చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

ప్రస్తుతం వాణిజ్య రంగంలో రవాణా కోసం ఉపయోగిస్తున్న వాహనాలలో వాణిజ్య వాహనాలు, ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసినదే. ఈ రవాణా ట్రక్కులకు ఆజ్యం పోసింది మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్కును తయారు చేసింది జర్మనీకి చెందిన డైమ్లెర్ సంస్థ.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్రక్కుల తయారీలో అగ్రగామిగా ఉన్న డైమ్లెర్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్కును ఉత్పత్తి చేసిన వాహన తయారీదారు అని ఈ జర్మన్ కంపెనీ పేర్కొంది. ప్రపంచంలోని మొట్టమొదటి ట్రక్కును ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పురాతన ఇంజనీర్ గాట్లీబ్ డైమ్లెర్ రూపొందించారు.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

అంతేకాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర్గత దహన యంత్రం (ఇంటర్నల్ కంబస్టియన్ ఇంజన్)ను తయారు చేసింది కూడా గాట్లీబ్ డైమ్లెర్ కావటం విశేషం. గాట్లీబ్ డైమ్లెర్ 1896లో ప్రపంచంలోనే మొట్టమొదటి కార్గో ట్రక్కును తయారు చేశారు.

గాట్లీబ్ డైమ్లెర్ ప్రారంభంలో అభివృద్ధి చేసిన ట్రక్ ఇంజన్ వెనుక భాగంలో ఉండేది. ఆ తర్వాత డైమ్లెర్ 1920 మరియు 1930ల నుండి ముందు వైపు ఇంజన్‌తో కూడిన ట్రక్కులను విక్రయించడం ప్రారంభించింది. ఆ సమయంలో ఈ ట్రక్కులు బాగా ప్రాచుర్యం చెందాయి.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

గాట్లీబ్ డైమ్లెర్ తయారు చేసిన మొట్టమొదటి ట్రక్కులో 1.06 లీటర్ 2-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ లీటరుకు 16.66 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. ఆ సమయంలో ఈ ట్రక్కు మరియు ఇంజన్ ద్వారా గాట్లీబ్ డైమ్లెర్ యొక్క కీర్తి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

ప్రపంచంలోని మొట్టమొదటి కార్గో ట్రక్‌లో ఇంజన్ వెనుక భాగంలో ఉండేది మరియు ముందు వైపు ఓ బెంచ్ సీట్, స్టీరింగ్ వీల్ ఉండేవి. ఇది చూడటానికి ఎద్దుల బండిలా కనిపించేది. ఇందులో ఉపయోగించిన 4 బిహెచ్‌పిల శక్తిని జనరేట్ చేస్తుంది. ఇంజన్ నుండి విడుదలయ్యే శక్తి బెల్ట్-డ్రైవ్ మెకానిజం ద్వారా వెనుక చక్రాలకు పంపిణీ చేయబడుతుంది.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

అప్పట్లో రబ్బర్ టైర్లు ఉండేవి కావు. చక్కతో తయారు చేయబడి, ఇనుప రింగ్ కలిగిన చక్రాలతో ఇవి నడిచేవి. ఇది కఠినమైన రోడ్లపై కూడా ఇంజన్ వైబ్రేషన్లకు చాలా సున్నితంగా ఉండేది. ఈ ఇంజన్‌ను రక్షించడానికి రెండు హెలికల్ స్ప్రింగ్స్‌తో కూడిన సస్పెన్షన్ సెటప్ ఉండేది.

జర్మన్ ఆటో దిగ్గజం డైమ్లెర్ పేర్కొన్నట్లుగా, ఈ మొట్టమొదటి కార్గో ట్రక్‌లోని స్టీరింగ్ మెకానిజం గొలుసు (చైన్) ద్వారా పనిచేసేది. ఈ చైన్ సాయంతో ఫ్రంట్-ఆక్సిల్‌లో ఉన్న చక్రాలను కుడివైపుకు లేదా ఎడమవైపుకు తిప్పడం సాధ్యమయ్యేది.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

గాట్లీబ్ డైమ్లెర్ 1898 లో మరొక ఆటోమొబైల్ మార్గదర్శకుడు విల్హెల్మ్ మేబాచ్‌తో కలిసి కార్గో ట్రక్ యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్‌ను రూపొందించారు. వీరిద్దరూ కలిసి ఈసారి ఇంజన్‌ను వెనుక వైపు కాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నట్లుగానే ముందు వైపు ఇంజన్ ఉండేలా ట్రక్కులను తయారు చేశారు.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

ముందువైపు ఇంజన్ కలిగిన ట్రక్కులలో ఇంజన్ నుండి వెలువడే శక్తి ముందు చక్రాలకు పంపిణీ అయ్యేది. ఈ విధంగా, 1898 లో, గాట్లీబ్ డైమ్లెర్ ట్రక్ వేరే ఫ్రంట్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది. ప్రపంచంలోని మొట్టమొదటి ట్రక్ యొక్క రూపం తరువాతి సంవత్సరాల్లో అనేక నవీకరణలను పొందింది.

చూడటానికి ఎద్దుల బండిలా ఉంది, కానీ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రక్!

ఆ తర్వాతి కాలంలో ఇందులోని పాత 1.06 లీటర్ 2-సిలిండర్ ఇంజన్‌ను తొలగించి, దానిని 2.2 లీటర్ ఇంజన్‌తో రీప్లేస్ చేశారు. ఈ ఇంజన్ డైమ్లెర్ మరియు బాష్ సంస్థలు కలిసి అభివృద్ధి చేశాయి. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకూ వాణిజ్య ట్రక్కుల్లో అనేక రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Most Read Articles

English summary
Daimler Claims That They Invented The World's First Cargo Truck In 1896, With A Mileage Of 16.66 Kmpl. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X