'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ మరియు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీ 'హ్యుందాయ్' (Hyundai) దేశీయ మార్కెట్లో తన '2022 టుసాన్' (2022 Tucson) ను ఈ నెల 13 న దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే కంపెనీ ఈ ఎస్‌యూవీ బుకింగ్స్ ఈ నెల 18 నుంచి స్వీకరించనున్నట్లు తెలిపింది.

హ్యుందాయ్ కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని ఆగష్టు 04 న భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎస్‌యూవీలోని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలతోపాటు 2022 హ్యుందాయ్ టుసాన్ లోని టాప్ హైలెట్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

న్యూ లైటింగ్ ప్యాకేజీ:

సాధారణంగా ఒక వాహనానికి ఎక్కువ ఆకర్షణను అందించడంలో లైట్లు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయనే చెప్పాలి. అవి హ్యాలోజన్ లైట్స్ కావచ్చు, ఎల్ఈడీ లైట్స్ కావచ్చు.

నిజానికి 2022 హ్యుందాయ్ టుసాన్ అన్నీ ఎల్ఈడీ లైట్స్ పొందుతుంది. ఈ ఎస్‌యూవీ యొక్క ముందు భాగంలోని హెడ్‌లైట్‌లు నిలువుగా పేర్చబడి గ్రిల్‌కి ఇరువైపులా ఉంటాయి. ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు మంచి దృశ్యమానతను కూడా అందిస్తాయి.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

అదే విధంగా రియర్ ప్రొఫైల్ లో ఎస్‌యూవీ వెడల్పు అంతటా వ్యాపించిన లైట్‌బార్ ఉంటుంది. టెయిల్ ల్యాంప్‌ ఒక పంజా లాంటి రూపాన్ని కలిగి ఉన్న పెద్ద బ్రేక్ లైట్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంటాయి. హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ రియర్ స్పాయిలర్ క్రింద ఎక్స్టీరియర్ లో మౌంట్ చేయబడి ఉంటుంది. మొత్తం మీద లైటింగ్ అద్భుతంగా ఉంటుంది.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ (ADAS):

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎంజి మోటార్స్ మరియు మహీంద్రా వంటి కంపెనీలు ఈ 'అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్' అనే ఫీచర్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీని హ్యుందాయ్ కంపెనీ తన 2022 టుసాన్ లో ప్రవేశపెట్టింది. కావున ADAS టెక్నాలజీ పొందిన మొదటి హ్యుందాయ్ కారుగా ఇది నిలిచింది.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. డ్రైవింగ్ సేఫ్టీ ఫంక్షన్, డ్రైవింగ్ సౌలభ్యం ఫంక్షన్ మరియు పార్కింగ్ సేఫ్టీ ఫంక్షన్ వంటి వాటిని నిర్వహిస్తుంది. కావున ఇది చాలా ఉపయోగకరమైన టెక్నాలజీ.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్ డిస్‌ప్లే:

నిజానికి భారతదేశంలో 'సెంటర్ కన్సోల్‌లో డ్యూయల్ టచ్‌స్క్రీన్‌' కలిగిన మొదటి హ్యుందాయ్ కారు ఈ 2022 టుసాన్. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఎగువ భాగంలో 10.25 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు హ్యుందాయ్ బ్లూలింక్ టెక్నాలజీలో 60 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్స్ పొందుతుంది.

ఇక ఇందులో రెండవ సగం ఉన్న కింది భాగం క్లైమేట్ కంట్రోల్స్ కోసం కంట్రోల్ కెపాసిటివ్ బటన్లను పొందుతుంది. ఇవన్నీ క్లైమేట్ కంట్రోల్స్ కోడం ఉపయోగపడతాయి.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

ఆల్-వీల్ డ్రైవ్ (AWD):

హ్యుందాయ్ కంపెనీ తన 2022 టుసాన్ లో HTRAC టెక్నాలజీ ద్వారా ఈ ఆల్-వీల్ డ్రైవ్ అందిస్తోంది. కావున ఇందులో మడ్, సాండ్ మరియు స్నో వంటి మల్టిపుల్ డ్రైవింగ్స్ మోడ్స్ పొందవచ్చు.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

హ్యుందాయ్ టుసాన్ 2.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ అప్సన్లను పొందుతుంది. ఇవి వరుసగా 154 బిహెచ్‌పి పవర్ & 192 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ మరియు 184 బిహెచ్‌పి పవర్ & 417 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తాయి.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

పెరిగిన పరిమాణం:

భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువమంది వాహన కొనుగోలుదారులు పరిమాణం పెద్దగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కావున కంపెనీ దీని పరిమాణం కూడా కొంత పెంచడం జరిగింది. కావున ఈ SUV పొడవు 4,630 మిమీ, వెడల్పు 1,865 మిమీ, ఎత్తు 1,665 మిమీ మరియు వీల్ బేస్ 2,755 మిమీ వరకు ఉంది.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

అయితే దాని మునుపటి మోడల్ యొక్క కొలతలను గమనిస్తే పొడవు 4,480 మిమీ, వెడల్పు 1,850 మిమీ, ఎత్తు 1,660 మిమీ మరియు వీల్ బేస్ 2,670 మిమీ వరకు ఉంది. దీన్ని బట్టి చూస్తే రానున్న కొత్త మోడల్ మునుపటి మోడల్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది.

'2022 హ్యుందాయ్ టుసాన్' లో తప్పకుండా ఈ 5 విషయాలు తెలుసుకోవాలి

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హ్యుందాయ్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త టుసాన్ దాని మునుపటి మోడల్ కంటే అన్ని విధాలా అప్డేట్స్ పొందింది. కావున తప్పకుండా మార్కెట్లో మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉందని ఆశిస్తున్నాము. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బుకింగ్స్ ప్రారంభమైన తరువాత తెలుస్తాయి. హ్యుందాయ్ టుసాన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి.

Most Read Articles

English summary
2022 hyundai tucson five things to know before buying details
Story first published: Saturday, July 16, 2022, 17:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X