జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

అమెరికన్ కార్ బ్రాండ్ జీప్, భారత మార్కెట్ కోసం తమ సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ జీప్ మెరిడియన్ (Jeep Meridian) ను అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. జీప్ కంపాస్ (Jeep Compass) 5-సీటర్ ఎస్‌యూవీని ఆధారంగా చేసుకొని తయారు చేసిన ఈ పెద్ద ఎస్‌యూవీ గురించి కంపెనీ అనేక విషయాలను వెల్లడి చేసింది. మరి ఈ మూడు వరుసల ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో ఓసారి చూద్దాం రండి.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

Jeep Meridian SUV : ఎక్స్టీరియర్ డిజైన్

జీప్ కంపాస్ ఎస్‌యూవీతో పోలిస్తే, మెరిడియన్ ఎస్‌యూవీని పూర్తిగా భిన్నంగా చూపించేందుకు జీప్ ఇండియా బాగానే కష్టపడిందని చెప్పాలి. ఇందుకోసం మెరిడియన్ లో కంపెనీ అనేక ఎక్స్టీరియర్ డిజైన్ అప్‌గ్రేడ్స్ చేసింది. ఈ రెండు మోడళ్లలో ఉండే అనేక ఎక్స్టీరియర్ డిజైన్ తేడాల కారణంగా, వీటిని సులువుగా గుర్తుపట్టవచ్చు. జీప్ కంపాస్ తో పోల్చి చూస్తే, జీప్ మెరిడియన్ యొక్క హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా విభిన్నమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే, దీని ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు కూడా రీడిజైన్ చేయబడి ఉంటాయి.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

అంతేకాకుండా, జీప్ మెరిడియన్ యొక్క టెయిల్‌లైట్‌లు మరియు టెయిల్‌గేట్ డిజైన్ కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలాగే జీప్ మెరిడియన్ ఎస్‌యూవీలో కంపెనీ ప్రత్యేకమైన 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ను జోడించింది. లోపలి భాగంలో అదనపు సీట్లను జోడించడం వలన మెరిడియన్ వీల్‌బేస్ కంపాస్ వీల్‌బేస్ కన్నా పెద్దదిగా ఉంటుంది. పెరిగిన వీల్‌బేస్ కారణంగా కంపెనీ దాని చాస్సిస్, సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్‌లో కూడా మార్పులు చేసింది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

కంపాస్ ఎస్‌యూవీతో పోలిస్తే మెరిడియన్ కాస్తంత ఎత్తుగా మరియు వెడల్పుగా కనిపిస్తుంది. జీప్ మెరిడియన్ 7-సీటర్ ఎస్‌యూవీ కొలతలను గమనిస్తే, ఇది 4,769 మిమీ పొడవు, 1,859 మిమీ వెడల్పు మరియు 1,682 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. అంతే కాకూండా దీని వీల్‌బేస్ 2,794 మిమీగా ఉంటుంది. ఈ కొలతలను జీప్ కంపాస్ తో పోల్చిచూసినప్పుడు, కంపాస్ కంటే మెరిడియన్ 364 మిమీ ఎక్కువ పొడవు, 41 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 42 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

Jeep Meridian SUV : ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లు

ఈ ప్రీమియం ఎస్‌యూవీలో అమెరికన్ కార్ కంపెనీ అందించే ఫీచర్లను గమనిస్తే, ఇందులో 10.25 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీస్ సరౌండ్ వ్యూ కెమెరా సిస్టమ్ మరియు పవర్డ్ లిఫ్ట్‌గేట్ మొదలైన కంఫర్ట్ అండ్ కన్వీనెన్స్ ఫీచర్లు ఉన్నాయి.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

అంతేకాకుండా, వెనుక సీట్లలోని ప్రయాణీకుల కోసం రియర్ ఏసి వెంట్స్ మరియు చార్జింగ్ పోర్ట్స్, విశాలమైన లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్, అదనపు లగేజ్ స్పేస్ కోసం మడిచిపెట్టగల వెనుక సీట్లు వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ 7-సీటర్ ప్రీమియం ఎస్‌యూవీలో కంపెనీ ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, అబ్స్టాకిల్ డిటెక్షన్ మరియు యాంటీ పించ్ సెన్సింగ్ సేఫ్టీ విండోస్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

Jeep Meridian SUV : ఇంజన్, గేర్‌బాక్స్

జీప్ మెరిడియన్ ప్రారంభంలో కేవలం ఒక ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే విక్రయించబడుతుందని సమాచారం. ఇందులో 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ మల్టీజెట్ టర్బో డీజిల్ ఇంజన్‌ ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 170 పిఎస్‌ల శక్తిని మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

ఈ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా స్టాండర్డ్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD) తో లభిస్తాయి. ఆసక్తిగల కస్టమర్ల కోసం ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (AWD) కూడా ఉంటుంది. కాకపోతే, ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో మాత్రమే అందించబడుతుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ కేవలం 10.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు గరిష్టంగా గంటకు గంటకు 198 కిమీ వేగంతో పరుగులు తీయగలదు.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

Jeep Meridian SUV : సేల్స్ ఎప్పుడు? పోటీ ఏవి?

జీప్ మెరిడియన్ ఎస్‌యూవీని కంపెనీ ప్రస్తుతం కేవలం ప్రజల వీక్షణకు మాత్రమే అందుబాటులో ఉంచింది. అయితే, వచ్చే మే లేదా జూన్‌ నెలలో ఈ కారు అధికారికంగా విక్రయానికి రావచ్చని భావిస్తున్నారు. బుకింగ్స్ కూడా మే 2022 నెలలో ప్రారంభం అవుతాయని సమాచారం. అలాగే, జీప్ మెరిడియన్ ఎస్‌యూవీని కంపెనీ రాబోయే కొద్ది నెలల్లో ఓ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా విడుదల చేయవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రారంభంలో దీని కేవలం ఒకే ఒక డీజిల్ ఇంజన్‌తో అందించనున్నారు.

జీప్ మెరిడియన్ (Jeep Meridian) ఎస్‌యూవీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే..?

కాంపిటీషన్ విషయానికి వస్తే, జీప్ మెరిడియన్ ప్రీమియం ఫుల్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలో టొయోటా ఫార్చ్యూనర్, ఎమ్‌జి గ్లోస్టర్, మహీంద్రా ఆల్ట్యూరాస్ జి4, కియా కార్నివాల్ మరియు ఇటీవలే భారతదేశంలో డిస్‌కంటిన్యూ అయిన ఫోర్డ్ ఎండీవర్ వంటి 7-సీటర్ వాహనాలతో పోటీపడే అవకాశం ఉంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
All you need to know about jeep meridian 7 seater premium suv
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X