2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

కొత్త సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ వినియోగదారుల కోసం సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో భారతదేశంలో టాటా మోటార్స్ మరియు మహీంద్రా కార్లకు ప్రజాదరణ గణనీయంగా పెరుగుతోంది. గతేడాది చివర్లో మహీంద్రా ప్రవేశపెట్టిన కొత్త తరం థార్ (Mahindra Thar) ఎస్‌యూవీతో కంపెనీ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సరికొత్త ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) ఎస్‌యూవీతో కస్టమర్లకు మరింత చేరువ అయ్యింది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

కంపెనీ ఈ ట్రెండ్ ను ఇలానే కొనసాగించేందుకు కొత్త సంవత్సరంలో మరిన్ని కొత్త కార్లను విడుదల చేయాలని చూస్తోంది. వీటిలో కొన్ని పూర్తిగా కొత్త మోడళ్లు ఉంటే, మరికొన్ని రిఫ్రెష్డ్ వెర్షన్లు లేదా కొత్త వేరియంట్లుగా ఉండబోతున్నాయి. వీటిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 6-సీట్ వేరియంట్, థార్ యొక్క 5-డోర్ వెర్షన్, కొత్త తరం 2022 స్కార్పియో మరియు ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లు ఉన్నాయి. కంపెనీ, ఇప్పటికే వీటిలో చాలా మోడళ్లను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

1. మహీంద్రా XUV700 6-సీటర్ (Mahindra XUV700 6-Seater)

మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మహీంద్రా ఎక్స్‌యూవీ700 ప్రస్తుతం 5-సీట్లు మరియు 7-సీట్ల కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. అయితే, కంపెనీ ఇందులో మధ్య వరుసలో బెంచ్ సీటుకు బదులుగా కెప్టెన్ సీట్లతో కూడిన 6-సీటర్ వెర్షన్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త సీట్ ఎంపిక AdrenoX యాప్‌లో కూడా కనిపించింది. అయితే, కంపెనీ మాత్రం ఈ సమాచారాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. కొత్త సంవత్సరంలో ఇది విడుదల కావచ్చని తెలుస్తోంది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

కొత్త 6-సీటర్ వెర్షన్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీలో కేవలం సీట్ల మార్పు మినహా ఇంజన్ మరియు ఇతర మెకానికల్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని కంపెనీ మొదట్లో మార్కెట్లో విడుదల చేసినప్పుడు దాని బేస్ వేరియంట్ (ఎమ్ఎక్స్ 5 సీటర్ వేరియంట్) ధరను కేవలం రూ. 11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) లకే విక్రయించింది. అయితే, కంపెనీ ఈ ప్రారంభ ధరను కేవలం మొదటి 25,000 యూనిట్ల బుకింగ్ లకు మాత్రమే పరిమితం చేసింది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

మొదటి 25,000 యూనిట్ల బుకింగ్‌లు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ కారును బుక్ చేసుకున్న వారందరికీ కంపెనీ పెరిగిన ధరలను వర్తింపజేసింది. ఈ మోడల్ యొక్క పెట్రోల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను కంపెనీ సుమారు రూ.50,000 మేర పెంచి రూ. 12.49 లక్షలు మరియు డీజిల్ వెర్షన్ (ఎమ్ఎక్స్ మ్యాన్యువల్) ను రూ. 12.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) చేసింది. ఇవే కాకుండా ఇతర వేరియంట్ల ధరలు కూడా పెరిగాయి.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

2. మహీంద్రా థార్ 5-డోర్ (Mahindra Thar 5-Door Version)

భారతదేశంలో లభిస్తున్న అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ (4-స్టార్ సేఫ్టీ రేటింగ్) కూడా ఒకటి. గతేడాది చివర్లో మార్కెట్లో విడుదలైన మహీంద్రా థార్ అటు ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ప్రియులను ఇటు ఆన్-రోడ్ ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ 3-డోర్ వెర్షన్ లో మూడు టాప్స్ (హార్డ్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబల్ టాప్) ఆప్షన్లతో అందించబడుతోంది. అయితే, కంపెనీ ఇందులో మరింత రోడ్ స్పెక్ మోడల్ గా ఉండే ఓ 5-డోర్ వెర్షన్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

మహీంద్రా అండ్ మహీంద్రా 2026 నాటిరి భారతదేశంలో 9 ఎస్‌యూవీ మోడళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. వాటిలో ఈ 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్ కూడా ఒకటి. మహీంద్రా థార్‌ను కొత్త 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందిస్తున్నారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

ఈ రెండు ఇంజన్లు కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కానీ లభిస్తాయి. ఈ రెండు వేరియంట్లు షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటాయి. మార్కెట్లో మహీంద్రా థార్ ధరలు రూ.12 లక్షల నుండి రూ.14 లక్షల రేంజ్ (ఎక్స్-షోరూమ్) లో ఉన్నాయి. ఇందులో కొత్త 5-డోర్ వెర్షన్ థార్ ఎస్‌యూవీ 2022లో లాంచ్ కావచ్చని అంచనా.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

3. కొత్త మహీంద్రా స్కార్పియో (Next Gen Mahindra Scorpio)

ఇక వచ్చే ఏడాది మహీంద్రా నుండి రాబోయే సరికొత్త కార్లలో ప్రధానమైనది కొత్త తరం మహీంద్రా స్కార్పియో. మహీంద్రా తమ కొత్త తరం థార్ ఎస్‌యూవీని స్టైలిష్ డిజైన్ మరియు ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి రాబోయే మోడళ్ల విషయంలో ఈ కంపెనీపై వినియోగదారులలో భారీ అంచనాలు పెట్టుకున్నారు. మహీంద్రా గత కొంత కాలంగా ఈ కొత్త తరం 2022 స్కార్పియో ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ప్రస్తుతం, కంపెనీ ఈ ఎస్‌యూవీని భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

ఇప్పటి స్కార్పియోతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2022 మహీంద్రా స్పార్పియో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా అధునాతనంగా ఉండనుంది. అంతేకాకుండా, దీని పరిమాణం కూడా మునుపటి కంటే పెద్దదిగా ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇటీవల తమ కొత్త ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీ ప్రదర్శించిన కొత్త తరం లోగోని కూడా ఈ కొత్త స్కార్పియో ధరించే అవకాశం ఉంది. మునుపటి మాదిరిగానే ఈ కొత్త తరం స్కార్పియో మోడల్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో రానుంది. వీటిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

4. మహీంద్రా ఇ-ఎక్స్‌యూవీ300 (Mahindra E-XUV300)

గతంలో మహీంద్రా వెల్లడించిన సమాచారం ప్రకారం, కంపెనీ 2027 నాటికి భారత మార్కెట్లో 13 కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తం కార్లలో దాదాపు 8 కార్లు ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ (ఈవీ) లను కలిగి ఉంటాయని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా నుండి రాబోయే ఎలక్ట్రిక్ కార్ల గురించి కూడా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి కొన్ని కార్లలో ఇ-కెయూవీ100, ఎక్స్‌యూవీ400 మరియు ఇ-ఎక్స్‌యూవీ మొదలైనవి ఉన్నట్లు సమాచారం.

2022 సంవత్సరంలో Mahindra మన కోసం కొత్తగా ఏం తీసుకురాబోతోందో తెలుసా..?

ప్రస్తుత మహీంద్రా ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఎలక్ట్రిక్ వెర్షన్ ను కంపెనీ వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈ ఎలక్ట్రిక్ కారుకి పేరును ఖరారు చేయనప్పటికీ ఇది ఇ-ఎక్స్‌యూవీ300 పేరుతో ప్రాచుర్యంలో ఉంది. నిజానికి, కంపెనీ ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్‌పో 2020లో eXUV300 కాన్సెప్ట్‌గా ప్రదర్శించింది. అప్పటి నుండి ఈ ఎలక్ట్రిక్ కార్ రాక కోసం కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Most Read Articles

English summary
What to expect from mahindra and mahindra in 2022 upcoming suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X