ఖరీదైన లగ్జరీ కారు కొన్న 'అతియా శెట్టి'.. మీరూ చూడండి

సాధారణంగా సెలబ్రెటీలు, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తల వంటి సంపన్నులు ఎక్కువగా లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే సినీ పరిశ్రమలోని వారికి ఈ అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇందులో కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా ఉన్నారు. ఇప్పటికే మమతా మోహన్ దాస్, కత్రినా కైఫ్ మొదలైన వారు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి తెలుసుకున్నాం.

ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె 'అతియా శెట్టి' ప్రముఖ జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అయిన 'అతియా శెట్టి' ఇటీవల ఆడి క్యూ7 (Audi Q7) ఎస్‌యూవీని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను 'అతియా శెట్టి' సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను మీరు ఇక్కడ చూడవచ్చు.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

అతియా శెట్టి కొనుగోలు చేసిన ఈ ఆడి Q7 SUV 55 TFSI Q టెక్ వేరియంట్‌ అని తెలిసింది. కొత్త ఆడి Q7 ధర మార్కెట్లో రూ. 88.33 లక్షలు. ఇప్పటికే ఈమె వద్ద మరిన్ని లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలిసింది. ఇప్పుడు కొత్తగా ఆడి క్యూ7 SUV ఇందులో చేరిపోయింది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఆడి క్యూ7 (Audi Q7) SUV రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఒకటి ప్రీమియం ప్లస్ కాగా, మరొక SUV టెక్నాలజీ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 79.99 లక్షలు మరియు రూ. 88.33 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ కొత్త లగ్జరీ కారు ఇటీవల కాలంలోనే భారతీయ మార్కెట్లో విడుదలైంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఆడి క్యూ7 SUVలో 3.0-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, పెట్రోల్ పెట్రోల్ ఇంజన్‌ అందుబాటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఈ SUV కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఆడి క్యూ7 ఆల్-వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటమే కాకుండా.. ఆటో, కంఫర్ట్, డైనమిక్, ఎఫిషియెన్సీ, ఆఫ్-రోడ్, ఆల్-రోడ్ మరియు ఇండివిజువల్ అనే 7 డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల్ని మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఇందులోని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ ORVMలు, అప్‌డేటెడ్ టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లతో పాటు క్యాబిన్ లైటింగ్, 12-వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఇక ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. ఇది కాకుండా, ఇది మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీట్, పవర్-ఫోల్డింగ్ వింగ్ మిర్రర్‌లు, డైరెక్ట్ టైర్-ప్రెజర్ మానిటర్, యాంబియంట్ లైటింగ్‌ వంటి వాటిని కూడా స్టాండర్డ్ గా పొందుతుంది. ఇందులోని 7-సీటర్ మోడల్ మూడవ వరుసలో ఎలక్ట్రిక్ ఫోల్డింగ్‌తో పాటు 4 జోన్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, ఎలక్ట్రిక్ బూట్ లిడ్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, పార్క్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

కొత్త క్యూ7 SUV 'మై ఆడి కనెక్ట్' యాప్‌తో పాటు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ప్రోడక్ట్ విజువలైజర్ వంటి ఆధునిక టెక్నాలజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త SUV మూడు వరుసల సీటర్, కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున ఇది 20-ఇంచెస్ అల్లాయ్ వీల్స్, స్లిమ్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్ యూనిట్, పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ గ్రిల్, విండోస్‌పై క్రోమ్ గార్నిష్ మరియు క్రోమ్ లైన్డ్ డోర్‌లను పొందుతుంది. అంతే కాకుండా ఇది మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లను కూడా పొందింది, వీటిని బూట్ డోర్ వద్ద స్లిమ్ క్రోమ్ స్ట్రిప్ జత చేస్తుంది. వెనుక బంపర్‌కు క్రోమ్-టిప్డ్ ఎగ్జాస్ట్ మరియు స్కిడ్ ప్లేట్ కూడా ఉన్నాయి.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

కొత్త ఆడి క్యూ7 మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉంటుంది. అవి వైట్, బ్లాక్, బ్లూ, గ్రే మరియు సిల్వర్ కలర్స్. ఇంటీరియర్‌లో బీజ్ మరియు బ్రౌన్ అనే రెండు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి ఈ లగ్జరీ కారుని చాలా ఆకర్షణీయంగా చేస్తుంది. ఆడి క్యూ7 దేశీయ మార్కెట్లో బిఎండబ్ల్యు ఎక్స్7, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్, వోల్వో XC90, ల్యాండ్ రోవర్ డిస్కవరీ మరియు లెక్సస్ ఆర్ఎక్స్ వంటి వాటికి ఇది ప్రత్యర్థిగా ఉంటుంది.

ఖరీదైన లగ్జరీ కారు కొన్న అతియా శెట్టి.. మీరూ చూడండి

ఇక నటి 'అతియా శెట్టి' విషయానికి వస్తే, ఈమె క్రికెటర్ కె.ఎల్. రాహుల్ తో ప్రేమలో ఉన్నట్లు కొన్ని కథనాల ద్వారా తెలిసింది. ఇందులో భాగంగానే 2022 ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా అతియాతో దిగిన ఫొటోను రాహుల్ షేర్ చేశారు. అతియా శెట్టి 2015లో 'హీరో' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తరువాత అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలుతో మళ్ళీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Most Read Articles

English summary
Actress athiya shetty bought new audi q7 suv details
Story first published: Wednesday, February 16, 2022, 16:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X