బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) తమ పెర్ఫార్మెన్స్ కార్ విభాగం ఎమ్ డివిజన్ (M Division) యొక్క గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎమ్ ఎడిషన్ కార్లలో 50వ వార్షికోత్సవ ఎడిషన్లను విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే 5-సిరీస్ మరియు 6-సిరీస్ కార్లలో బిఎమ్‌డబల్యూ తమ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్లను విడుదల చేయగా, ఇప్పుడు కొత్తగా ఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ మోడల్ లో 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ ను విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

భారత మార్కెట్లో కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎడిషన్ (BMW M4 Competition 50 Jahre M Edition) ధర రూ. 1.53 కోట్ల (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ జర్మన్ కంపెనీ 2022లో తమ ప్రోడక్ట్ లైనప్ లో ప్రత్యేకమైన స్పెషల్-ఎడిషన్ మోడల్‌ లను విడుదల చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎమ్ డివిజన్ యొక్క 50 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటోంది. ఇదివరకు కంపెనీ తమ BMW M340i xDrive, 6 సిరీస్ జిటి మరియు 5 సిరీస్‌ల మోడళ్లలో 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

అన్ని లిమిటెడ్ ఎడిషన్ మోడళ్ల మాదిరిగానే ఈ కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎడిషన్ కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. స్టాండర్డ్ మోడల్ తో పోల్చుకుంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ BMW M4 కాంపిటీషన్ కూప్ లో ఐకానిక్ M రౌండల్స్ బానెట్, బూట్ మరియు వీల్ హబ్ క్యాప్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

వీటికి అదనంగా బిఎమ్‌డబ్ల్యూ ఈ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ మోడల్‌ను రెండు ప్రత్యేకమైన పెయింట్ కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. వీటిచలో మకావ్ బ్లూ మరియు ఇమోలా రెడ్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి రెండూ కూడా స్పోర్ట్స్ కారును మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి. ఇది కాకుండా, ఈ కారులో మ్యాట్ గోల్డ్ బ్రాంజ్ స్కీమ్‌లో పెయింట్ చేయబడిన M బ్రాండెడ్ ఫోర్జ్డ్ అల్లాయ్ వీల్స్ కూడా ఇవ్వబడ్డాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

ఈ కారులో ముందు చక్రాలు 19 ఇంచ్ ల పరిమాణంలో ఉండగా, వెనుక చక్రాలు 20 ఇంచ్ ల పరిమాణంలో ఉంటాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ ఎమ్4 కాంపిటీషన్ కూప్ క్యాబిన్ లోపల ఉన్న హై క్లాస్ మెరినో లెదర్‌ సీట్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి ఆల్-బ్లాక్ టోన్‌లో ఉంటాయి. అలాగే, ఇందులోని M స్పోర్ట్ యొక్క సీట్లు మరియు డోర్ హింజ్ లు ప్రత్యేకమైన 50వ M జహ్రే బ్యాడ్జ్‌తో వస్తాయి.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

అలాగే, సెంటర్ కన్సోల్ లో కూడా 50వ ఎమ్ బ్యాడ్జింగ్ తో కూడిన ప్రత్యేక మెటల్ ప్లేట్ కూడా ఉంటుంది. ఈ స్పెషల్ బ్యాడ్జ్ లు అన్నీ కూడా ఈ కారుని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. ఈ స్పోర్ట్స్ కూప్ కారులో అందుబాటులో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే, ఇది స్టాండర్డ్ ఆన్-సేల్ ఎమ్4 కాంపిటీషన్ కూప్ యొక్క అన్ని అన్ని ఫీచర్లను పొందుతుంది మరియు ఇందులో కొత్తగా లేజర్ హెడ్‌లైట్లు మరియు అడాప్టివ్ M సస్పెన్షన్‌ సెటప్ కూడా లభిస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

ఇవే కాకుండా, ఈ కారులో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, కార్బన్ ఫైబర్ రూఫ్, 12.3 ఇంచ్ M డ్రైవర్ డిస్‌ప్లే, 10.25 ఇంచ్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ హబ్, 16 స్పీకర్లతో కూడిన 464 వాట్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మరియు హెడ్స్-అప్ డిస్‌ప్లే వంటి ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ 50వ జహ్రే ఎడిషన్ లో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నప్పటికీ, ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు లేవు. ఇది స్టాండర్డ్ ఎమ్4 కాంపిటీషన్ ఇంజన్ నే కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ కూప్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులోని 2,993సీసీ, సిక్స్ సిలిండర్, ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ గరిష్టంగా 503 బిహెచ్‌పి పవర్ ను మరియు 650 న్యూటన్ మీటర్ల టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఎమ్ స్టెప్‌ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది. ఈ పవర్‌ఫుల్ ఇంజన్ యొక్క పవర్ అవుట్‌పుట్ కారణంగా, ఈ పెర్ఫార్మెన్స్ స్పోర్ట్ కారు కేవలం 3.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎమ్4 కాంపిటీషన్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా గడచిన జులై 2022 నెల మధ్యలో తమ సరికొత్త 5 సిరీస్ 50వ ఎమ్ జహ్రే ఎడిషన్‌ (BMW 5-Series 50M Jahre Edition) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ స్పెషల్ ఎడిషన్ బిఎమ్‌డబ్ల్యూ 5-సిరీస్ 50ఎమ్ జహ్రే ఎడిషన్ ధర రూ. 67.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. దానికి ముందు కంపెనీ జులై నెల ఆరంభంలో బిఎమ్‌డబ్ల్యూ 6 సిరీస్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్‌ను (BMW 6 Series 50 Jahre M Edition) విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ కారు ధర రూ. 72.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Most Read Articles

English summary
Bmw india launches m4 competition 50 jahre m edition price and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X