కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

బ్రిటిష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover) ఆవిష్కరించిన తమ అధునాతన 2022 మోడల్ రేంజ్ రోవర్ స్పోర్ట్‌ (2022 Range Rover Sport) ఎస్‌యూవీ ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. త్వరలో భారత మార్కెట్లో విడుదల కాబోయే ఈ లగ్జరీ ఎస్‌యూవీ ధరను రూ.1.64 కోట్లు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ల్యాండ్ రోవర్ ఇప్పటికే తమ భారతీయ వెబ్‍‌సైట్‍లో ఈ మోడల్ ను లిస్ట్ చేసింది. అయితే, భారతదేశంలో ఈ ఎస్‌యూవీ డెలివరీలు నవంబర్ 2022 నెలలో ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త 2022 వెర్షన్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ మునుపటి తరం మోడళ్ల కన్నా ఎంతో మెరుగైన డిజైన్ లాంగ్వేజ్ ని కలిగి ఉండి, చూడటానికి చాలా క్లీన్ మోడ్రన్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. గతంలో ఇప్పటి వరకూ కంపెనీ అందించిన రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్ అత్యాధునిక డిజైన్ మరియు షార్ట్ ఓవర్‌హాంగ్ లను కలిగి ఉండి, మునుపటి మోడల్ కన్నా 75 మిమీ పొడవైన వీల్‌బేస్ ను కలిగి ఉంటుది. పెరిగిన వీల్‌బేస్ కారణంగా ఇది పాత మోడల్ కన్నా పెద్దదిగా కనిపిస్తుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

రేంజ్ రోవర్ స్పోర్ట్ కొత్త తరం ఎస్‌యూవీ ముందు భాగంలో సన్నగా ఉండే ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌లైట్ సెటప్ చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. బానెట్ క్రింది భాగంలో ఉండే ఫ్రంట్ గ్రిల్ ఈ రెండు హెడ్‌లైట్లను కలుపుతున్నట్లుగా ఉంటుంది. ఈ కారు ముందు వైపు మొత్తం మూడు రకాల గ్రిల్స్ ఉంటాయి. వీటిలో మొదటిది బానెట్ క్రింది భాగంలో ఉండి, లైన్స్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మిగిలిన రెండు గ్రిల్స్ ఫ్రంట్ బంపర్‌లో అమర్చబడి ఉంటాయి మరియు ఇవి హనీకోంబ్ ప్యాటర్న్‌ను కలిగి ఉంటాయి.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ లో ఉపయోగించిన ఎల్ఈడి లైట్స్, ఇప్పటి వరకు రేంజ్ రోవర్‌కు అమర్చిన వాటిలో కెల్లా అత్యంత సన్నగా ఉంటాయి. ఈ లైట్లకు ఎడమ వైపున ల్యాండ్ రోవర్ బ్యాడ్జ్‌ కనిపిస్తుంది. ఈ కొత్త మోడల్ సైడ్ విండోస్ క్రింది భాగం నుండి బాడీ కలర్‌లో మరియు దాని పై భాగం అంతా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేయబడి ఉంటుంది. సైడ్ డిజైన్ చాలా క్లీన్ గా స్ట్రైడ్ అండ్ షార్ప్ బాడీ లైన్స్ కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా చూపరుల దృష్టిని ఆకట్టుకునేవి ఇందులోని స్టైలిష్ అల్లాయ్ వీల్స్.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ల్యాండ్ రోవర్ ఈ ప్రత్యేకమైన ఎస్‌యూవీ కోసం వివిధ రకాల సైజులలో అల్లాయ్ వీల్స్ ను అందిస్తోంది. వీటిలో కస్టమర్లు 20 ఇంచ్ నుండి 23 ఇంచ్ వరకూ అల్లాయ్ వీల్స్ ను ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, సైడ్ డిజైన్‌లో బాడీ-కలర్ సైడ్ స్కర్ట్‌లు, ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ మరియు పియానో బ్లాక్ లో ఫినిష్ చేయబడిన సైడ్ మిర్రర్స్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇకపోతే, సైడ్స్‌లో విండోలైన్ క్రింది భాగం వరకూ బాడీ కలర్ పెయింట్ మరియు పై భాగం అంతా కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ లో పెయింట్ చేయబడి ఉంటుంది. ఇది కారుకి మరింత స్పోర్టీ అప్పీల్ ను తెచ్చిపెడుతుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఈ ఎస్‍యూవీ వెనుక భాగంలో డిజైన్ ఎలిమెంట్స్‌ను గమనిస్తే, ఇందులో సన్నటి స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్, వాటి మధ్యలో ఉండే బ్లాక్ స్ట్రిప్ మరియు దానిపై బ్యాడ్జింగ్ లు ప్రధానంగా కనిపిస్తాయి. కారు పైభాగం (రూఫ్ మొత్తం) కూడా బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది, రూఫ్ పై వెనుక భాగంలో కనిపించే డ్యూయెల్ షార్క్ ఫిన్ యాంటెన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. వెనుక భాగంలో స్పాయిలర్ ఎలిమెంట్ కూడా కనిపిస్తుంది. బాడీకి అతికినట్లుగా ఉండే ఈ రియర్ స్పాయిలర్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కంపెనీ దాని సింప్లిసిటీనీ మరోసారి ఇంటీరియర్ లో కూడా హైలైట్ చేస్తుంది. క్యాబిన్ చూడటానికి చాలా క్లీన్ గా కనిపిస్తుంది మరియు డ్యాష్‌బోర్డ్ అతి తక్కువ బటన్లతో చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంటుంది. కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క క్లీన్ ఎక్స్టీరియర్ మాదిరిగానే ఇంటీరియర్ లో కూడా మినిమలిస్ట్ డిజైన్ కనిపిస్తుంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ఉన్న పెద్ద 13.7 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు డ్యాష్‌బోర్డ్ మధ్యలో ఉన్న పెద్ద 13.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే యూనిట్లు ఇంటీరియర్‌లో ప్రధానంగా కనిపిస్తాయి.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఈ కారులోని ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అమెజాన్ అలెక్సా డిజిటల్ వాయిస్ అసిస్టెంట్‌తో ల్యాండ్ రోవర్ యొక్క పివి ప్రో టెక్‌ని కలిగి ఉంటుంది మరియు ఇది మెరిడియన్ ఆడియో సిస్టమ్‌కు కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో సీట్ల హెడ్‌రెస్ట్‌లలో స్పీకర్లు కూడా ఉంటాయి, ఇవి నాయిస్ క్యాన్సిలింగ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. అలాగే, ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు పానోరమిక్ సన్‌రూఫ్ కోసం కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీలో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ మరియు 4.4-లీటర్ ట్విన్-టర్బో వి8, 2 ఇన్‌లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్ (పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్) ఉంటుంది. ఈ ఇంజన్ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW నుండి గ్రహించబడింది. ఈ పవర్‌ట్రైన్ గరిష్టంగా 523 బిహెచ్‌పి శక్తిని మరియు 750 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ కారు కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0-100కిమీ వేగాన్ని చేరుకుటుంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీ విలాసవంతమైన ఫీచర్లతో పాటుగా మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటుంది.

కొత్త 2022 రేంజ్ రోవర్ స్పోర్ట్ (Range Rover Sport) ధర రూ.1.64 కోట్లు, ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?

రేంజ్ రోవర్ స్పోర్ట్ యొక్క అన్ని మోడళ్లు కూడా ల్యాండ్ రోవర్ యొక్క ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. ఒకవేళ, ఎవరైనా కస్టమర్లు ఇందులో స్టోర్మర్ ప్యాక్‌ని ఎంచుకుంటే వారు ఈ ప్యాక్ లో భాగంగా ఆల్-వీల్ స్టీరింగ్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్యాక్ బ్రేకింగ్ మరియు కాన్ఫిగర్ చేయగల ప్రోగ్రామ్‌ల ద్వారా టార్క్ వెక్టరింగ్‌తో డైనమిక్ రెస్పాన్స్ ప్రో, ఎలక్ట్రానిక్ యాక్టివ్ డిఫరెన్షియల్‌ను కూడా కలిగి ఉంటుంది. కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క MLA ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించారు.

Most Read Articles

English summary
All new 2022 land rover range rover sport price revealed india launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X