భారత్‌లో విడుదలైన 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'మారుతి సుజుకి' (Maruti Suzuki) యొక్క '2022 బ్రెజ్జా' (2022 Brezza) కాంపాక్ట్ ఎస్‌యువి ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ ఎస్‌యువి యొక్క ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 13.96 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) వరకు ఉంది.

Recommended Video

భారతీయ మార్కెట్లో విడుదలైన 2022 Maruti Brezza | ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బ్రెజ్జా గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2022 మారుతి బ్రెజ్జా యొక్క బుకింగ్స్ ఇప్పటికే ప్రారభమయ్యాయి. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. మారుతి సుజుకి తన అరేనా డీలర్‌షిప్‌ల ద్వారా డెలివరీ చేయనుంది. ఈ ఎస్‌యువి కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో గాని రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

2022 Maruti Suzuki Brezza Price
Variant Manual Automatic
LXi ₹7,99,000 -
VXi ₹9,46,500 ₹10,96,500
ZXi ₹10,86,500 ₹12,36,500
ZXi Dual Tone ₹11,02,500 ₹12,52,500
ZXi+ ₹12,30,000 ₹13,80,000
ZXi+ Dual Tone ₹14,46,000 ₹13,96,000
భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

అంతే కాకుండా కంపెనీ తమ కస్టమర్ల కోసం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ స్కీమ్ కూడా అందుబాటులో తీసుకువచ్చింది. దీని కింద కొనుగోలుదారులు నెలకు రూ. 18,300 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటివి ఉన్నాయి. కావున కొనుగోలుదారులు ఈ కొత్త స్కీమ్ ఆధారంగా కూడా కొనుగోలు చేయవచ్చు.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

మారుతి సుజుకి దేశీయ మార్కెట్లో విడుదల చేసిన ఈ కొత్త ఎస్‌యువి నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి LXi, VXi, ZXi మరియు ZXi+. ఇవన్నీ కూడా ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

2022 మారుతి బ్రెజ్జా డిజైన్ విషయానికి వస్తే, ఇది దాని మునుపటి అదే గ్లోబల్ సి ప్లాట్‌ఫారమ్‌పై ఉంటుంది. కానీ కొత్త బాడీ ప్యానల్ మరియు కొత్త ఇంటీరియర్ పొందుతుంది. ఈ ఎస్‌యువి ముందు భాగంలో ఫ్లాట్-లుకింగ్ క్లామ్‌షెల్ బానెట్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ మరియు గన్‌మెటల్ షేడ్‌లో పూర్తి చేసిన గ్రిల్‌ ఉంటుంది.

సైడ్ ప్రొఫైల్ లో 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో టెయిల్‌గేట్ డిజైన్ కూడా కొంత అప్డేట్ చేయబడింది. కావున హారిజాంటల్ టెయిల్-ల్యాంప్‌ పొందుతుంది. మొత్తం మీద 2022 మారుతి బ్రెజ్జా డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

2022 మారుతి బ్రెజ్జా పరిమాణం విషయానికి వస్తే, ఇది దాదాపు దాని మునుపటి బ్రెజ్జానే అనుసరించినట్లు తెలుస్తుంది. కావున దీని పొడవు 3,995 మిమీ, వెడల్పు 1,790 మిమీ మరియు ఎత్తు 1,685 మిమీ వరకు ఉంటుంది. కానీ ఎత్తు మాత్రం మునుపటి వెర్సన్ కంటే కూడా 45 మిమీ ఎక్కువగా ఉంటుంది.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

మారుతి బ్రెజ్జా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇంటీరియర్ లో బ్లాక్ మరియు బ్రౌన్ కలర్ డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్ మరియు డోర్‌లపై సిల్వర్ యాక్సెంట్స్ కూడా గమనించవచ్చు.

ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌ ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, రియర్ ఏసీ వెంట్స్, వాయిస్ కమాండ్ సపోర్ట్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, హెడ్స్ అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్‌ వంటి వాటితో పాటు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, USB టైప్-సి రియర్ ఛార్జింగ్ పోర్ట్స్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

2022 మారుతి బ్రెజ్జాలో కొత్త 1.5-లీటర్, కె15సి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 103 హెచ్‌పి పవర్ మరియు 137 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇక మైలేజ్ విషయానికి వస్తే, బ్రెజ్జా మ్యాన్యువల్ వెర్షన్స్ ఒక లీటరుకు గరిష్టంగా 20.15 కిలోమీటర్ల మైలేజ్ మరియు ఆటోమేటిక్ వెర్షన్స్ లీటరుకు 19.80 కిమీ మైలేజ్ అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు ఐసోఫిక్స్ ఎంకరేజ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి.

భారత్‌లో విడుదలై 2022 మారుతి బ్రెజ్జా: ధర రూ. 7.99 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు 2022 మారుతి బ్రెజ్జా విడుదలైంది. ఇప్పటికే ఈ కొత్త ఎస్‌యువి మంచి బుకింగ్స్ కూడా పొందింది. కావున తప్పకుండా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. 2022 బ్రెజ్జా దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌, కియా సోనెట్, టాటా నెక్సాన్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
2022 maruti suzuki brezza launched in india price starts at rs 7 99 lakhs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X