మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

ప్రముఖ స్వీడన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ తన కొత్త ఉత్పత్తులను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పుడు వోల్వో కంపెనీ భారత మార్కెట్ కోసం 2021 సంవత్సరానికి ఒక ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం కొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేయనుంది.

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

వోల్వో కంపెనీ 2021 లో మూడు ఉత్పత్తులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉత్పత్తులలో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, వోల్వో ఎక్స్‌సి 40 రీఛార్జ్, దీని బుకింగ్ జూన్ 2021 నాటికి ప్రారంభం కానుంది.

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

ఇది మాత్రమే కాకుండా వోల్వో ఇండియా మరో రెండు ఉత్పత్తులను విడుదల చేయనుంది. అవి వోల్వో ఎస్ 90 ప్రీమియం సెడాన్, రెండవ వోల్వో ఎక్స్‌సి 60 ఎస్‌యూవీలు. కంపెనీ యొక్క ఎక్స్‌సి 60 అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తోంది.

MOST READ:2021 హోండా సన్‌చాసర్స్ రైడ్ స్టార్ట్.. వివరాలు కోసం ఇక్కడ చూడండి

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

అప్డేట్ చేయబడిన ఎక్స్‌సి 60 మరియు ఎస్ 90 ఈ ఏడాది చివరి నాటికి కంపెనీ ఈ రెండు కార్లను భారత మార్కెట్లో విడుదలకు సైద్దమవుతున్నట్లు కంపెనీ తెలిపింది.

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ రెండు కార్లు యాంత్రికంగా అప్డేట్ చేయబడవు, కానీ ఆండ్రాయిడ్ బేస్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఆటో పార్కింగ్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్స్ ఈ రెండు కార్లలోనూ అందుబాటులో ఉంచబడతాయి.

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

వోల్వో కంపెనీ తన ఎక్స్‌సి60 ను మొమెంటం మరియు ఇన్స్క్రిప్షన్ అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం ఈ కారు ధర రూ. 52.9 లక్షల నుంచి రూ. 59.9 లక్షల వరకు ఉంది. ఎక్స్‌సి60 దాని పెద్ద వెర్షన్ అయిన ఎక్స్‌సి90 మాదిరిగానే స్కేలబుల్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుంది.

MOST READ:ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

దీనితో పాటు, ఈ కారులో దాని పెద్ద వెర్షన్ నుండి అనేక డిజైన్ ఎలిమెంట్స్ మరియు అనేక ఫీచర్లను తీసుకుంటుంది. ఇది కొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు పునః రూపకల్పన చేసిన ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌ను కలిగి ఉంది, ఇది మొత్తం గ్రిల్‌కు విస్తరించింది.

మీకు తెలుసా.. భారత్‌లో విడుదల కానున్న వోల్వో కార్స్, ఇవే

వోల్వో ఇండియా ఎక్స్‌సి 60 ను ఒకే డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ కారు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ వస్తుంది. ఇది 235 బిహెచ్‌పి పవర్ మరియు 480 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేయబడి ఉంటుంది. వోల్వో ఎక్స్‌సి 60 భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 3, ఆడి క్యూ 5, జాగ్వార్ ఎఫ్-పేస్, జీప్ రాంగ్లర్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:కారులోపల అలంకరణ వస్తువులున్నాయా.. వెంటనే తీసెయ్యండి, లేకుంటే..

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
New Volvo XC60 & S90 Launch Details In India. Read in Telugu.
Story first published: Wednesday, March 10, 2021, 13:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X