ఆడి ధరలు మరింత వేడిగా.. 2.4 శాతం పెరగనున్నాయ్: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధిక అమ్మకాలు పొందుతున్న జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థల్లో ఒకటి 'ఆడి' (Audi). ఆడి కంపెనీ దేశీయ మార్కెట్లో A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ మరియు RS Q8 వంటి పెట్రోల్ కార్లను విక్రయిస్తోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 'ఇ-ట్రాన్' బ్రాండ్ క్రింద ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జిటి మరియు ఆర్ఎస్ ఇ-ట్రాన్ జిటి వంటి వాటిని విక్రయిస్తోంది.

Recommended Video

బుకింగ్స్ Mahindra Scorpio-N హవా.. 30 నిముషాల్లో 1 లక్ష బుకింగ్స్

ఆడి కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న తమ అన్ని కార్లపైన ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే కంపెనీ ఇప్పుడు ఎంతవరకు ధరలను పెంచనుంది, ఎప్పటినుంచి పెంచనుంది అనే మరిన్ని ఈ కథనంలో చూద్దాం.. రండి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, అన్ని కార్లపైనా 2.4 శాతం ధరలను పెంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ ధరలు 2022 సెప్టెంబర్ 20 నుంచి అంటే వచ్చే నెల నుంచి పెరగనున్నాయి. కావున వచ్చే నెల నుంచి కొత్త ధరలు అందుబాటులో ఉంటాయి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ఇన్‌పుట్ మరియు సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీ యొక్క ఉత్పత్తుల ధరలను కూడా పెంచవలసి వస్తోదని ఆడి ఇండియా హెడ్ 'బల్బీర్ సింగ్ ధిల్లాన్' ఒక ప్రకటలో తెలిపారు. కావున వచ్చే నెల నుంచి ధరలు 2.4 శాతం పెరుగుతాయి. దీనిని కస్టమర్లు తప్పకుండా అర్థం చేసుకోవాలి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ధరల పెరుగుదల అనేది తప్పకుండా కొనుగోలుదారులపైనా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏది తెలియరావాలి. రానున్న పండుగ సీజన్ లో ఎక్కువమంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. కావున కంపెనీ కస్టమర్ల కోసం ఏవైనా కొత్త స్కీమ్స్ లేదా ఆఫర్స్ తీసుకువస్తుందా.. అనేది తెలియరావాలి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ఇదిలా ఉండగా ఆడి కంపెనీ ఇటీవల భారతదేశంలో తన క్యూ3 కోసం ఆన్‌లైన్ బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. కావున ఈ SUV కొనాలనే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్ ని సందర్శించి ముందస్తుగా రూ. 2,00,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఈ సంవత్సరం చివరినాటికి ప్రారభమవుతాయి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ఆడి క్యూ3 అనేది 2019 లోనే ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. అయితే ఇప్పుడు అప్డేటెడ్ క్యూ3 భారతీయ తీరాలను చేరుకునే రోజు వచ్చేసింది. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క MQB ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. అదే సమయంలో ఇది క్యూ8 SUV నుండి ప్రేరణ పొందింది.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ కొత్త ఆడి క్యూ3 మొత్తం రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉండనుంది. అవి ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ వేరియంట్స్. ఈ రెండు వేరియంట్లు కూడా ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇది డిఆర్ఎల్ తో కూడిన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్-ల్యాంప్స్, పనోరమిక్ సన్‌రూఫ్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, 10.1-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడిన కొత్త త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి స్టాండర్డ్‌గా పొందుతుంది.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ఆడి క్యూ3 పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు ఫ్రంట్ బంపర్ దిగువన హెక్సాగోనల్ ఫాగ్ ల్యాంప్‌లను పొందుతుంది. అదే సమయంలో ఇది బ్లాక్-అవుట్ సైడ్ స్కర్ట్‌లు మరియు క్లియర్ షోల్డర్ లైన్‌ వంటివి కూడా పొందుతుంది, కావున ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే ఇందులో అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్-లైట్లు మరియు రీప్రొఫైల్డ్ బంపర్ కాకుండా మిగిలివన్నీ దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో 10.1-ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌తో పాటు స్టాండర్డ్ 10.25-ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్యూమినియం డాష్ ఇన్సర్ట్‌లు, లెదర్ సీటు అప్హోల్స్టరీ, 6-స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

ఆడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. 2.4 శాతం పెరగనున్న ధరలు: ఎప్పటినుంచి అనుకుంటున్నారా..?

కొత్త ఆడి క్యూ3 అంతర్జాతీయ మార్కెట్లలో 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ అందించగా, .0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండు ట్యూన్స్ లో 190 బిహెచ్‌పి పవర్ మరియు 230 బిహెచ్‌పి పవర్ అందిస్తాయి. అయితే ఇండియా-స్పెక్ ఆడి క్యూ3 మాత్రం 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 190 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ విడుదల చేస్తుంది. ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను పొందుతుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi luxury cars price hike upto 2 4 percent details
Story first published: Wednesday, August 24, 2022, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X