భారతీయ మార్కెట్‌కి Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

స్వీడిష్ కార్ల తయారీ సంస్థ Volvo (వోల్వో) భారతీయ మార్కెట్లో కొత్త హైబ్రిడ్ మోడల్స్ అయిన Volvo S90 మరియు Volvo XC60 ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్స్ ధర రూ. 61.90 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ రెండు కార్లు పెట్రోల్ ఇంజిన్‌తో 48V బ్యాటరీని ఉపయోగిస్తాయి, ఇది బ్రేకులు వేసినప్పుడు ఛార్జ్ అవుతుంది. ఈ హైబ్రిడ్ కార్లు మంచి ఇంధన సామర్థ్యాన్ని అందిస్తూ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తాయి.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

Volvo S90 (వోల్వో ఎస్90) ఫుల్ సైజ్ సెడాన్. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి ఆకర్శణీయంగా ఉంటుంది. ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. Volvo S90 ముందువైపు వోల్వో యొక్క సిగ్నేచర్ క్రోమ్ గ్రిల్, సన్నని ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ మరియు బంపర్‌లపై క్రోమ్ లైనింగ్‌ వంటివి వాటిని పొందుతుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

S90 వెనుక భాగంలో ఎల్ఈడి టెయిల్ లైట్లు, బూట్ డోర్‌పై వోల్వో యొక్క 3D బ్యాడ్జింగ్ మరియు బ్యాక్ బంపర్‌లో క్రోమ్ లైనింగ్ కూడా ఇవ్వబడ్డాయి. ఈ కారులో 8-స్పోక్ అల్లాయ్ వీల్ కలిగి ఉండి, చాలా లగ్జారీగా కనిపిస్తుంది. కొత్త S90 సెడాన్ క్రిస్టల్ వైట్, బ్రైట్ సిల్వర్, ఒనిక్స్ బ్లాక్ మరియు డెనిమ్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది,

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

Volvo XC60 విషయానికి వస్తే, ఇది ఫుల్ సైజ్ SUV. ఈ SUV ముందు భాగంలో సన్నని ఎల్ఈడీ హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్, క్రోమ్ గ్రిల్ మరియు ఫాగ్ ల్యాంప్ హౌసింగ్‌పై క్రోమ్ యాక్సెంట్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఈ SUV ఒక 3D వోల్వో బ్యాడ్జ్‌తో పాటు వెనుక భాగంలో పెద్ద క్రోమ్ స్కిడ్ ప్లేట్‌ను కూడా పొందుతుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదల్ చేసిన కొత్త రెండు వోల్వో కార్లు సన్‌రూఫ్ మరియు బాడీ-కలర్ ORVM లను పొందుతాయి. ఇవి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా, వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభవాన్ని అందిస్తుంది. కొత్త XC60 క్రిస్టల్ వైట్ పెర్ల్, ఓస్మియం గ్రే, ఒనిక్స్ బ్లాక్, డెనిమ్ బ్లూ, పైన్ గ్రే మరియు ఫ్యూజన్ రెడ్ కలర్స్‌లో అందించబడుతుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

కొత్త వోల్వో కార్ల యొక్క ఫీచర్స్ విషయానికొస్తే, ఈ రెండు మోడల్స్ ఇప్పుడు 'అడ్వాన్స్‌డ్ ఎయిర్ క్లీనర్' సిస్టమ్‌ను పొందుతాయి, ఇది క్యాబిన్ గాలిని ఫిల్టర్ చేస్తుంది మరియు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై గాలి నాణ్యతను ప్రదర్శిస్తుంది. ఇది స్మార్ట్‌ఫోన్ లాంటి అనుభవాన్ని అందించడానికి వోల్వో కార్స్ యాప్ కనెక్టెడ్ కార్ టెక్ పొందుతుంది. ఇందులో వోల్వో యొక్క బ్లైండ్ స్పాట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

అంతే కాకుండా S90 లో 360-డిగ్రీ కెమెరా, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 19-స్పీకర్, 1,400W బోవర్స్ మరియు విల్కిన్స్ ఆడియో సిస్టమ్, వంటివి వాటిని పొందుతుంది. XC60 క్రూయిజ్ కంట్రోల్ మరియు 15-స్పీకర్, 1,100W బోవర్స్ మరియు విల్కిన్స్ ఆడియో సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

ఇంజిన్ విషయానికి వస్తే, వోల్వో ఎస్ 90 మోడల్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 48 వి లైట్ వెయిట్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జతచేయబడింది. ఈ ఇంజన్ 250 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

అదేవిధంగా వోల్వో ఎక్స్‌సి 60 విషయానికి వస్తే, ఇది 250 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ అందించే లైట్ వెయిట్ హైబ్రిడ్ ఇంజిన్‌ పొందుతుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

వోల్వో కార్లలో గూగుల్ సర్వీస్, అడ్వాన్స్‌డ్ ఎయిర్ క్లీనర్ మరియు వోల్వో ఇన్-కార్ యాప్‌తో సహా అనేక హైటెక్ ఫీచర్లు ఉన్నాయి. కారులోని అనేక ఫీచర్లను కంట్రోల్ చేయడానికి గూగుల్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్ కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది.

భారతీయ మార్కెట్లో Volvo నుంచి మరో రెండు కొత్త కార్లు: పూర్తి వివరాలు

భారతీయ మార్కెటు విడుదలైన కొత్త వోల్వో ఎస్ 90 మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, ఆడి ఎ 6 మరియు జాగ్వార్ ఎక్స్‌ఎఫ్‌ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. అదే విధంగా కంపెనీ యొక్క XC60 మోడల్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి, బీఎండబ్ల్యూ ఎక్స్3 మరియు రాబోయే ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #వోల్వో #volvo
English summary
Volvo s90 xc60 launched in india price features specifications details
Story first published: Tuesday, October 19, 2021, 16:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X