అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

స్కోడా (Skoda) కంపెనీ దేశీయ మార్కెట్లో ఇటీవల కాలంలోనే తన కొత్త 2022 స్కోడా కొడియాక్ (2022 Skoda Kodiaq) ను రూ. 34.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధర వద్ద అధికారికంగా విడుదలైంది. విడుదలైన అతి తక్కువ సమయంలో ఈ SUV యొక్క మొదటి బ్యాచ్ పూర్తిగా అమ్ముడైపోయింది. అయితే ఇప్పుడు కంపెనీ సెకండ్ బ్యాచ్ యొక్క ధరలను రూ. 50,000 నుంచి రూ. 1.50 లక్షల వరకు పెంచనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం 2022 స్కోడా కొడియాక్ ను జనవరి 11 తర్వాత కారును బుక్ చేసుకునే వినియోగదారులకు ఈ పెరుగుదల వర్తించే అవకాశం ఉంది. అయితే మొదటి బ్యాచ్ అమ్మకం గురించి కంపెనీ ధృవీకరించనప్పటికీ, బుకింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది మరియు కంపెనీ డీలర్‌షిప్ ద్వారా లేదా రూ. 50,000 అడ్వాన్స్ మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

కంపెనీ దీనిని CKD మోడల్‌గా తీసుకువచ్చింది. వీటి ప్రారంభ ధారా ప్రారంభ ధర రూ. 34.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కాగా, ఇందులోని టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 37.49 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది మొత్తం స్టైల్, స్పోర్ట్‌లైన్ మరియు టాప్ L&K అనే మూడు వేరియంట్‌లలో అందుబటులో ఉంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

కొడియాక్ విక్రయాలు నెలకు 100 యూనిట్ల లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ తన పరిధిని 140 నగరాలకు విస్తరించబోతోంది, ప్రస్తుతం కంపెనీ 117 నగరాల్లో ఉంది. అదే సమయంలో, ఇది దాని టచ్‌పాయింట్‌ను 175 నుండి 225 కి పెంచబోతోంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

2022 కోడియాక్ ఫేస్‌లిఫ్ట్‌ 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ల టిఎస్ఐ టర్బో-పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ కొత్త SUV యొక్క అన్ని వేరియంట్లు కూడా స్టాండర్డ్‌గా ఆల్-వీల్ డ్రైవ్‌ను పొందుతాయి. ఈ కారు కేవలం 7.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

స్కోడా కంపెనీ యొక్క కొత్త స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు నిటారుగా ఉన్న గ్రిల్, ఎలివేటెడ్ బానెట్, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్, రివైజ్ చేయబడిన హెడ్‌లైట్లు మరియు ట్వీక్ చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటి వాటిని పొందుతుంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

కొడియాక్ లో కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ కూడా ఉంటుంది. దీనితో పాటు వెనుకవైపు టెయిల్‌లైట్‌లు మరియు బంపర్ కొద్దిగా అప్‌డేట్ చేయబడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ SUV ని చాలా అద్బుతమగా కనిపించే విధంగా చేస్తాయి. అయితే ఈ అప్డేట్స్ కాకుండా మిగిలిన ఎటువంటి మార్పులు చేయలేదని కంపెనీ తెలిపింది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

2022 స్కోడా కొడియాక్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,697 మిమీ, వెడల్పు 1,882 మిమీ మరియు ఎత్తు 1,665 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

2022 స్కోడా కొడియాక్ ఇంటీరియర్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులోని డ్యాష్‌బోర్డ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను పోలి ఉంటుంది. అంతే కాకూండా స్కోడా యొక్క కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ ఇందులో కూడా ఉంది. ఇందులో మూడు వరుసల సీటింగ్‌ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

స్కోడా కొడియాక్ SUV యొక్క టాప్-స్పెక్ ట్రిమ్‌లో అప్‌డేట్ చేయబడిన 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివాటిని పొందుతుంది.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

కొత్త కొడియాక్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్‌లు మరియు తొమ్మిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరిన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిస్తాయి.

అప్పుడే భారీగా పెరగనున్న 2022 Kodiaq ధరలు: పూర్తి వివరాలు

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త 2022 స్కోడా కొడియాక్ SUV కి ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు, కానీ దీని ధర ఆధారంగా ఫేస్‌లిఫ్టెడ్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

2022 స్కోడా కొడియాక్ కస్టమర్ల నుండి మంచి స్పందనను పొందుతోంది. అయితే ఈ సమయంలో కంపెనీ అమాంతంగా ధరలను పెంచడం అనేది అమ్మకాలపైన ఏమైనా ప్రభావం చూపుతుందా అనే విషయం త్వరలోనే తెలుస్తుంది.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
2022 skoda kodiaq price hike soon details
Story first published: Saturday, January 22, 2022, 11:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X