Just In
- 14 hrs ago
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- 16 hrs ago
'హీరో ప్యాషన్ ఎక్స్‌టెక్' ఇప్పుడు అప్డేటెడ్ ఫీచర్స్‌తో: ధర రూ. 74,590 మాత్రమే
- 19 hrs ago
ఇలాంటి ప్రత్యేకమైన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్‌లు మీకూ కావాలా? అయితే చూడండి వీటిని తయారు చేసిందెవరో..!
- 20 hrs ago
రైడింగ్‌కి మీరు సిద్దమేనా.. మార్కెట్లో కొత్త 'కవాసకి నింజా 400' విడుదలైంది: వివరాలు
Don't Miss
- News
Atmakur Bypoll Results 2022:మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు లాంఛనమేనా..?
- Lifestyle
Today Rasi Phalalu :ఓ రాశి వారికి ఈరోజు ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి..!
- Sports
Eng vs Nz 3rd Test: ఆట ఇప్పుడే మొదలైంది.. డారిల్ మిచెల్ వర్సెస్ ఇంగ్లాండ్ షురూ..!
- Movies
ట్రెండింగ్: బండ్ల గణేష్ దృష్టిలో ఛార్మీ వ్యాంపా? రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి.. రష్మీపై సుధీర్ అలా..
- Finance
IT Jobs: భారత IT ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. కంపెనీలు చేస్తున్న ఆ పనితో ఇక కష్టమే..
- Technology
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
టాటా పంచ్ కజిరంగా ఎడిషన్‌ను గెలుచుకున్న ఆ లక్కీ విన్నర్ ఎవరంటే..?
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, అంతరించిపోతున్న ఖడ్గమృగాల పరిరక్షణ కోసం అవగాహన కల్పించేందుకు కాజిరంగా ఎడిషన్స్ పేరిట తమ కార్లలో కొన్ని స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేసిన సంగతి తెలిసినదే. వీటిలో టాటా పంచ్ కాజిరంగా ఎడిషన్ కూడా ఒకటి. ఈ స్పెషల్ ఎడిషన్లలో ఒకదానిని ఐపిఎల్ 2022లో వేలం వేయనున్నట్లు టాటా మోటార్స్ ఇంతకు ముందు ప్రకటించింది. ఇటీవల జరిగిన ఐపిఎల్ 2022 సీజన్లో మే 1-3 తేదీలలో కంపెనీ ఈ కారు కోసం వేలం నిర్వహించింది. ఈ వేలంలో పూణేకు చెందిన అమీర్ ఖాన్ ఈ స్పెషల్ ఎడిషన్ టాటా పంచ్ కజిరంగాను గెలుచుకున్నారు.

టాటా పంచ్ కాజిరంగా ఎడిషన్ కోసం అభిమానులు ఆన్లైన్లో బిడ్లు వేశారు. ఇందులో అమీర్ ఖాన్ విజేతగా నిలిచినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. ఈ సందర్భంగా వేలంలో గెలుచుకున్న టాటా పంచ్ కాజిరంగా ఎడిషన్ తాళం చెవులను ముంబైలోని వాంఖడే స్టేడియంలో విజేతకు అందజేశారు. విజేతకు, ఈ స్పెషల్ ఎడిషన్ కారుతో పాటుగా అహ్మదాబాద్‌లో జరిగిన IPL ఫైనల్స్‌కు మరో రెండు టిక్కెట్లతో పాటు ముంబైలో జరిగే టాటా IPL లీగ్ మ్యాచ్‌కు కూడా టిక్కెట్లు దక్కించుకున్నారు.

ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, IPL 2022 సీజన్లో జట్టు కెప్టెన్లందరూ సంతకం చేసిన ప్రత్యేక రైనో ఫలకాన్ని కూడా అమీర్ ఖాన్ కు అందజేశారు. అలాగే, ఈ కారు కోసం అదనపు ఉపకరణాలు (అడిషనల్ యాక్ససరీస్) మరియు కాజిరంగా నేషనల్ పార్క్ సందర్శనకు అన్ని ఖర్చులతో కూడిన ట్రిప్ ను కూడా ఆయన పొందారు. టాటా మోటార్స్ ప్రామిస్ చేసినట్లు, ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం డబ్బును కజిరంగా నేషనల్ పార్క్ పరిరక్షణకు నేరుగా ప్రయోజనం చేకూర్చేందుకు విరాళంగా ఇచ్చింది.

కజిరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పాలంటే, ప్రపంచంలోని 3,000 ఖడ్గమృగాలలో 2/3 వంతు ఈ నేషనల్ పార్క్ లోనే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ ఖడ్గమృగాలు వేటగాళ్ల నుండి తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఖడ్గమృగం కొమ్ము కోసం వేటగాళ్లు వీటిని వేటాడి చంపేస్తున్నారు. ఫలితంగా, ఈ జాతి క్రమంగా అంతరించిపోతుంది. కాలంలో కలిసిపోయిన డైనోసార్ల మాదిరిగా ఈ రైనోలు కూడా మారకూడదనే ఉద్దేశ్యంతో, టాటా మోటార్స్ ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

టాటా మోటార్స్ ప్రకారం, కాజిరంగా ఎడిషన్ SUVలు "ఒక రకమైన" మోడల్‌లు మరియు దేశంలోని గొప్ప భౌగోళిక మరియు జీవ వైవిధ్యం నుండి ప్రేరణ పొందాయి, అదే సమయంలో భారతదేశంలోని గొప్ప జాతీయ ఉద్యానవనాలకు నివాళులు అర్పించేలా వీటిని రూపొందించారు. టాటా పంచ్ కాజిరంగా ఎడిషన్ విషయానికి వస్తే, ఇది ప్రత్యేకమైన 'మీటోర్ బ్రాంజ్' ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ మరియు పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన రూఫ్ తో డ్యూయెల్ టోన్ షేడ్ లో లభిస్తుంది.

అంతేకాకుండా, ఈ కారు ఇంటీరియర్ లో కూడా డ్యాష్‌బోర్డ్‌పై ఎర్తీ బీజ్ లెథెరెట్ అప్హోల్స్టరీ మరియు ట్రాపికల్ వుడ్ ఫినిషింగ్‌తో పాటు ఇంటీరియర్ అంతటా మరికొన్ని ఎర్తీ బీజ్ కలర్ ఇన్సర్ట్లు కనిపిస్తాయి. అలాగే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ను టాటా పంచ్ యొక్క టాప్-స్పెక్ 'క్రియేటివ్' ట్రిమ్ ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు కాబట్టి, ఇందులో అన్ని రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

టాటా పంచ్ ఎస్యూవీ విషయానికి వస్తే, మైక్రో-ఎస్యూవీ భారత కస్టమర్లను ఆకట్టుకుంటున్న ఈ బుజ్జి ఎస్యూవీ టాటా మోటార్స్ లైనప్‌లో అతి తక్కువ సమయంలో అత్యధికంగా అమ్ముడైన వాహనాలలో ఒకటిగా నిలిచింది. అంతే కాకుండా, టాటా పంచ్ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుని ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత సురక్షితమైన వాహనంగా ఉంది. ఈ క్రాష్ టెస్టులో ఇది 17 పాయింట్లకు గాను 16.45 పాయింట్లను స్కోర్ చేసి, పెద్దల రక్షణ కోసం 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కూడా పొందింది.

ఈ చిన్న కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, బ్రేక్ స్వే కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS). ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ కారులో 'డైనప్రో టెక్నాలజీ'తో కూడిన 3-సిలిండర్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 84.48 బిహెచ్పి శక్తిని మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ AMT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

టాటా పంచ్ లో లభించే ఫీచర్ల విషయానికొస్తే, ఈ కారులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన పెద్ద 7 ఇంచ్ హర్మాన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, iRA కనెక్టింగ్ టెక్నాలజీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, నేచురల్ వాయిస్ రికగ్నిషన్ ఫంక్షన్, వాయిస్ కమాండ్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో-ఫోల్డింగ్‌తో పవర్-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి.