భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

భారతదేశంలోని కొనుగోలుదారులు చాలా కాలంగా పాపులర్ అమెరికన్ ఈవీ బ్రాండ్ టెస్లా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, టెస్లా మాత్రం భారతదేశంలోకి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకాలను తగ్గిస్తేనే, ఇక్కడ కాలు పెడతామని మొండిపట్టుతో ఉంది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

అయితే, ఈలోపుగా దేశంలోని ఈవీ అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు అనేక ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ఫిస్కర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ కూడా భారత్‌లో వచ్చే ఏడాది తమ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన ఫిస్కర్ ఐఎన్‌సి (Fisker Inc) గడచిన మార్చి 2022 నెలలో భారతదేశంలోకి ప్రవేశించింది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

అమెరికన్ మార్కెట్లో ఫిస్కర్ విక్రయిస్తున్న తమ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఫిస్కర్ ఓషన్ (Fisker Ocean) ను వచ్చే ఏడాది జులైన నాటికి భారతదేశంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రారంభంలో ఈ కారును భారతదేశానికి దిగుమతి చేసుకొని విక్రయించినప్పటికీ, ఆ తర్వాతి కాలంలో ఈ కారును భారతదేశంలోనే అసెంబుల్ చేయడానికి ప్రయత్నిస్తామని కంపెనీ తెలిపింది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

పూర్తిగా విదేశాలలో తయారు చేయబడిన కార్లను భారతదేశంలోకి దిగుమతి చేసుకోవడంపై భారీ సుంకాల నేరథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంపోర్టెడ్ కార్లపై విధించే భారీ దిగుమతి సుంకాల నుండి తప్పించుకుని, భారతీయ వినియోగదారులకు సరసమైన ధరకే తమ ఎలక్ట్రిక్ కార్లను అందించాలంటే ప్రస్తుతం ఇదొక్కటే మార్గమని ఫిస్కర్ అభిప్రాయపడింది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

ప్రస్తుతం అమెరికా, చైనా మరియు యూరప్ వంటి దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగం తక్కువగానే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో భారతదేశం కూడా పూర్తి ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారే అవకాశం ఉందని, ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో తాము ముందుగా వ్యాపారం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఫిస్కర్ కంపెనీ సీఈఓ హెన్రీ ఫిస్కర్ అన్నారు.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

రాబోయే నెలల్లో ఫిస్కర్ తమ తొలి డీలర్‌షిప్ కేంద్రాన్ని ఢిల్లీలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఫిస్కర్ ఓషన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా బుకింగ్‌లు ఓపెన్ చేయబడ్డాయి. ఈ మోడల్ కోసం ఇప్పటికే 60,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు సమాచారం. వీటిలో కొన్ని బుకింగ్స్ భారతదేశం నుండి కూడా ఉన్నాయి. భారతదేశంలో ఫిస్కర్ ఓషన్ డెలివరీలు జూలై 2023లో ప్రారంభమవుతాయని అంచనా.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

ఫిస్కర్ 2024 నాటికి భారతదేశంలోనే స్థానికంగా తమ కార్లను అసెంబుల్ చేయాలని చూస్తోంది. సుమారు రూ.20 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో తమ ఎలక్ట్రిక్ కార్లను అందించడం ద్వారా భారత మార్కెట్లో భారీ వాటాను సొంతం చేసుకోవాలని ఫిస్కర్ ప్లాన్ చేస్తోంది. ఫిస్కర్ తమ ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఈ కంపెనీ నుండి ముందుగా రాబోయే ఫిష్కర్ ఓషన్ (Fisker Ocean) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ విభాగంలో టెస్లా కార్లకు పోటీగా నిలుస్తుంది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

గ్లోబల్ మార్కెట్లలో ఫిస్కర్ ఓషన్ మూడు ట్రిమ్ లలో లభిస్తోంది. ఇందులో మొదటిది ఓషన్ స్పోర్ట్. మార్కెట్లో దీని ధరలు 37,499 డాలర్ల (సుమారు రూ.30 లక్షల) నుండి ప్రారంభం కానున్నాయి. ఇది బేస్ వేరియంట్ మరియు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 440 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఫిస్కర్ ఓషన్ స్పోర్ట్ 275 హెచ్‌పి (205kW) శక్తిని ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్ (ఫ్రంట్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది మరియు ఇది కేవలం 6.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

ఇకపోతే, రెండవది ఫిస్కర్ ఓషన్ అల్ట్రా. మార్కెట్లో దీని ధరలు 49,999 డాలర్లు (సుమారు రూ.40 లక్షలు)గా ఉంటుంది. ఇందులో 540 హెచ్‌పి (400kW) పవర్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ (ఆల్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 610 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఈ కారు కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

చివరిది మరియు మూడవది ఫిస్కర్ ఓషన్ ఎక్స్‌ట్రీమ్. మార్కెట్లో దీని ధర 68,999 డాలర్లు (సుమారు రూ.56 లక్షలు)గా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 630 కిమీ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులో 550 హెచ్‌పి (410kW) శక్తిని జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు మరొకటి వెనుక అమర్చబడి ఉంటాయి. ఇదొక ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు కేవలం 3.6 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

భారతదేశంలో టెస్లా కన్నా ముందే ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్ధమైన మరో అమెరికన్ కంపెనీ

ఫిస్కర్ ఇప్పటికే భారతదేశంలో తమ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఫిస్కర్ ఇన్‌కార్పోరేషన్ యొక్క భారతీయ విభాగాన్ని ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Fisker Vigyan India Pvt Ltd) అనే పేరుతో పిలుస్తారు. ఫిస్కర్ భారతదేశంలో తమ తొలి ఐటీ డెవలప్‌మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేస్తుంది. ప్రారంభ దశలో భాగంగా, ఈ కంపెనీలో 300 మంది ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
American ev maker fisker to launch its electric suv ocean in india by july 2024 details
Story first published: Saturday, September 24, 2022, 20:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X