మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో వివిధ రకాల బాడీ టైప్ కార్లు ఉన్నప్పటికీ, ఎక్కువగా ఎస్‌యూవీలకే అధిక డిమాండ్ ఉంటోంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ స్పెసిఫిక్ మార్కెట్‌గా ఉన్న భారతదేశం ఇప్పుడు ఎస్‌యూవీ స్పెసిఫిక్ మార్కెట్‌గా మారిపోయింది. ఈ విభాగంలో పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా తయారీదారులు కూడా సరికొత్త ఉత్పత్తులను అందిస్తుండటంతో ఎస్‌యూవీ మార్కెట్లో పోటీ కూడా అధికమైంది.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

భారతీయ వినియోగదారులు కూడా సరసమైన బడ్జెట్ కార్లకంటే, సౌకర్యవంతమైన ఎస్‌యూవీలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ విభాగంలో అమ్మకాలు కూడా పెరిగాయి. ప్రస్తుతం, భారత ఆటోమొబైల్ మార్కెట్లో అనేక రకాల ఎస్‌యూవీ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో గడచిన సెప్టెంబర్ 2022 నెలలో అత్యధికంగా అమ్ముడైన ఆ టాప్ 10 మోడళ్లు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

1. మారుతి సుజుకి బ్రెజ్జా

మారుతి సుజుకి ఈ ఏడాది తమ బ్రెజ్జా ఎస్‌యూవీలో కొత్త 2022 మోడల్‌ని విడుదల చేసింది. ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ బ్రెజ్జా మునుపటి కంటే మెరుగైన డిజైన్ మరియు కొత్త ఫీచర్లతో అందుబాటులోకి రావడంతో ఈ మోడల్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో మొత్తం 15,445 యూనిట్ల మారుతి సుజుకి బ్రెజ్జా ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2021 నెలలో విక్రయించిన 1,874 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు ఏకంగా 724 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

2. టాటా నెక్సాన్

టాటా మోటార్స్ నుండి ప్రస్తుతం అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో టాటా నెక్సాన్ ముందంజలో ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో పాటుగా ఎలక్ట్రిక్ రూపంలో కూడా లభిస్తుంది. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో 14,518 యూనిట్ల విక్రయాలతో టాటా నెక్సాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 2021 నెలలో విక్రయించిన 9,211 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో ఈ మోడల్ అమ్మకాలు 57.6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

3. హ్యుందాయ్ క్రెటా

మిడ్‌సైడ్ ఎస్‌యూవీ విభాగంలో రారాజుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, ఈ విభాగంలోకి కొత్తగా ప్రవేశించిన మోడళ్ల (మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్) నుండి పెరిగిన పోటీ కారణంగా, టాప్ 10 ఎస్‌యూవీల జాబితాలో మూడవ స్థానానికి జారిపోయింది. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో హ్యుందాయ్ క్రెటా మొత్తం 12,866 యూనిట్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2021లో) విక్రయించిన 8,193 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 57 వార్షిక వృద్ధిని కనబరచాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

4. టాటా పంచ్

టాటా మోటార్స్ నుండి వచ్చిన లేటెస్ట్ స్మాల్ కార్ టాటా పంచ్. చిన్న ఎస్‌యూవీగా మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్, తన పంచీ అమ్మకాలతో పెద్ద మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది. గడచిన సెప్టెంబర్‌ 2022 నెలలో టాటా మోటార్స్ మొత్తం 12,251 యూనిట్ల పంచ్ ఎస్‌యూవీలను విక్రయించింది. ఈ టాప్ 10 ఎస్‌యూవీల జాబితాలో చోటు దక్కించుకున్న రెండవ టాటా మోడల్ కారు ఇది.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

5. హ్యుందాయ్ వెన్యూ

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ అందిస్తున్న వెన్యూ సానుకూల అమ్మకాలను కలిగి ఉంది. ఈ విభాగంలోకి ఇటీవల వివిధ కొత్త మోడళ్లు వచ్చినప్పటికీ, హ్యుందాయ్ వెన్యూ మాత్రం తన స్థానాన్ని స్థిరంగా ఉంచుకోవడంలో సఫలమైంది. ప్రీమియం డిజైన్, ప్రీమియం ఫీచర్లు మరియు ప్రీమియం క్వాలిటీతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో మొత్తం 11,033 యూనిట్ల వెన్యూ ఎస్‌యూవీలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే నెలలో విక్రయించిన 7,924 యూనిట్లతో పోలిస్తే, ఇవి 39.2 శాతం పెరిగాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

6. కియా సెల్టోస్

హ్యుందాయ్ క్రెటా స్మాల్ బ్రదర్‌గా ఉండే కియా సెల్టోస్ ఈ జాబితాలో ఆరవ స్థానానికి పడిపోయింది. కియా సెల్టోస్ అమ్మకాల పరంగా మొదట్లో చూపిన వేగాన్ని ఇప్పుడు చూపించడం లేదు. ఈ విభాగంలో ఇప్పుడు వివిధ కొత్త మోడళ్లు అందుబాటులోకి రావడంతో సెల్టోస్‌కి ఆదరణ తగ్గుతూ వస్తోంది. గడచి నెలలో కియా ఇండియా మొత్తం 11,000 యూనిట్ల సెల్టోస్ ఎస్‌యూవీలను విక్రయించింది. సెప్టెంబర్ 2021 నెలలో విక్రయించిన 9,583 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 15 శాతం పెరిగాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

7. మహీంద్రా స్కార్పియో-ఎన్

మహీంద్రా తమ స్కార్పియో సిరీస్‌లో కొత్త తరం మోడల్‌ను ప్రవేశపెట్టడంతో ఈ ఎస్‌యూవీని కొనేందుకు కస్టమర్లు బారులు తీరుతున్నారు. కొత్త తరం స్కార్పియో రాకతో ఈ మోడల్ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో మహీంద్రా మొత్తం 9,536 యూనిట్ల స్కార్పియో వాహనాలను విక్రయించింది. సెప్టెంబర్ 2021 నెలలో విక్రయించిన 2,588 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో స్కార్పియో అమ్మకాలు 268 శాతం పెరిగాయి.

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు ఇవే.. మారుతి బ్రెజ్జా నుండి ఎక్స్‌యూవీ700 వరకూ..

ఇక ఈ జాబితాలోని చివరి మూడు స్థానాల విషయానికి 9,291 యూనిట్ల అమ్మకాలతో కియా సోనెట్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా, 6,080 యూనిట్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ300 తొమ్మిదో స్థానంలోనూ మరియు 6,063 యూనిట్లతో మహీంద్రా ఎక్స్‌యూవీ700 పదో స్థానంలో నిలిచాయి.

Most Read Articles

English summary
Best selling suvs in september 2022 maruti brezza to mahindra xuv700 details
Story first published: Friday, October 7, 2022, 8:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X