Mi ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్.. మాస్ ప్రొడక్షన్ టైమ్‌లైన్‌ను వెల్లడించిన Xiaomi

చైనీస్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ షావ్‌మీ (Xiaomi) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్టప్ బ్రాండ్‌గా ఎలక్ట్రానిక్స్ వ్యాపారం ప్రారంభించిన ఈ బ్రాండ్, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటి, అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థగా అవతరించింది.

షావ్‌మీ బ్రాండ్ నుండి వచ్చిన రెడ్‌మి (Redmi) మరియు ఎమ్ఐ (Mi) ఫోన్లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ని ఏవిధంగా ప్రభావితం చేశాయి మరియు మార్కెట్లో పోటీని ఎలా పెంచాయో మనం చూశాం. ప్రస్తుతం, ఈ బ్రాండ్ కేవలం స్మార్ట్‌ఫోన్లను మాత్రమే కాకుండా, టెలివిజన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు మరియు యాక్ససరీలతో పాటుగా అనేక వస్తువులు, పరికరాలను తయారు చేస్తోంది.

Xiaomi (Mi) ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్..

కాగా, ఇప్పుడు వీటన్నింటికీ మించి ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు కంపెనీ దృష్టి సారించింది. భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలదే అని గ్రహించిన షావ్‌మీ (Xiaomi) బ్రాండ్, మరో రెండేళ్ల నాటికి ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో సరికొత్త పోటీ తెరతీయబోతోంది. షావ్‌మీ ఈ ఏడాది ప్రారంభంలోనే ఎలక్ట్రిక్ వెహికల్ కేటగిరీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పుడు ఇదే విషయాన్ని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధృవీకరించారు. త్వరలోనే ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు షావ్‌మీ సీఈఓ లీ జున్ తెలిపారు. చైనాకి చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు 2024 ప్రథమార్ధంలో తమ సొంత ఎలక్ట్రిక్ కార్లను భారీ స్థాయిలో ఉత్పత్తి (మాస్ ప్రొడక్షన్) చేయనున్నట్లు ఆయన చెప్పారు.

తాజాగా షావ్‌మీ నిర్వహించిన ఇన్వెస్టర్ ఈవెంట్‌ కంపెనీ భవిష్యత్తు ప్రణాళికల గురించి లీ జూన్ వెల్లడించారు. షావ్‌మీ యొక్క అంతర్జాతీయ మార్కెటింగ్ విభాగంలో డైరెక్టర్ అయిన జాంగ్ జియువాన్ కూడా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. అంటే, మరో రెండేళ్లలో రోడ్లపై షావ్‌మీ ఎలక్ట్రిక్ కార్లు సందడి చేయనున్నమాట.

ఈ సంవత్సరం ప్రారంభంలో షావ్‌మీ తమ ఎలక్ట్రిక్ కార్ ప్లాన్స్ గురించి అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ (EV) డివిజన్ కోసం, తాజాగా ప్రకటించిన టైమ్‌లైన్, ఈ విభాగం యొక్క తదుపరి ప్రధాన లక్ష్యాన్ని సూచిస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల ధృవీకరణ తరువాత షావ్‌మీ షేర్లు దాదాపు 5.4 శాతం పెరిగాయి.

షావ్‌మీ మొదట్లో మార్చ 2021 లో EV (ఎలక్ట్రిక్ వెహికల్స్) ను తయారు చేసే ప్రణాళికలను ప్రకటించింది. కానీ, ఈ విషయంపై ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయలేదు. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 2021 నెలలో కంపెనీ అధికారికంగా 10 బిలియన్ యువాన్ (సుమారు రూ. 11,000 కోట్ల) పెట్టుబడిని వెచ్చించి ఒక EV కంపెనీని నమోదు చేసింది. దానికి షావ్‌మీ సీఈఓ లీ జున్ కంపెనీకి చట్టపరమైన ప్రతినిధిగా సంతకం కూడా చేశారు.

షావ్‌మీ తమ ఎలక్ట్రిక్ వాహన వ్యాపారం కోసం ఇప్పటికే సుమారు 300 మంది సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు సమాచారం. ఈ వ్యాపారం కోసం కంపెనీ త్వరలోనే మరింత ఎక్కువ మందిని కూడా నియమించుకోనుంది. అయితే, Xiaomi ఇప్పటి వరకూ కొత్త వ్యాపారంలో ఉత్పత్తి చేయబోయే ఎలక్ట్రిక్ వాహనాల గురించి ఇంకా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

షావ్‌మీ తన సొంత దేశం, చైనా మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్ల కోసం సరసమైన ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంపెనీ తన EV యూనిట్‌లో 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 73,000 కోట్లు) పెట్టుబడికి సిద్ధంగా ఉందని, దీనిని వచ్చే 10 సంవత్సరాల వ్యవధిలో ఖర్చు చేస్తామని తెలిపింది. భారత మార్కెట్ పై కూడా షావ్‌మీ బ్రాండ్ కి మంచి పట్టు ఉంది, కాబట్టి ఈ ఎలక్ట్రిక్ కార్లు ఇక్కడి మార్కెట్లో కూడా విడుదల కావచ్చని భావిస్తున్నారు.

Xiaomi (Mi) ఎలక్ట్రిక్ కార్లు వస్తున్నాయ్..

సాధారణంగా, షావ్‌మీ అందించే స్మార్ట్‌ఫోన్లు చాలా చవక ధరకే అందుబాటులో ఉండి, ఖరీదైన హై-ఎండ్ లగ్జరీ ఫోన్లు అందించే అన్ని రకాల ఫీచర్లను కూడా కలిగి ఉంటాయి. ప్రస్తుతం, మార్కెట్లో షావ్‌మీ బ్రాండ్ నుండి లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు రూ. 6,799 నుండి మొదలుకొని రూ. 69,999 వరకూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, షావ్‌మీ బ్రాండ్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ కార్లు కూడా సరసమైన ధరతో పాటుగా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

వచ్చే పదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తామని షావ్‌మీ చెబుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తున్నది కేవలం షావ్‌మీ మాత్రమే కాదు, లెనోవో, యాపిల్ ఫోన్ తయారీదారులు ఫాక్స్‌కాన్ మరియు హువాయ్ వంటి సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అడుగుపెట్టారు.

గూగుల్ మరియు అమెజాన్ సహా ఇతర టెక్నాలజీ కంపెనీలు ఆటోమేటెడ్ వాహనాల తయారీని వేగవంతం చేసే పనిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి షావ్‌మీ కూడా చేరింది. ఇందులో భాగంగా, షావ్‌మీ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న స్టార్టప్ కంపెనీ అయిన డీప్‌మోషన్‌ (Deepmotion) 77 మిలియన్ డాలర్లకు పైగా (దాదాపు రూ. 562 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది.

డీప్‌మోషన్ సంస్థ షావ్‌మీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రయత్నాలలో సహాయపడుతుంది. షావ్‌మీ ఇప్పటికే గృహోపకరణాలు, స్మార్ట్ వాచ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్‌లు, ఎల్ఈడి టీవీలు, ప్రొజెక్టర్లు, వాక్యూమ్ క్లీనర్‌లు, బ్లూటూత్ స్పీకర్‌లు, ఇంటర్నెట్ రౌటర్లు, బ్యాక్‌ప్యాక్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్, ఎల్ఈడి లైట్లు, సూట్‌కేసులు మరియు సెక్యూరిటీ కెమెరాల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తోంది.

Most Read Articles

English summary
Xiaomi plans to enter into electric car business timeline revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X