కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో ఆవిష్కరించిన సరికొత్త టైగన్ ఎస్‌యూవీ విడుదల మరింత ఆలస్యమయ్యేటట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ప్రస్తుత మే నెలలోనే ఈ ఎస్‌యూవీ విడుదల కావల్సి ఉన్నప్పటికీ, దేశంలో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

తాజాగా ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మోడల్ టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకు చిక్కింది. ఎలాంటి క్యామోఫ్లేజ్ లేకుండా ఈ మోడల్‌ను పరీక్షించడాన్నిఈ ఫొటోలు మరియు వీడియోలో చూడొచ్చు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, కంపెనీ ఈ కారును జూన్ 2021 లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ స్పై వీడియోలో ఈ ఎస్‌యూవీ యొక్క రోడ్ ప్రజెన్స్‌ను మనం చూడొచ్చు. ఇందులో టైగన్ యొక్క రెండు వేరియంట్లను పరీక్షించినట్లుగా తెలుస్తోంది. జాగ్రత్తగా చూస్తే ఈ రెండు వేరియంట్ల మధ్య తేడాలు సులువుగా అర్థమవుతాయి. ఈ ఎస్‌యూవీని అనేక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ మరియు ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ హై-ఎండ్ వేరియంట్లలో, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల పైభాగంలోనే ఎల్ఈడి డిఆర్ఎల్‌లను అమర్చారు. అలాగే, లోవర్ వేరియంట్లలో ట్విన్ పాడ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు చిన్న ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ఇవ్వబడ్డాయి. బేస్ వేరియంట్లలో ఫాగ్ ల్యాంప్స్ లేవు, అలాగే వీటిలో ప్రత్యేకమైన డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ఈ రెండు వేరియంట్లలో రూఫ్ రైల్స్ కలర్ ఆప్షన్స్ కూడా వేర్వేరుగా ఉన్నాయి. లోయర్ వేరియంట్లో బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ ఉండగా మరియు హై వేరియంట్లలో సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ ఉన్నాయి. ముందు భాగంలో డ్యూయల్ క్రోమ్ స్లేట్ గ్రిల్ ఉంటుంది, బంపర్‌లో సన్నని క్రోమ్ స్లేట్ ఉంది మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా కనిపిస్తుంది.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఇందులోని ఎయిర్ డ్యామ్, హెక్సాగనల్ గ్రిల్ చదరపు డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా ఉంటుంది. అయితే, దీని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి మోడళ్ల మాదిరిగానే ఉంటుంది. క్యాబిన్ లోపల డిజైన్ చాలా సింపుల్‌గా మరియు క్లీన్‌గా అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ ఉపరితలం ఫ్లాట్‌గా ఉంటుంది మరియు దానిపై సరళంగా కనిపించే స్విచ్‌లు, బటన్లు ఉంటాయి.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఇంటీరియర్స్‌లో డ్యూయెల్ టోన్ క్యాబిన్ ఉంటుంది. ఇంకా ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. స్కొడా ఆటో నుండి రాబోయే కుషాక్ ఎస్‌యూవీలో ఉపయోగించే ఇంజన్లనే ఈ ఫోక్స్‌వ్యాగన్ టైగన్‌లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఇందులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కారులో అధునాతన డ్రైవర్-అసిస్టెంట్ సిస్టమ్‌ను (ఏడిఏఎస్)ను కూడా అందివచ్చని సమాచారం.

కరోనా కారణంగా బ్రేక్ పడిన ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ లాంచ్; లేటెస్ట్ స్పై పిక్స్

ఏడిఏఎస్‌లో లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు. ఈ ఫంక్షన్ల కోసం, కంపెనీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ బటన్లను అందించే అవకాశం ఉంది. అలాగే, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లోని వాటి వినియోగాన్ని కూడా గుర్తించే వెసలుబాటు ఉంటుంది.

Most Read Articles

English summary
Volkswagen Taigun SUV Spied Testing Without Camouflage, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X