'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్ వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో తన కొత్త 'క్యూ3' (Q3) ఎస్‌యువి విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కంపెనీ ఇప్పుడు ఈ లగ్జరీ కారుని దేశీయ మార్కెట్లో విడుడల చేయడానికి ముందే ఆల్-ఇండియా రోడ్‌షోను ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Audi A8 L: ధర & వివరాలు

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, ఈ రోడ్ షో 2022 సెప్టెంబర్ లో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా, ఆడి ఇండియా భారతదేశంలోని మొత్తం 29 షోరూమ్‌లలో తన కొత్త క్యూ3 ఎస్‌యువిని ప్రదర్శిస్తుంది. కావున డెలివరీల కంటే ముందే కస్టమర్లు ఈ లగ్జరీ ఎస్‌యువి చూడవచ్చు.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఈ రోడ్‌షో భారతదేశంలోని ప్రముఖ నగరాలైన అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ/ఎన్‌సీఆర్, గోవా, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, జమ్ము, కర్నాల్, కోల్‌కతా, కొచ్చి, లక్నో, లూథియానా, మధురై, ముంబై, పూణే, రాజ్‌కోట్, రాయ్‌పూర్., సూరత్, ఉదయపూర్ మరియు వైజాగ్‌లోని ఆడి ఇండియా డీలర్‌షిప్‌లలో నిర్వహించబడుతుంది. కావున కస్టమర్లు ఇక్కడ సందర్శించి ఈ కొత్త ఎస్‌యువి చూడవచ్చు.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఆడి కంపెనీ విడుదల చేయనున్న కొత్త క్యూ3 భారతదేశంలో ప్రముఖ కారుగా అవతరించనుంది. ఇది ఖచ్చితంగా కంపెనీ యొక్క అమ్మకాలను ముందుకు తీసుకెళ్తుంది. దీని గురించి ఆడి ఇండియా హెడ్ మిస్టర్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' మాట్లాడుతూ.. భారతదేశంలో కొత్త ఆడి క్యూ3 ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. అయితే ఈ ఎస్‌యువి డెలివరీలకు ముందు, వినియోగదారులకు దగ్గరగా చూపించడానికి తగిన సన్నాహాకు కూడా చేస్తున్నాము.. దీనిని చూడటానికి ఆడి ప్రేముకులు తప్పకుండా ఉత్సాహం చూపిస్తారని ఆశిస్తున్నామన్నారు.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఆడి కంపెనీ విడుదల చేయనున్న ఈ ఎస్‌యువి కోసం బుకింగ్స్ కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ని సందర్శించి ముందస్తుగా రూ. 2,00,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారభమవుతాయి. ఇది మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్స్. ఈ రెండు వేరియంట్లు కూడా ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఆడి క్యూ3 ఎస్‌యువి డిఆర్ఎల్ తో కూడిన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటుంది.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఆడి క్యూ3 పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ దిగువన హెక్సాగోనల్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది. అదే సమయంలో ఇది బ్లాక్-అవుట్ సైడ్ స్కర్ట్‌లు మరియు క్లియర్ షోల్డర్ లైన్‌ వంటివి కూడా పొందుతుంది, కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్-లైట్లు మరియు రీప్రొఫైల్డ్ బంపర్ కాకుండా మిగిలివన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు స్టాండర్డ్ 10.25-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం డాష్ ఇన్సర్ట్‌లు, లెదర్ సీటు అప్హోల్స్టరీ, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

కొత్త ఆడి క్యూ3 అంతర్జాతీయ మార్కెట్లలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ అందించగా, .0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ట్యూన్స్ లో 190 బిహెచ్‌పి పవర్ మరియు 230 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

అయితే ఇండియా-స్పెక్ ఆడి క్యూ3 మాత్రం 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది. ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

'ఆడి క్యూ3' ని విడుదలకుముందే చూసెయ్యండి.. కంపెనీ కొత్త ప్లాన్

ఇదిలా ఉండగా కంపెనీ తన అన్ని కార్లపైనా 2.4 శాతం ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరలు 2022 సెప్టెంబర్ 20 నుంచి అంటే వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. కావున వచ్చే నెల నుంచి కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి. ఇందులో A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ మరియు RS Q8 వంటి పెట్రోల్ కార్లు మరియు 'ఇ-ట్రాన్' బ్రాండ్ క్రింద ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జిటి మరియు ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి వంటి ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi india to commence all india road show for new audi q3 suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X