కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

స్వీడన్ కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా (Volvo India) తమ కస్టమర్ల యాజమాన్య అనుభవాన్ని మార్చడానికి ఓ మెరుగైన పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా, వోల్వో ఇండియా తమ కొత్త కస్టమర్ల కోసం విడిభాగాలపై జీవితకాలపు (లైఫ్‌టైమ్) వారంటీని అందించనుంది. ఇది భారతీయ మార్కెట్ కోసం మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

సమాచారం ప్రకారం, వోల్వో ఇండియా తమ కొత్త కార్లపై 'లైఫ్‌టైమ్ పార్ట్స్ వారంటీ'ని అందించనుంది. ఈ పాలసీ ప్రామాణిక (స్టాండర్డ్) వారంటీ వ్యవధి ముగిసిన తర్వాత కొనుగోలు చేయబడిన అన్ని విడిభాగాలను కవర్ చేస్తుంది మరియు వోల్వో అధీకృత వర్క్‌షాప్‌లలో కొనసాగించబడుతుంది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

ఈ కొత్త వారెంటీ పథకం అక్టోబర్ 2021 నుండి కొనుగోలు చేయబడిన అన్ని విడిభాగాలకు వర్తిస్తుంది మరియు కార్మిక మరియు విడిభాగాల భాగం ఖర్చు రెండింటినీ కవర్ చేస్తుంది. విడిభాగాలను కొనుగోలు చేసిన తర్వాత, ఈ పథకం చాలా ప్రభావవంతంగా ఉంటుంది మరియు వాహనం యాజమాన్యంలో ఎలాంటి మార్పు రానంత వరకు చెల్లుబాటు అవుతుంది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

ఈ పథకానికి సంబంధించి, మెటీరియల్ లేదా తయారీ లోపం కారణంగా రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ అవసరమయ్యే ఏదైనా భాగాన్ని, ఏదైనా అధీకృత వోల్వో వర్క్‌షాప్‌లో ఉచితంగా భర్తీ చేస్తామని వోల్వో ఇండియా తెలిపింది. అయితే, ఈ వారంటీ పథకం కోసం కొన్ని నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయని కంపెనీ తెలిపింది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

హార్డ్‌వేర్ రీప్లేస్‌మెంట్‌తో సంబంధం లేని భాగాలు, వినియోగ వస్తువులు, బ్యాటరీలు, ఉపకరణాలు (యాక్ససరీస్) మరియు సాఫ్ట్‌వేర్‌ల సాధారణ వేర్ అండ్ టేర్ లకు ఈ లైఫ్‌టైమ్ వారంటీ స్కీమ్ వర్తించదు. అలాగే ఈ కొత్త కారు పొడిగించిన లేదా గుడ్‌విల్ వారంటీ కింద భర్తీ చేయబడిన భాగాలను కవర్ చేయదు.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

ప్రస్తుతం, వోల్వో ఇండియా యొక్క భారతీయ పోర్ట్‌ఫోలియోలో వోల్వో ఎస్60, ఎస్90, ఎక్స్‌సి40, ఎక్స్‌సి60 మరియు వోల్వో ఎక్స్‌సి90 మోడళ్లతో కలిపి మొత్తం ఐదు కార్లు అమ్మకానికి ఉన్నాయి. ఇవి కాకుండా, కంపెనీ త్వరలో వోల్వో ఎక్స్‌సి60 ఫేస్‌లిఫ్ట్ మరియు ఎస్90 ఫేస్‌లిఫ్ట్, వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ మరియు వోల్వో వి60 క్రాస్ కంట్రీ మోడళ్లను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

వోల్వో ఇండియా ఈ ఏడాది మార్చ్ నెలలో కొత్త వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అనే ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది మరియు జూన్ నెలలో ఈ మోడల్ కోసం ప్రీ-బుకింగ్‌ లను కూడా ప్రారంభించింది. ఈ అక్టోబర్ నెలలో వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ భావించింది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

అయితే, ఇప్పుడు కంపెనీ దాని లాంచ్ ప్లాన్‌ను మార్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని 2022 సంవత్సరం మొదటి త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు ఇటీవల వెల్లడైంది. వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్, ఈ బ్రాండ్ నుండి దేశంలోనే మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అవుతుంది. కంపెనీ ఈ కారును కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు) మార్గంలో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత మార్కెట్ కు దిగుమతి చేసుకోనుంది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారులో రెండు 150 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్లు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. ఇవి రెండూ కలిసి గరిష్టంగా 402 బిహెచ్‌పి శక్తిని మరియు 659 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 78 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. ఇది కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 400 కి.మీ వరకూ రేంజ్‌ను కలిగి ఉంటుంది మరియు ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో కేవలం 40 నిమిషాల్లో బ్యాటరీని 80 శాతం వరకు చార్జ్ చేసుకోవచ్చు. ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రన్-ఆఫ్ రోడ్ మిటిగేషన్, రన్-ఆఫ్ రోడ్ ప్రొటెక్షన్, లేన్ కీపింగ్ ఎయిడ్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్, విప్లాష్ ప్రొటెక్షన్ సిస్టమ్, ఐఎస్ఓఫిక్స్ అటాచ్మెంట్, బ్లైండ్ స్టీర్ అసిస్ట్‌తో కూడిన స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

Volvo XC60 పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ వస్తోంది..

ఇదిలా ఉంటే, వోల్వో భారత మార్కెట్లో మరో కొత్త కారును విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గ్లోబల్ మార్కెట్లలో వోల్వో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ వోల్వో ఎక్స్‌సి60 (Volvo XC60) పెట్రోల్ వెర్షన్ యొక్క మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ ను కంపెనీ దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు ఓ టీజర్ ద్వారా వెల్లడించింది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ మోడల్ యొక్క కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో పాటుగా మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుత ఆధునిక యుగానికి అనుగుణంగా కంపెనీ ఈ ఎస్‌యూవీని స్మార్ట్ కారుగా రూపొందించినట్లు కంపెనీ తమ టీజర్ లో తెలిపింది.

కొత్త కస్టమర్లకు విడిభాగాలపై జీవితకాలపు వారంటీని అందిస్తున్న Volvo India

కొత్త వోల్వో ఎక్స్‌సి60 ఎస్‌యూవీ పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ వెర్షన్ లో లేటెస్ట్ ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, 3డి మెటల్ లోగో, పూర్తి ఎల్‌ఈడి టెయిల్‌ల్యాంప్స్, సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు అధునాతన డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులోని కొత్త మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ కారణంగా ఇంధన సామర్థ్యం (మైలేజ్) కూడా మెరుగ్గా ఉంటుంది.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo india new customers to get lifetime warranty on parts details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X