కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తమ కొత్త 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ (New Tiguan Facelift) మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం, ఫోక్స్‌‌వ్యాగన్ ఇండియా ఈ కొత్త ఎస్‌యూవీని డిసెంబర్ 7, 2021వ తేదీన దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఇప్పటికే ఈ కొత్త కారును తమ అధికారిక ఇండియన్ వెబ్‌సైట్ లో కూడా లిస్ట్ చేసింది మరియు ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

భారతదేశంలో ఈ జర్మన్ బ్రాండ్ తమ 'ఇండియా 2.0' స్ట్రాటజీలో భాగంగా ఈ ఫేస్‌లిఫ్టెడ్ 5-సీటర్ టిగువాన్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టబోతోంది. ఈ స్ట్రాటజీలో భాగంగా, ఫోక్స్‌వ్యాగన్ భారతదేశం కోసం ప్రకటించిన నాలుగు ఎస్‌యూవీలలో కొత్త 2021 టిగువాన్ (Volkswagen Tiguan) ఫేస్‌లిఫ్ట్ కూడా ఒకటి. ఇది మునుపటి మోడల్ కన్నా మరింత మెరుగైన డిజైన్, ఫీచర్లు మరియు రీఫైన్ చేయబడిన బిఎస్6 పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తోంది.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

అప్‌డేటెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ గడచిన సంవత్సరంలోనే పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారతదేశంలో ఈ కారు విడుదల ఆలస్యమైంది. అయితే, ఇప్పుడు ఇది ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఫోక్స్‌వ్యాగన్ ఇండియా దేశీయ విపణిలో కొత్తగా 4 ఎస్‌యూవీలను ప్రవేశపెట్టనున్నట్లు గతంలో వెల్లడించింది. వీటిలో సరికొత్త టైగన్, 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్, కొత్త టి-రోక్ మరియు సరికొత్త టిగువాన్ ఆల్‌స్పేస్ 7-సీటర్ ఎస్‌యూవీలు ఉన్నాయి.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

ఈ జాబితా నుండి ఇప్పటికే టైగన్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలైంది మరియు ఇది మార్కెట్లో జోరుగా అమ్ముడుపోతోంది. కాగా, ఈ జాబితా నుండి వస్తున్న రెండవ మోడల్ కొత్త 2021 టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ 5-సీటర్ ఎస్‌యూవీ. ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు ముందు లభించిన టిగువాన్ మాదిరిగానే, కొత్త 2021 టిగువాన్ కూడా భారతదేశంలోని మిడ్-సైజ్ ప్రీమియం ఎస్‌యయూవీ విభాగంలో విడుదల కానుంది. ఇది ఈ విభాగంలో కొత్తగా రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి మోడళ్లతో పోటీపడనుంది.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా రిఫ్రెష్డ్ స్టైలింగ్‌ మరియు మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ తో రానుంది. దీని ముందు భాగం డిజైన్ చాలా సన్నగా సెడాన్ మరియు ఎస్‌యూవీల కలయికలా అనిపిస్తుంది. క్రోమ్ గార్నిష్ తో కూడిన స్లీక్ ఫ్రంట్ గ్రిల్, డ్యూయెల్ ఎల్ఈడి మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్‌లు మరియు సన్నటి డ్యూయెల్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేసిన డ్యూయెల్ టోన్ ఫ్రంట్ బంపర్, ట్రయాంగ్యులర్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ తో ముందు వైపు నుండి ఇది చాలా షార్ప్ గా కనిపిస్తుంది.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

సైడ్ ప్రొఫైల్‌ని గమనిస్తే, షార్ప్ షోల్డర్ లైన్స్, స్టైలిష్ 18 ఇంచ్ ఫ్రాంక్‌ఫర్ట్ డిజైన్ అల్లాయ్ వీల్స్‌, టర్న్ ఇండికేటర్లతో కూడిన డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్లు, బ్లాక్అవుట్ చేసిన B మరియు C పిల్లర్స్, సిల్వర్ కలర్ పంక్షనల్ రూఫ్ రెయిల్స్, కారు చుట్టు బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, విండో లైన్స్ చుట్టూ క్రోమ్ గార్నిష్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వెనుక వైపు డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేనప్పటికీ, ఇందులో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ మరియు వెనుక బంపర్ ను రీడిజైన్ చేశారు.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని లైట్స్ అడాప్టివ్ కంట్రోల్ తో కూడిన ఇంటెలిజెంట్ ఐక్యూ లైట్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఇవి కంట్రీ లైట్, డైనమిక్ బెండింగ్ లైట్స్ మరియు పూర్-వెథర్ లైట్స్ అనే మూడు రకాల లైటింగ్ మోడ్స్ ని కలిగి ఉంటాయి. రైడ్ చేసే సమయం మరియు రోడ్డు పరిస్థితిని బట్టి ఇవి ఆటోమేటిక్ గా ఎంగేజ్ అవుతాయి. ఇందులో ఎల్ఈడి కార్నరింగ్ లైట్స్ కూడా ఉంటాయి, ఇవి రోడ్డు మలుపుల వద్ద ఎక్కువ కాంతిని అందించడంలో సహాయపడుతాయి. ఈ కారులోని లైట్లు అన్నీ కూడా పూర్తిగా ఎల్ఈడిల రూపంలో ఉంటాయి.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

ఇక ఈ కారులోని ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రీమియం వియన్నా లెదర్ సీట్లు, ప్రకాశవంతమైన స్కఫ్ ప్లేట్లు, ప్రీమియం అనుభూతిని పెంచే క్రోమ్ యాక్సెంట్స్, విశాలమైన పానోరమిక్ సన్‌రూఫ్, 30 షేడ్స్‌తో కూడిన యాంబియెంట్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ గేర్ నాబ్, TFT స్క్రీన్‌తో కూడిన డిజిటల్ కాక్‌పిట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్ అండ్ స్లైడ్ ఏసి కంట్రోల్స్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ మరియు మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ యాప్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

అంతేకాకుండా, ఈ కారులో లెథర్ తో చుట్టబడిన ఫ్లాట్ బాటమ్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 3-మెమరీ సెట్టింగ్స్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, రిమోట్ బూట్ లాక్ అండ్ అన్‌లాక్, 3 జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, లెథర్ తో చుట్టబడిన స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్ మరియు స్లైడింగ్ రియర్ బెంచ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో ABS, ESP, ASR, EDL, ఆటో-హోల్డ్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక సీటుపై 3 హెడ్‌రెస్ట్‌లు మరియు డ్రైవర్ అలెర్ట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

కొత్త 2021 Volkswagen Tiguan ఫేస్‌లిఫ్ట్ మోడల్ లాంచ్ తేదీ వెల్లడి.. ఇందులో కొత్తగా ఏముందంటే..?

ఇక చివరిగా ఇంజన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో లభ్యం కానుంది. ఇందులో బిఎస్6 కంప్లైంట్ 2.0 లీటర్, ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి శక్తిని మరియు 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త టిగువాన్ 4మోషన్ ఆల్-వీల్ డ్రైవ్ (4Motion AWD) సిస్టమ్‌తో లభ్యం కానుంది.

Most Read Articles

English summary
Volkswagen tiguan facelift to launch in india on 7th december details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X