హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ప్రస్తుతం భారతదేశంలో 6-సీటర్ లేదా 7-సీటర్ ఎస్‌యూవీలకు డిమాండ్ జోరుగా ఉంటోంది. ఈ విభాగంలోకి కొత్తగా ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారీ మరియు హ్యుందాయ్ అల్కాజార్ వంటి కొత్త మోడళ్ల రాకతో పోటీ మరింత పెరిగింది. ఈ మూడు కొత్త మోడళ్లు ఇప్పుడు మార్కెట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా ఉన్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ధర

మార్కెట్లోకి లేటెస్ట్‌గా వచ్చిన హ్యుందాయ్ అల్కాజార్ ప్రారంభ ధర రూ.16.30 లక్షలుగా ఉంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.16.30 లక్షల నుండి రూ.19.99 లక్షల మధ్యలో ఉన్నాయి. కాగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ.16.30 లక్షల నుండి రూ.18.45 లక్షల మధ్యలో ఉన్నాయి.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

టాటా సఫారీ ఎస్‌యూవీ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని మాన్యువల్ వేరియంట్ ధరలు రూ.14.99 లక్షల నుండి ప్రారంభమై, టాప్-ఎండ్ మోడల్ ధర రూ.20.56 లక్షల వరకు ఉంటుంది. అలాగే, ఇందులోని ఆటోమేటిక్ వేరియంట్ ధరలు రూ.17.61 లక్షల నుండి ప్రారంభమై రూ.21.81 లక్షల వరకు ఉంటాయి.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో హెక్టర్ ప్లస్ 6-సీటర్ రూ.16.37 లక్షల నుంచి రూ.19.60 లక్షల మధ్యలో ఉండగా, 7-సీటర్ ధర రూ.13.62 లక్షల నుండి రూ.18.80 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

వేరియంట్లు

హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని సిగ్నేచర్, సిగ్నేచర్ (ఓ), ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (ఓ), ప్లాటినం మరియు ప్లాటినం (ఓ) అనే వేరియంట్లలో అందిస్తున్నారు. ఇందులో సిగ్నేచర్ అనేది బేస్ వేరియంట్ కాగా, ప్లాటినం (ఓ) టాప్-ఎండ్ వేరియంట్‌గా ఉంటుంది. ఈ 6 ట్రిమ్‌లను సీటింగ్ కాన్ఫిగరేషన్, ఇంజన్ మరియు గేర్‌బాక్స్ కాంబినేషన్ ఆధారంగా మొత్తం 17 వేరియంట్‌లుగా విభజించారు.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

టాటా సఫారీ ఎస్‌‌యూవీ విషయానికి వస్తే, ఇది ఎక్స్ఈ, ఎక్స్ఎమ్, ఎక్స్ఎమ్ఏ, ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జెడ్, ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ఏ మరియు ఎక్స్‌జెడ్ఏ ప్లస్ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఎస్‌యూవీని కూడా 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందిస్తున్నారు.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ఎమ్‌జి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీ కూడా 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 6-సీటర్ వెర్షన్ సూపర్, స్మార్ట్ మరియు షార్ప్ అనే వేరియంట్లలో లభిస్తుండగా, 7-సీటర్ వెర్షన్ స్టైల్, సూపర్, స్మార్ట్ మరియు సెలెక్ట్ వేరియంట్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ఇంజన్ మరియు గేర్‌బాక్స్

హ్యుందాయ్ అల్కజార్‌ను 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందిస్తున్నారు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 159 బిహెచ్‌పి శక్తిని మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 115 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

టాటా సఫారీ ఎస్‌యూవీ కేవలం డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 167 హెచ్‌పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

అల్కజార్ మాదిరిగానే ఎంజి హెక్టర్ ప్లస్ కూడా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 143 హెచ్‌పి పవర్‌ను మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, డిసిటి మరియు సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇకపోతే, ఇందులోని 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 167 హెచ్‌పి పవర్‌ను మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ అల్కజార్, టాటా సఫారీ, ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలలో ఏది బెస్ట్?

ధర పరంగా చూసుకుంటే, హ్యుందాయ్ అల్కజార్ మరియు ఎంజి హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలు రెండూ ఇంచు మించుగా ఒకే ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. టాటా సఫారీ మాత్రం కాస్తంత అధికంగా అనిపిస్తుంది. అలాగే, ఇంజన్ ఆప్షన్స్ పరంగా చూస్తే, ఎంజి హెక్టర్ శక్తివంతమైన ఇంజన్లతో లభిస్తుంది. టాటా సఫారీ మాత్రం కేవలం డీజిల్ ఇంజన్‌తోనే లభిస్తోంది.

Most Read Articles

English summary
Which Is Best 7-setaer SUV? Comparison Between Hyundai Alcazar, Tata Safari And MG Hector Plus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X