బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

జర్మన్ లగ్జరీ కార్ల బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW) దేశీయ విపణిలో విక్రయిస్తున్న 5-సిరీస్ (5-Series) లగ్జరీ సెడాన్ లో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను తాజాగా మార్కెట్లో విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50 ఎమ్ జహ్రే ఎడిషన్‌ (BMW 5-Series 50M Jahre Edition) పేరుతో కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్ ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది మరియు పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇప్పటికే తమ ఎమ్‌340ఐ ఎక్స్‌డ్రైవ్ (M340i xDrive) మరియు 6-సిరీస్ జిటి (6-Series GT) మోడళ్లలో 50ఎమ్ జహ్రే ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. కాగా, ఇప్పుడు 5-సిరీస్ మోడల్ లో కూడా కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల కస్టమర్లు ఈ కారును బిఎమ్‌డబ్ల్యూ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ను కంపెనీ యొక్క హై-పెర్ఫార్మెన్స్ బ్రాండ్ ఎమ్ ఎడిషన్ (M Edition) యొక్క 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తయారు చేయబడింది.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

ఈ పేరులో 50 అనేది M బ్రాండ్ యొక్క 50 ఏళ్ల వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ 50 జహ్రే ఎడిషన్ వెలుపలి భాగంలో వివిధ కొత్త డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి. కంపెనీ ఈ ప్రత్యేకమైన కారును 5 సిరీస్ లో టాప్-ఆఫ్ ది లైన్ అయిన 530ఐ స్పోర్ట్ ట్రిమ్ ను ఆధారంగా చేసుకొని తయారు చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లోని ఫ్రంట్ అండ్ రియర్ వీల్ హబ్ క్యాప్స్‌ పై క్లాసిక్ BMW మోటార్‌స్పోర్ట్ లోగో ఉంటుంది. ఈ ప్యాకేజీలో '50 ఇయర్స్ ఆఫ్ M' డోర్ ప్రొజెక్టర్లు కూడా ఉంటాయి.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

అంతేకాకుండా, ఇందులో సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ బంపర్ డిజైన్ ఎలిమెంట్స్, విండో ఫ్రేమ్‌లు, బయటి రియర్‌వ్యూ మిర్రర్లు మరియు ఎగ్జాస్ట్ టిప్స్ పై హై-గ్లోస్ బ్లాక్ పెయింట్ జాబ్ కనిపిస్తుంది. ఇంకా ఈ స్పెషల్ ఎడిషన్ కారులో రెడ్ కలర్ M స్పోర్ట్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన జెట్ బ్లాక్‌ 18 ఇంచ్ M అల్లాయ్ వీల్స్‌ కూడా లభిస్తాయి. కంపెనీ 5-సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్ లగ్జరీ సెడాన్ ను నాలుగు మెటాలిక్ పెయింట్ స్కీమ్స్ లో అందిస్తోంది. వీటిలో కార్బన్ బ్లాక్, ఫైటోనిక్ బ్లూ, ఆల్పైన్ వైట్ మరియు బెర్నినా గ్రే అంబర్ ఎఫెక్ట్ కలర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఈ ప్రత్యేక మోడల్‌ లో 650మీ రేంజ్ మరియు యాంటీ-డాజిల్ హై-బీమ్ అసిస్ట్ తో కూడిన లేజర్ హెడ్‌లైట్‌ లను అందించింది. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కాంట్రాస్ట్ డెకరేటివ్ స్టిచింగ్‌తో కాగ్నాక్ కలర్ థీమ్‌లో సెన్‌స్టెక్ అప్‌హోలెస్ట్రీని అందిస్తున్నారు. సీట్ బెల్ట్‌ లలో M డివిజన్ లివరీ మరియు స్టిచింగ్ కూడా కనిపిస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్ క్యాబిన్ లోపల 12.3 ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 16 స్పీకర్లతో కూడిన 464 వాట్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, ఫ్రంట్ స్పోర్ట్స్ సీట్లు మరియు ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

వీటికి అదనంగా టాప్-ఎండ్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ 530i M స్పోర్ట్‌ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు, పరికరాలు ఇందులో ఉంటాయి. ఇక ఇంజన్ విషయానికి వస్తే, 5 సిరీస్ 50ఎమ్ జాహ్రే ఎడిషన్‌లో 1,998 సీసీ, ఇన్‌లైన్-ఫోర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 248 బిహెచ్‌పి పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ లాంచ్

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఈ నెల ఆరంభంలో బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌ను (BMW 6 Series 50 Jahre M Edition) విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ స్పెషల్ ఎడిషన్ కారు ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ స్పెషల్ ఎడిషన్ లో క్లాసిక్ 'బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌స్పోర్ట్' లోగో నుండి ప్రేరణ పొందిన M లోగో ఉంటుంది. ఈ లోగో వీల్ క్యాప్స్ పై కూడా కనిపిస్తుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కారు టాంజానైట్ బ్లూ మెటాలిక్, ఎమ్ కార్బన్ బ్లాక్, బెర్నినా గ్రే అంబర్ ఎఫెక్ట్ మరియు మినరల్ వైట్ అనే కలర్ ఆప్షన్లలలో లభిస్తుంది. పైన తెలిపిన 5-సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్ మాదిరిగానే ఇది కూడా అనేక ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ విడుదల: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్‌ లో 2.0-లీటర్ ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 258 బిహెచ్‌పి పవర్ ను మరియు 400 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50 జహ్రే ఎమ్ ఎడిషన్‌ కేవలం 6.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.

Most Read Articles

English summary
Bmw india launches 5 series 50m jahre edition price specs and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X