ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N).. జూన్ 27న విడుదల..!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra) తమ నెక్స్ట్ జనరేషన్ స్కార్పియో విడుదల తేదీని అధికారికంగా వెల్లడించింది. జూన్ 27, 2022వ తేదీన కంపెనీ తమ కొత్త తరం స్కార్పియోను మార్కెట్లో విడుదల చేయనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కొత్త పేరుతో మార్కెట్లోకి రానుంది. దీనికి మహీంద్రా స్కార్పియో-ఎన్ (Mahindra Scorpio-N) అనే పేరు పెట్టారు. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న స్టాండర్డ్ స్కార్పియోకి ఎగువ ఈ ప్రీమియం స్కార్పియో-ఎన్ ను ప్రవేశపెట్టనున్నారు.

ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N).. జూన్ 27న విడుదల..!

దీన్నిబట్టి చూస్తుంటే, మహీంద్రా తమ ప్రస్తుత స్కార్పియో మోడల్ విక్రయాన్ని కొనసాగిస్తూనే, కొత్త తరం స్కార్పియో-ఎన్ ని కూడా విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మహీంద్రా స్కార్పియో-ఎన్ టీజర్ చిత్రాలను, డిజైన్ వీడియోలను కంపెనీ టీజర్ల రూపంలో విడుదల చేసింది. ఈ సరికొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ (Z101 కోడ్‌నేమ్) అనేది ఎస్‌యూవీలకే బిగ్ డాడీగా ఉంటుందని మహీంద్రా టీజ్ చేస్తోంది. ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కొత్త స్కార్పియో-ఎన్ ప్రస్తుత స్కార్పియోకు ఎగువ విక్రయించబడుతుంది మరియు పాత స్కార్పియో మోడల్ ను 'స్కార్పియో క్లాసిక్' పేరుతో విక్రయించబడుతుంది.

ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N).. జూన్ 27న విడుదల..!

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా లాడెర్-ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించబడి ఉంటుంది. గతంలో టెస్టింగ్ దశలో లీకైన స్కార్పియో-ఎన్ చిత్రాలను గమనిస్తే, ఇది ప్రస్తుత క్లాసిక్ వెర్షన్ స్కార్పియో కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ పూర్తిగా సరికొత్త డిజైన్‌లో రాబోతోంది. అంతే కాకుండా, కంపెనీ ఈ ఎస్‌యూవీ యొక్క ఫీచర్లు మరియు పరికరాలలో అనేక అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. అలాగే, ఇందులో మరింత మెరుగైన భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.

ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N).. జూన్ 27న విడుదల..!

మరింత శక్తివంతమైన ఇంజన్

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ సరికొత్త ఇంజన్ ఆప్షన్లతో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం, కంపెనీ విక్రయిస్తున్న ఎక్స్‌యూవీ700 లో ఉపయోగించిన అవే టర్బోచార్జ్డ్ 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లను కొత్త స్కార్పియోకి అనుగుణంగా ట్యూన్ చేసి, ఇందులో ఉపయోగించనున్నారు. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 150 బిహెచ్‌పి శక్తిని మరియు డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా. గేర్‌బాక్స్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లు ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ను కూడా పొందే అవకాశం ఉంది.

ఎస్‌యూవీలన్నింటికీ 'బిగ్ డాడీ' మహీంద్రా స్కార్పియో-ఎన్ (Scorpio-N).. జూన్ 27న విడుదల..!

కొత్త ఛాస్సిస్.. మొదటిసారిగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్..

మహీంద్రా యొక్క కొత్త స్కార్పియోని లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై నిర్మించనున్నారు. అంతేకాకుండా, కొత్త తరం స్కార్పియో ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) కావచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దీని ప్రకారం, ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆప్షన్ పొందిన మొదటి మహీంద్రా ఎస్‌యూవీ అవుతుంది. అయితే ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఒక D-సెగ్మెంట్ ఎస్‌యూవీ అవుతుంది. కంపెనీ ఈ బ్రాండ్ ను తొలిసారిగా 2002 సంవత్సరంలో ప్రారంభించింది. గత 20 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో విక్రయించబడుతున్న కంపెనీ యొక్క లాంగ్ రన్నింగ్ మోడల్ కూడా ఇదే.

సరికొత్త డిజైన్.. సరికొత్త ఫీచర్లు

కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ యొక్క ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అన్ని వైపుల నుండి కొత్త స్కార్పియో డిజైన్ పూర్తిగా మార్చివేయబడింది. అయితే, దీని ఓవరాల్ బాక్సీ సిల్హౌట్ మాత్రం అలానే ఉంటుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో సన్నటి ట్విన్-పాడ్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫ్రంట్ గ్రిల్ మరియు కొత్త ఫ్రంట్ బంపర్‌లు ఉన్నాయి. కొత్త డిజైన్‌లో ఈ కారు మునుపటి కంటే మరింత ఎక్కువ ప్రీమియంగా కనిపిస్తుంది.

అంతేకాకుండా, ఫ్రంట్ గ్రిల్‌పై నిలువుగా ఉండే క్రోమ్ స్లాట్లు, సిల్వర్ రూఫ్ రైల్స్, పానోరమిక్ సన్‌రూఫ్, కొత్త డిజైన్ తో కూడిన 18 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్, కారు ముందు మరియు వెనుక వైపున మహీంద్రా బ్రాండ్ యొక్క సరికొత్త లోగో, ఫాగ్ ల్యాంప్‌ల కోసం కొత్త సి-ఆకారపు ఎన్‌క్లోజర్, వెనుక వైపున, నిలువుగా ఉండే టెయిల్ లైట్‌లు మొదలైన డిజైన్ హైలైట్స్ ఉన్నాయి. ఇంటీరియర్స్ లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మూడు వరుసల సీట్లతో పాటుగా, నేటి ఆధునిక కార్లలో మరిన్ని లేటెస్ట్ ఫీచర్లను కోరుకునే వారి కోసం ఇది అనేక సాంకేతిక ఫీచర్లతో నిండి ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త తరం మహీంద్రా థార్ మాదిరిగానే, ఈ కొత్త తరం మహీంద్రా స్కార్పియో-ఎన్ కూడా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ఫ్రంట్ టైర్ యాంగిల్ వార్నింగ్‌లను పొందుతుందని సమాచారం. అలాగే, ఇది వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. భారతదేశంలో ఎస్‌యూవీ విభాగంలో రాజుగా పిలువబడే మహీంద్రా స్కార్పియో, మార్కెట్లో విడుదలైన తర్వాత ఇది ఈ విభాగంలో Kia Seltos, Hyundai Creta, MG Hector, Nissan Kicks, Tata Harrier, Volkswagen Taigunమరియు Skoda Kushaq వంటి మోడళ్లతో పోటీపడనుంది.

Most Read Articles

English summary
All new mahindra scorpio n to be unveiled on june 27 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X