Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విక్రయిస్తున్న ఆల్ట్రోజ్ మోడల్ లో కంపెనీ తాజాగా ఓ కొత్త ఆటోమేటిక్ వేరియంట్ ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. "డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్, DCA" టెక్నాలజీతో రూపొందించిన "టాటా ఆల్ట్రోజ్ డిసిఏ" (Tata Altroz ​​DCA), ఈ విభాగంలో హ్యుందాయ్ ఐ20 డిసిటి (Hyundai i20 DCT) మరియు మారుతి బాలెనో ఏఎమ్‌టి (Maruti Baleno AMT) వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. మరి ఈ మూడు మోడళ్లలో ఏది బెస్ట్‌గా ఉంటుందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT : ఇంజన్

టాటా ఆల్ట్రోజ్ డిసిఏ (Tata Altroz DCA) 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 109 బిహెచ్‌పి పవర్ ను మరియు 140 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి వరకూ ఈ ఇంజన్ కేవలం 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో అధునాత డిసిఏ (డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్) టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను పరిచయం చేసింది.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

ధర పరంగా చూస్తే, టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ ధరలు దాని మాన్యువల్ వేరియంట్ ధర కంటే సుమారు రూ. 1.07 లక్షలు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఆల్ట్రోజ్ మోడళ్ల ధరలు వరుసగా రూ. 7.02 లక్షలు మరియు రూ. 8.09 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. టాటా ఆల్ట్రోజ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ల మధ్య ఉండే ధరల వ్యత్యాసాన్ని ఈ క్రింది పట్టికలో చూడొచ్చు.

Variant Altroz MT Altroz DCA

Difference
XT ₹7,52,900 ₹8,59,900 ₹1,07,900
XM+ ₹7,02,900 ₹8,09,900 ₹1,07,900
XZ ₹8,02,900 ₹9,09,900 ₹1,07,900
XZ (O) ₹8,14,900 ₹9,21,900 ₹1,07,900
XZ+ ₹8,52,900 ₹9,59,900 ₹1,07,900
XT Dark ₹7,98,900 ₹9,05,900 ₹1,07,900
XZ+ Dark ₹8,82,900 ₹9,89,900 ₹1,07,900
Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

హ్యుందాయ్ ఐ20 డిసిటి (Hyundai i20 DCT) విషయానికి వస్తే, ఇది టాటా ఆల్ట్రోజ్ ఆటోమేటిక్ మాదిరిగా కేవలం ఒక ఇంజన్, ఒక గేర్‌బాక్స్ తో మాత్రమే కాకుండా, రెండు ఇంజన్లు మరియు రెండు ఆటోమేటిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ ఐ20 ఐవిటి ధరలు రూ. 8.9 లక్షల నుండి రూ. 10.51 లక్షల రేంజ్ లో ఉండగా, ఐ20 డిసిటి ధరలు రూ. 9.76 లక్షల నుండి రూ. 11.33 లక్షల రేంజ్ (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్) లో ఉన్నాయి. ఇది కాకుండా, ఐ20 ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్ లో కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధరల వత్యాసాన్ని క్రింది పట్టికలో చూడొచ్చు.

Variant Altroz DCA

i20 AT Variant
XTA ₹8,59,900 ₹9,99,990 Asta IMT
XMA+ ₹8,09,900 ₹8,78,600 Sportz IMT
XZA ₹9,09,900 ₹9,95,000 Asta IVT
XZA (O) ₹9,21,900 ₹10,51,500 Asta (O) IVT
XZA+ ₹9,59,900 ₹9,76,000 Sportz DCT
XTA Dark ₹9,05,900 ₹8,90,000 Sportz IVT
XZA+ Dark ₹9,89,900 ₹10,81,000 Asta DCT
₹11,33,500 Asta (O) DCT
Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

ఇక చివరిగా మారుతి సుజుకి బాలెనో ఏఎమ్‌టి (Maruti Suzuki Baleno AMT) విషయానికి వస్తే, ఇది ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ టెక్నాలజీతో వస్తుంది. ఇది నిజానికి సివిటి, డిసిటి వంటి ఫుల్లీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో ఏమాత్రం పోటీకి రాదు. మార్కెట్లో ఏఎమ్‌టి బాలెనో ధరలు రూ. 7.69 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.49 లక్షల వరకు ఉంటాయి. బాలెనోలో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కేవలం మూడు వేరియంట్‌లకు మాత్రమే పరిమితం చేయబడింది, కాగా, టాటా ఆల్ట్రోజ్ ఏడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఈ రెండు మోడళ్ల మధ్య ధరల వత్యాసాన్ని క్రింది పట్టికలో చూడొచ్చు.

Variant Altroz DCA

Baleno AMT

Variant
XTA ₹8,59,900 ₹8,59,000 Zeta
XMA+ ₹8,09,900 ₹7,69,000 Delta
XZA ₹9,09,900 ₹9,49,000 Alpha
XZA (O) ₹9,21,900
XZA+ ₹9,59,900
XTA Dark ₹9,05,900
XZA+ Dark ₹9,89,900
Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

అధునాతనమైన టాటా ఆల్ట్రోజ్ డిసిఏ ఆటోమేటిక్ గేర్‌బాక్స్

టాటా మోటార్స్ తమ డిసిఏ గేర్‌బాక్స్ లో వెట్ క్లచ్ విత్ యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్, షిఫ్ట్ బై వైర్ టెక్నాలజీ, సెల్ఫ్-హీలింగ్ మెకానిజం మరియు ఆటో పార్క్ లాక్ వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్‌లను జోడించింది. సాంప్రదాయ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్, DCT) ఆటోమేటిక్ గేర్‌‌బాక్స్‌లు దాదాపు 20 గేర్‌లు ఉంటే, ఆల్ట్రోజ్ డిసిఏలో కేవలం 13 గేర్లు మాత్రమే ఉంటాయి.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

కాబట్టి, గేర్‌బాక్స్ లో తక్కువ సంఖ్యలో కదిలే భాగాలు ఉండటం కారణంగా, ఈ కారులో గేర్ షిఫ్ట్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని మరియు ఇది ఎక్కువ కాలం మన్నుతుందని కంపెనీ తెలిపింది. ఈ గేర్‌బాక్స్ యొక్క జీవితకాలాన్ని పెంచేందుకు ఇది సెల్ఫ్-డస్ట్ రిమూవల్ టెక్నాలజీతో వస్తుందని టాటా మోటార్స్ వివరించింది. టాటా ఆల్ట్రోజ్ డిసిఏలో గేర్ షిఫ్ట్ సమయాలు 250 మిల్లీసెకన్ల కంటే తక్కువ సమయం తీసుకుంటాయని కంపెనీ తెలిపింది.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

టాటా ఆల్ట్రోజ్ కారులో లభించే ఫీచర్లు

కొత్త Tata Altroz DCA కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ప్రీమియం లెథెరెట్ సీట్లు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, హర్మాన్ బ్రాండ్‌కి చెందిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, 7 ఇంచ్ టిఎఫ్‌టి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రియర్ ప్యాసింజర్ల కోసం ఏసి వెంట్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు ఐఆర్ఏ కనెక్టెడ్ ఫీచర్లతో స్టాండర్డ్ వేరియంట్లలో లభించే ఇతర అన్ని ఫీచర్లు లభిస్తాయి.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

టాటా ఆల్ట్రోజ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. కంపెనీ ఇందులో రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ గ్లేర్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ కెమెరా మరియు హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్‌ మొదలైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది.

Altroz DCA వర్సెస్ i20 DCT వర్సెస్ Baleno AMT: ఈ మూడు ఆటోమేటిక్ కార్లలో ఏది బెస్ట్?

మరి ఈ మూడు మోడళ్లలో ఏది బెస్ట్..?

అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పరంగా చూసుకుంటే, టాటా ఆల్ట్రోజ్ డిసిఏ మోడల్ లో ఉపయోగించిన గేర్‌బాక్స్ చాలా అధునాతమైనదిగా తెలుస్తోంది. ఇక మారుతి బాలెనో విషయానికి వస్తే, ఇది ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. నిజానికి ఇదొక క్లచ్ లేని మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ లాంటిది కాబట్టి, పెర్ఫార్మెన్స్ పరంగా ఇది ఆధునిక ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో పోటీపడలేదు. హ్యుందాయ్ ఐ20 ధర పరంగా చూస్తే ఆల్ట్రోజ్ కన్నా ప్రీమియంగా ఉంటుంది. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం.

Most Read Articles

English summary
Altroz dca vs i20 dct vs baleno amt automatic premium hatchbacks price comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X