ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో ఏ వేరియంట్ బెస్ట్? ఎందుకు ?

చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్‌జి మోటార్, భారత మార్కట్లో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీని విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ తర్వాత ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీనే అత్యంత తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ పూర్తి చార్జ్‌పై 419 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

దేశీయ విపణిలో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కథనంలో మనం ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వేరియంట్ వారీగా లభించే ఫీచర్లు, రేంజ్, ధర మరియు కలర్ ఆప్షన్స్ తదితర అంశాల గురించి మరియు ఈ రెండు వేరియంట్లలో ఏది ఉత్తమమైనదనే విషయాలను తెలుసుకుందాం రండి.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ - ధర:

ఇది వరకు చెప్పుకున్నట్లుగా ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కేవలం రెండు వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్సైట్ బేస్ వేరియంట్ ధర రూ.20.99 లక్షలు కాగా, ఎక్స్‌క్లూజివ్ టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.24.18 లక్షలు. ఈ రెండు వేరియంట్ల మధ్య సుమారు రూ.3.19 లక్షల ధర వ్యత్యాసం ఉంది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ - పవర్ట్రెయిన్:

ఎమ్‌జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 44.5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్‌పై 419 కిమీ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఇది ఈ విభాగంలో టాటా నెక్సాన్ ఈవీ కన్నా ఎక్కువ మరియు హ్యుందాయ్ కోన (452 ​​కిమీ/చార్జ్) కన్నా తక్కువ.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 142.76 బిహెచ్‌పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంట్లో ఉండే ఏసి ఛార్జర్ సాయంతో ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ బ్యాటరీలను చార్జ్ చేయడానికి 18 గంటల సమయం పడుతుంది. ఇది కేవలం 8.3 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ - పరిమాణం:

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ కొలతలను గమనిస్తే, ఇది 4314 మిమీ పొడవును, 1809 మిమీ వెడల్పును, 1644 మిమీ ఎత్తును మరియు 2585 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 470 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. అవసరమైతే, వెనుక వరుసలోని సీటును 60:40 నిష్పత్తిలో మడవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను మరింత పెంచుకోవచ్చు. ఈ ఎస్‌యూవీ గ్రౌండ్ క్లియరెన్స్ 177 మిమీగా ఉంటుంది.

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్సైట్ వేరియంట్‌లో లభించే ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్లు:

 • డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
 • సీట్ బెల్ట్ రిమైండర్
 • హై స్పీడ్ అలెర్ట్
 • హిల్ స్టార్ట్ అసిస్ట్
 • హిల్ డిసెంట్ కంట్రోల్
 • టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్
 • డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా
 • నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు
 • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్
 • ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్
 • ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్
 • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
 • యాంటీ-థెఫ్ట్ అలారం
 • డే / నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
 • ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్
 • ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు:

  • 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో
  • బ్లూటూత్ కనెక్టివిటీ
  • 4 స్పీకర్లు
  • స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్
  • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

   ఫంక్షనల్ మరియు స్టైలింగ్ ఫీచర్లు:

   • ఆటో హెడ్‌ల్యాంప్స్
   • పవర్ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
   • ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్
   • కీలెస్ ఎంట్రీ
   • డ్రైవ్ మోడ్
   • టిల్ట్ స్టీరింగ్
   • క్రూయిజ్ కంట్రోల్
   • హైట్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
   • 60:40 స్ప్లిట్ రియర్ సీట్
   • ఎల్ఈడి డిఆర్ఎల్‌లు
   • క్రోమ్ డోర్ హ్యాండిల్స్
   • 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్
   • లెథర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్
   • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

    ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో ఎక్సైట్ వేరింయట్‌లో లభించే ఫీచర్లతో పాటుగా క్రింద పేర్కొన్న ఫీచర్లు కూడా లభిస్తాయి.

    ఫంక్షనల్ మరియు స్టైలింగ్ ఫీచర్లు:

    • 6 స్పీకర్ ఆడియో సిస్టమ్
    • పానోరమిక్ సన్‌రూఫ్ మరియు రూఫ్ రైల్స్
    • లెథర్ అప్‌హోలెస్ట్రీ
    • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
    • పవర్ ఫోల్డబుల్ అండ్ హీటెడ్ సైడ్ మిర్రర్స్
    • పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్
    • లేటెస్ట్ కార్ కనెక్ట్ టెక్నాలజీ
    • పిఎం 2.5 ఎయిర్ ఫిల్టర్
    • ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

     ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ - కలర్ ఆప్షన్లు:

     ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ యొక్క ఎక్సైట్ మరియు ఎక్స్‌క్లూజివ్ రెండు వేరియంట్లు కూడా రెడ్, వైట్ మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ మూడు కలర్ ఆప్షన్లు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

     ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో ఏ వేరియంట్ బెస్ట్?

     మరి ఏ వేరియంట్ కొంటే మంచిది?

     ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ యొక్క ఎక్సైట్ వేరియంట్ చాలా బేసిక్ ఫీచర్లతో వస్తుంది. కానీ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో మాత్రం సన్‌రూఫ్, పవర్ సీట్, లెదర్ అప్‌హోలెస్ట్రీ వంటి కొన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఫీచర్ల కన్నా బ్యాటరీ రేంజ్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వారి కోసం ఎక్సైట్ వేరియంట్ చాలా అనువుగా ఉంటుంది. మరింత ప్రీమియం ఫీచర్లతో కూడిన జెడ్ఎస్ ఈవీ కోరుకునే వారికి ఎక్స్‌క్లూజివ్ వేరియంట్ చక్కగా ఉంటుంది.

Most Read Articles

English summary
Which Variant To Buy In MG ZS EV? Range, Charging Time, Features, Price And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X