హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత ఇప్పుడు తయారీదారులు మరియు కొనుగోలుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లు. కార్బన్ ఉద్గార రహిత రవాణాకు ఇవి అత్యుత్తమమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఫ్యూయల్ సెల్ కార్లు క్లీనర్‌గా ఉండటమే కాకుండా వాటిని నడపడానికి అయ్యే ఖర్చు కూడా ఎలక్ట్రిక్ వాహనాల రన్నింగ్ కాస్ట్ కన్నా తక్కువే ఉంటుంది. కానీ, ఈ హైడ్రోజెన్ కార్లను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఫ్యూయెల్ సెల్ టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందలేదు. అయితే చాలా కార్ల తయారీ కంపెనీలు ఈ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

హైడ్రోజెన్ ఫ్యూయెల్ సెల్ కారు రేసులో ఇప్పటికే జపాన్‌కు చెందిన టొయోటా మరియు కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీలు ముందంజలో ఉండగా, ఇప్పుడు జర్మన్ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) కూడా ఈ విభాగంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది. బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజెన్ ఫ్యూయల్ సెల్ కార్లను అభివృద్ధి చేయడానికి టొయోటాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఇరు కంపెనీలు ఇప్పుడు కొత్త హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ కార్లపై పని చేస్తున్నాయి.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

బిఎమ్‌డబ్ల్యూ-టొయోటా భాగస్వామ్యం నుండి మొదటి ఫ్యూయల్ సెల్ కారును 2025లో విడుదల కానుంది. బిఎమ్‌డబ్ల్యూ మరియు టొయోటా కంపెనీలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నాయని బిఎమ్‌డబ్ల్యూ అధికారి ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పారు. బిఎమ్‌డబ్ల్యూ టొయోటాను భాగస్వామిగా ఎంచుకుంది, ఎందుకంటే ఈ కంపెనీ 1990 నుండి ఈ టెక్నాలజీపై పని చేస్తుందని మరియు ఇప్పటికే మార్కెట్లో ఫ్యూయల్ సెల్ కారును కూడా విడుదల చేసిందని ఆయన చెప్పారు.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

పెద్ద సైజులో ఉండే ఎస్‌యూవీ లాంటి వాహనాలకు ఫ్యూయల్ సెల్ టెక్నాలజీ చాలా అనుకూలంగా ఉంటుందని, చిన్న సైజు కార్ల కోసం ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం చాలా క్లిష్టంగా ఉంటుందని మరియు వాటి విజయావకాశాలు కూడా తక్కువగా ఉంటాయని సదరు బిఎమ్‌డబ్ల్యూ అధికారి తెలిపారు. బిఎమ్‌డబ్ల్యూ ఇటీవలే 2021 మ్యూనిచ్ మోటార్ షోలో తమ మొదటి హైడ్రోజన్-ఆధారిత ఫ్యూయెల్ సెల్ కారు బిఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్5 (BMW iX5) ని ప్రదర్శించింది. ఈ కారు యొక్క కొన్ని యూనిట్లను ఉత్పత్తి చేయడానికి కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ఎలక్ట్రిక్ వాహనాలతో పోలిస్తే, ఫ్యూయల్ సెల్ వాహనాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఎఫ్‌సిఈవి (Fuel Cell Electric Vehicle) మరియు ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicle) మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే, FCEVలు వాహనం యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌లకు శక్తినివ్వడానికి హైడ్రోజన్‌ను ఉపయోగించే ఇంధన కణాలను (ఫ్యూయెల్ సెల్స్) కలిగి ఉంటాయి మరియు వీటికి బాహ్య (ఎక్స్‌టర్నల్) ఛార్జింగ్ అవసరం ఉండదు. కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కాదు, ఇవి చాలా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ లను కలిగి ఉంటాయి మరియు ఈ బ్యాటరీలను చార్జ్ చేయడానికి బయటి నుండి విద్యుత్ వనరు అవసరం అవుతుంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ఫ్యూయల్ సెల్ వాహనాలు ఎలాంటి ఉద్గారాలను ఉత్పత్తి చేయవు మరియు వాటి ఇంధనాన్ని నింపడం కూడా చాలా సులభం. ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేయడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటుండగా, హైడ్రోజన్ ఇంధన సెల్ వాహనాలకు నిమిషాల వ్యవధిలో ఇంధనాన్ని నింపుకోవచ్చు. ప్రస్తుతానికి, బిఎమ్‌డబ్ల్యూ యొక్క హైడ్రోజన్ ఫ్యూయెల్ ఎస్‌యూవీ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు. ఈ కారు పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత ఇది పూర్తి హైడ్రోజెన్ ట్యాంక్ తో సుమారు 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. కారులో హైడ్రోజన్ ట్యాంక్ ను పూర్తిగా నింపడానికి సుమారు 4-5 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో హైడ్రోజన్‌తో నడిచే రెండు మాస్-మార్కెట్ కార్లు ఉన్నాయి. వీటిలో టొయోటా మిరాయ్ (Toyota Mirai) మరియు హ్యుందాయ్ నెక్సో (Hyundai Nexo) మోడళ్లు ఉన్నాయి. సమాచారం ప్రకారం, టొయోటా మిరాయ్ హైడ్రోజన్ పవర్డ్ కారును ఫుల్ ట్యాంక్ సాయంతో (5.6 కిలోల H2)పై గరిష్టంగా 647 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. భారత ప్రభుత్వం ఇప్పటికే ఓ టొయోటా మిరాయ్ హైబ్రిడ్ కారును మనదేశంలోకి దిగుమతి చేసుకుని, దాని సాంకేతికతను అధ్యయనం చేస్తోంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

ప్రస్తుతం, గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కిలోకు మూడు నుండి నాలుగు డాలర్ల మధ్యలో ఉంటుంది. అంటే, మనదేశ కరెన్సీలో కిలో హైడ్రోజెన్ తయారు చేయడానికి అయ్యే ఖర్చు సుమారు రూ. 230 మరియు రూ. 350 వరకూ ఉంటుంది. కాగా, ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజెన్ ధరను భారతదేశంతో సహా అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కూడా కిలోకు డాలర్ లేదా రెండు డాలర్లకు తగ్గించే దిశగా పని చేస్తున్నాయి. ఇదేగనుక జరిగితే, కిలో హైడ్రోజెన్ ధర సుమారు రూ. 80 లేదా రూ. 150 లకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్-పవర్డ్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేందుకు టొయోటాతో చేతులు కలిపిన బిఎమ్‌డబ్ల్యూ

అసలు గ్రీన్ హైడ్రోజెన్ ఎలా తయారవుతుంది..?

గ్రీన్ హైడ్రోజన్ అనేది విద్యుద్విశ్లేషణ (Electrolysis) ద్వారా పునరుత్పాదక శక్తి (Renewable Energy)ని ఉపయోగించి ఉత్పత్తి చేయబడే హైడ్రోజన్. ఈ పద్ధతి నీటిలో ఉండే ఆక్సిజన్ నుండి హైడ్రోజన్‌ను వేరు చేయడానికి విద్యుత్ ప్రవాహాన్ని ఉపయోగిస్తారు. ఈ విద్యుద్విశ్లేషణకు అవసరమైన విద్యుత్తును సౌరశక్తి (Sola Energy) నుండి కానీ లేదా గాలిశక్తి (Wind Power) వంటి పునరుత్పాదక వనరులను ఉపయోగించి తయారు చేస్తారు. ఇలా రెన్యువబల్ ఎనర్జీ ద్వారా తయారైన హెడ్రోజెన్ ను గ్రీన్ హైడ్రోజెన్ అని పిలుస్తారు.

Most Read Articles

English summary
Bmw and toyota join hands for developing hydrogen fuel cell car details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X