Just In
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 2 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 3 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎట్టకేలకు భారత్‌లో విడుదలైన కొత్త Volkswagen Taigun; ధర & వివరాలు
భారతీయ మార్కెట్లో ఎంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun) ఎట్టకేలకు విడుదలైంది. ఈ కొత్త SUV ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 10.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). Taigun యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభించబడ్డాయి.
Volkswagen Taigun రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి 'స్టాండర్డ్ వేరియంట్' కాగా, మరొకటి 'జిటి వేరియంట్'. ఈ కొత్త SUV రెండు ఇంజిన్లు మరియు మూడు ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడుతుంది. కొత్త Taigun ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.
Volkswagen Taigun వేరియంట్ వారీ ధరలు:
Volkswagen Taigun | Price |
Comfortline MT | ₹10,49,900 |
Highline MT | ₹12,79,900 |
Highline AT | ₹14,09,900 |
Topline MT | ₹14,56,900 |
Topline AT | ₹15,90,900 |
GT MT | ₹14,99,900 |
GT Plus DSG | ₹17,49,900 |
కలర్ ఆప్సన్స్:
కొత్త Volkswagen Taigun మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.
అవి :
- కుర్కుమా ఎల్లో
- వైల్డ్ చెర్రీ రెడ్
- కాండీ వైట్
- రిఫ్లెక్స్ సిల్వర్
- కార్బన్ స్టీల్ గ్రే
- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
- టైర్ ప్రెషన్ డిఫ్లేటింగ్ వార్ణింగ్
- పార్క్ డిస్టెన్స్ కంట్రోల్
- రియర్ వ్యూ కెమెరా
- హిల్ హోల్డ్ కంట్రోల్
- 6 ఎయిర్‌బ్యాగులు
- ఏబీఎస్ విత్ ఈబిడి
- ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ వంటివి ఉన్నాయి.
Volkswagen Taigun అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది MQB-AO-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ముందుభాగంలో, ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బంపర్‌లో ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్‌లను కూడా పొందుతుంది. ముందు బంపర్‌లో బ్లాక్డ్ అవుట్ హనీకూంబ్ గ్రిల్ కూడా చూడవచ్చు. బోనెట్‌పై లైన్స్ కూడా గమనించవచ్చు. ఇందులోని వీల్ ఆర్చెస్ కారుని మరింత స్టైలిష్ గా కనిపించేలా చేస్తాయి.
Taigun SUV ఆల్‌రౌండ్ క్లాడింగ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది. రియర్ ప్రొఫైల్ ఒక ఎల్ఈడీ బార్‌తో ఒక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ కలిగి ఉండి, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, రూఫ్ రైస్, డ్యూయల్ టోన్ ORVM వంటివి కూడా ఉన్నాయి.
Volkswagen Taigun కలర్ ఫుల్ ప్రీమియం ఇంటీరియర్లను కలిగి ఉంది. ఇది డ్యూయల్ టోన్ ఇంటీరియర్ అయితే డాష్‌బోర్డ్ వెండి స్ట్రిప్‌ను అందుకుంటుంది. ఇది ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్‌తో వస్తుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Taigun SUV లో 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ కూడా ఉన్నయి. ఇందులో ఉన్న 8.0 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కారు యొక్క స్పీడ్, యావరేజ్ స్పీడ్, యావరేజ్ ఫ్యూయెల్ కెపాసిటీ, ఓడోమీటర్, రేంజ్ లెఫ్ట్ వంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.
వీటితో పాటు Volkswagen Taigun వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ అండ్ రియర్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లు, కప్హోల్డర్లతో సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెడ్ యాంబియంట్ లైటింగ్ మరియు స్మార్ట్ టచ్ క్లైమాట్రానిక్ ఆటో ఏసీ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
Volkswagen Taigun అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.ఇందులో
Volkswagen Taigun యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది రెండు ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. ఇందులో ఒకటి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కాగా, రెండవది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇందులోని 1.0-లీటర్ ఇంజిన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 113 బిహెచ్పి పవర్ మరియు 1750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో జతచేయబడింది.
ఇక 1.5-లీటర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 5000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 148 బిహెచ్పి శక్తిని మరియు 1500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. జిటి వేరియంట్లో 1.5-లీటర్ టీఎస్ఐ ఇంజిన్‌తో ప్రామాణికంగా అందించబడుతుంది.
భారతీయ మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ అత్యంత పోటీతత్వ విభాగంలో ప్రవేశించింది. Volkswagen Taigun భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత Hyundai Creta, Kia Seltos మరియు Skoda Kushaq వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల మేము Volkswagen Taigun డ్రైవ్ చేసాము. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.