భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ ఆడి (Audi) దేశీయ మార్కెట్లో విడుదల చేయనున్న కొత్త ఆడి క్యూ7 (Audi Q7) యొక్క బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయదలచిన కస్టమర్లు ఇప్పుడు రూ. 5 లక్షలు చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ యొక్క డీలర్‌షిప్‌ని సందర్శించడం బుక్ చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త కారు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఆడి క్యూ7 కొత్త ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌తో పాటు 'ప్రీమియం ప్లస్' మరియు 'టెక్నాలజీ' అనే రెండు వేరియంట్‌లతో తీసుకురాబడుతోంది. దీనిని కంపెనీ యొక్క ఔరంగాబాద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆధునిక టెక్నాలజీలను కలిగి ఉంటుంది.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఆడి క్యూ7 బుకింగ్స్ ప్రారంభించిన సందర్భంగా ఆడి కంపెనీ హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 2021లో తొమ్మిది ఉత్పత్తులను విజయవంతంగా ప్రారంభించింది. అయితే ఇప్పుడు 2022 వ సంవత్సరంలో కూడా మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కంపెనీ కొత్త ఆడి క్యూ7 విడుదల చేయనుంది. ఈ SUV తప్పకుండా కస్టమర్లను ఆకర్షించడంలో విజయం సాధిస్తుందని మరియు ఇది మంచి పనితీరుని కూడా అందిస్తుందని అయన తెలిపారు.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ SUV ఒక పెట్రోల్ ఇంజిన్ లో మాత్రమే అందుబటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొత్త శక్తివంతమైన 3.0 లీటర్ వి6 టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 340 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఈ కొత్త SUV యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో వెనుక వైపు ఎయిర్‌బ్యాగ్‌లు, హీటెడ్ ORVM లు, అప్‌డేట్ చేయబడిన టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా, ఇందులో క్యాబిన్ లైటింగ్, 12-వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్‌ వంటి మరిన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఆడి క్యూ7 అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్, ఆడి డ్రైవ్ సెలెక్ట్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇవన్నీ కూడా మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. వీటితో పాటు ఇందులో 360-డిగ్రీ-వ్యూ కెమెరా మరియు లేన్ డిపార్చర్ వార్నింగ్‌తో పార్క్ అసిస్ట్ ప్లస్ చేర్చబడిన డ్రైవర్ అసిస్ట్ ఫీచర్‌లు.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఈ SUV మాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు వెనుక ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు మరియు ఫ్రంట్ అండ్ రియర్ డైనమిక్ టర్న్ ఇండికేటర్‌లతో అసాధారణమైన లైటింగ్ పనితీరును అందిస్తాయి, మరియు 4-జోన్ ఎయిర్ కండిషనింగ్, ఎయిర్ అయోనైజర్, 30 రంగులతో కాంటూర్ యాంబియంట్ లైటింగ్, ప్రీమియం 3D సౌండ్ సిస్టమ్ వంటివి కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఇక ఈ ఆడి క్యూ7 యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 5,063 మిమీ, వెడల్పు 1,970 మిమీ, ఎత్తు 1,741 మిమీ మరియు దీని వీల్ బేస్ 2,995 మిమీ వరకు ఉంటుంది. అయితే ఇది 865 లీటర్ల భారీ బూట్‌స్పేస్‌ను పొందుతుంది. కానీ వెనుక సీట్లను మడతపెట్టడం ద్వారా 2,050 లీటర్ల వరకు విస్తరించవచ్చు.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఆడి కంపెనీ గత సంవత్సరంలో అనేక మోడళ్లను విడుదల చేసింది, దీని కారణంగా అమ్మకాలు కూడా మెరుగుపడ్డాయి. కంపెనీ అందించిన అధికారిక సమాచారం ప్రకారం గత సంవత్సరం అమ్మకాలు అంతకుముందుకంటే కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

భారత్‌లో Audi Q7 బుకింగ్స్ స్టార్ట్.. బుకింగ్స్ ప్రైస్ ఎంతంటే?

ఆడి కంపెనీ యొక్క క్యూ7 కారు ప్రపంచ మార్కెట్లో బాగా ప్రసిద్ధి చెందింది. ఇది మంచి అమ్మకాలతో మార్కెట్లో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలైతే ఎలాంటి ఆదరణ పొందుతుంది, మరియు ఎలాంటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు కంపెనీ ఈ కొత్త SUV ని లాంచ్ చేసిన తరువాత తెలుస్తాయి. అంతే కాకుండా దీని ధర కూడా ఇంకా అధికారికంగా విడుదల కాలేదు, ఇది సుమారు కోటి రూపాయల ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #ఆడి #audi
English summary
Audi q7 bookings open variant features engine details
Story first published: Tuesday, January 11, 2022, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X