్యాగన్ మరియు స్కొడా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎమ్‌క్యూబి ఏ0 ఇన్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన స్కొడా కుషాక్ ఎస్‌యూవీని కూడా కంపెనీ నేడు (జూన్ 18న) మార్కెట్లో విడుదల చేశారు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

కేవలం రూ.10.49 లక్షల (1.0 లీటర్ టిఎస్, మ్యాన్యువల్) ప్రారంభ ధరతోనే స్కొడా తమ కుషాక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందలో టాప్-ఎండ్ వేరియంట్ (1.5 లీటర్ టిఎస్ఐ 7 డిఎస్‌జి ఆటోమేటిక్) ధర రూ.17.59 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఈ నేపథ్యంలో, కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ ధరలు కూడా ఇంచు మించు ఇదే రేంజ్‌లో ఉంటాయని అంచనా. అంతేకాకుండా, స్కొడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీలను రెండింటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్న నేపథ్యంలో, వీటి కొలతలు, ఈ రెండు కార్లలో లభించే ఫీచర్లు, పరికరాలు, విడిభాగాల్లో కూడా చాలా వరకూ పోలికలు ఉండే అవకాశం ఉంది.

స్కొడా మరియు ఫోక్స్‌వ్యాగన్ సంస్థలు ఈ కొత్త 'ఎమ్‌క్యూబి ఏ0 ఇన్' అనే వాహన ప్లాట్‌ఫామ్‌‌ను ప్రత్యేకించి భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేశాయి. భవిష్యత్తులో ఈ ప్లాట్‌ఫామ్ ఇరు సంస్థల నుండి అనేక కొత్త కార్లు కూడా రాబోతున్నాయి. గతంలో కూడా ఫోక్స్‌వ్యాగన్ తమ టైగన్ ఎస్‌యూవీకి సంబంధించిన ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో కంపెనీ తమ ఎస్‌యూవీ డిజైన్ ఫీచర్లను హైలైట్ చేసింది. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో క్రోమ్ ప్లేట్‌తో కూడిన పెద్ద గ్రిల్, ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌లాంప్స్, 17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో టైగన్ బూట్ లిడ్ పొడవు అంతటా ఉంజే పెద్ద లైట్ బార్ మరియు ఈ లైట్ బార్‌లో విలీనం చేసినట్లుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఫోక్స్‌వ్యాగన్ బ్యాడ్జ్ మొదలైన అంశాలను గమనించవచ్చు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ప్రీమియం లుకింగ్ క్యాబిన్ లేఅవుట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్- స్టాప్ ఫీచర్ మరియు ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ సపోర్ట్ వంటి లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగులు, ఈబిడి మరియు ఈఎస్‌సితో కూడిన ఏబిఎస్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, స్కొడా కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించిన ఇంజన్లనే ఈ టైగన్ ఎస్‌యూవీలోనూ ఉపయోగించనున్నట్లు సమాచారం.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ కొత్త టీజర్ వీడియో రిలీజ్; త్వరలోనే మార్కెట్లో విడుదల!

ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉండన్నాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. కుషాక్ మాదిరిగానే టైగన్‌లో కూడా డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉండకపోవచ్చు. ఈ ఎస్‌యూవీకి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Volkswagen Taigun New Teaser Video Released; India Launch Expected Very Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X