కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థలలో ఒకటి 'ఆడి' (Audi). ఈ కంపెనీకి భారతీయ మార్కెట్లో చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే కంపెనీ కూడా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల మనసు దోచుకోవడానికి కొత్త వాహనాలను విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే త్వరలో 'క్యూ3' (Q3) SUV విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది, ఇప్పుడు దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

ఆడి కంపెనీ ఇప్పుడు తన అప్‌డేటెడ్ ఆడి క్యూ3 ని దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నద్దమయిపోయింది. దీనికి సంబంధించి కొత్త టీజర్లకు కూడా కంపెనీ విడుదల చేసింది. అయితే ఈ లగ్జరీ SUV భారతీయ విఫణిలో విడుదల కాకముందే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కావున ఈ SUV కొనాలనే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ని సందర్శించి ముందస్తుగా రూ. 2,00,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారభమవుతాయి.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త ఆడి క్యూ3 మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్స్. ఈ రెండు వేరియంట్లు కూడా ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

ఆడి క్యూ3 SUV డిఆర్ఎల్ తో కూడిన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

నిజానికి ఆడి క్యూ3 అనేది 2019 లోనే ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇప్పుడు అప్డేటెడ్ క్యూ3 భారతీయ తీరాలను చేరుకునే రోజు వచ్చేసింది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క MQB ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అదే సమయంలో ఇది క్యూ8 SUV నుండి ప్రేరణ పొందింది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

ఇటీవల కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ SUV కార్బన్ ఫైబర్ ORVM హౌసింగ్ మరియు గ్లోస్ బ్లాక్ విండో ట్రిమ్, బి-పిల్లర్ మరియు రూఫ్ రెయిల్స్ వంటి వాటిని పొందుతుందని తెలుస్తోంది. అయితే ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కొంచెం పొడవుగా మరియు వెడల్పుగా ఉండటమే కాకుండా మెరుగైన వీల్‌బేస్‌ కూడా పొందుతుంది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

ఆడి క్యూ3 పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ దిగువన హెక్సాగోనల్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది. అదే సమయంలో ఇది బ్లాక్-అవుట్ సైడ్ స్కర్ట్‌లు మరియు క్లియర్ షోల్డర్ లైన్‌ వంటివి కూడా పొందుతుంది, కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్-లైట్లు మరియు రీప్రొఫైల్డ్ బంపర్ కాకుండా మిగిలివన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు స్టాండర్డ్ 10.25-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం డాష్ ఇన్సర్ట్‌లు, లెదర్ సీటు అప్హోల్స్టరీ, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

కొత్త ఆడి క్యూ3 అంతర్జాతీయ మార్కెట్లలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ అందించగా, .0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ట్యూన్స్ లో 190 బిహెచ్‌పి పవర్ మరియు 230 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

అయితే ఇండియా-స్పెక్ ఆడి క్యూ3 మాత్రం 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది. ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

కొత్త క్యూ3 బుకింగ్స్ ప్రారంభించిన ఆడి.. డెలివరీలు ఎప్పుడంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఆడి కంపెనీ నుంచి మరో కొత్త అప్డేటెడ్ లగ్జరీ SUV రానుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ, వోల్వో XC40 మరియు బిఎండబ్ల్యు ఎక్స్1 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, అయితే ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
2022 audi q3 booking starts in india expected launch soon details
Story first published: Friday, August 12, 2022, 11:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X