భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ యొక్క కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎక్స్5 (X5) ఎస్‌యూవీలో ఓ కొత్త టాప్-ఎండ్ వేరియంట్ ను విడుదల చేసింది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్30డి ఎమ్ స్పోర్ట్ (BMW xDrive30d M Sport) పేరుతో ఈ కొత్త వేరియంట్‌ ను విడుదల చేశారు. మార్కెట్లో దీని ధర రూ.97.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లో టాప్-ఆఫ్ ది లైన్ గా వచ్చిన ఈ కొత్త వేరియంట్ ఎమ్ స్పోర్ట్ డిజైన్ ప్యాకేజీని పొందుతుంది.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌డ్రైవ్30డి ఎమ్ స్పోర్ట్ లగ్జరీ కారులో సిగ్నేచర్ బిఎమ్‌డబ్ల్యూ లేజర్‌లైట్ ఎల్ఈడి హెడ్‌లైట్లు మరియు 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్‌ వంటి అనేక కొత్త ఫీచర్లు లభిస్తాయి. ఇంకా ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ హుడ్, క్రోమ్ సరౌండింగ్స్ తో కూడిన సిగ్నేచర్ ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, విశాలమైన ఫ్రంట్ ఎయిర్ వెంట్, రూఫ్ రెయిల్స్, M-స్పెక్ సైడ్ స్కర్ట్‌లు, బాడీ-కలర్ వీల్ ఆర్చ్ ట్రిమ్‌లు, బ్లూ-కలర్ బ్రేక్ కాలిపర్‌లు మరియు 20 ఇంచ్ M-స్పెక్ అల్లాయ్ వీల్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

అంతేకాకుండా, వెనుక భాగంలో ఎలక్ట్రికల్ గా పనిచేసే టెయిల్‌గేట్, వ్రాప్-అరౌండ్ ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లు, రియర్ డిఫ్యూజర్ మరియు కొత్త టెయిల్‌పైప్‌లు (సైలెన్సర్) కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో హెడ్-అప్ డిస్ప్లే, ఐదు-సీట్ల క్యాబిన్‌ లేఅవుట్, ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, ముందు వైపు ప్రయాణీకుల కోసం కంఫర్ట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్‌ లతో కూడిన M-స్పెక్ లెథర్ వ్రాప్డ్ స్టీరింగ్ వీల్, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ మరియు 12.3 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ-వ్యూ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా ఇతర అధునాతన ఫీచర్లు కూడా ఇందులో లభిస్తాయి. ఎమ్ వెర్షన్ బిఎమ్‌డబ్య్లూ ఎక్స్5 కారులో మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేవు. ఇది అదే స్టాండర్డ్ 3.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

కొత్త BMW X5 xDrive30d M Sport ఎస్‌యూవీ లోని 3.0 లీటర్, 6 సిలిండర్ డీజిల్ ఇంజన్ గరిష్టంగా 262 హెచ్‌పి శక్తిని మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు బిఎమ్‌డబ్ల్యూ యొక్క సిగ్నేచర్ xDrive ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అనుసంధానించబడి ఉంటుంది. ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఇంకా ఇందులో లాంచ్ కంట్రోల్ ఫంక్షన్ మరియు అడాప్టివ్ టూ-యాక్సిల్ ఎయిర్ సస్పెన్షన్ కూడా అందుబాటులో ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లో ఇప్పటి వరకూ టాప్-ఎండ్ వేరియంట్ అయిన SportX Plus తో పోలిస్తే, కొత్తగా వచ్చిన BMW X5 xDrive 30d M Sport యొక్క ఎక్ట్సీరియర్ లో M-స్పోర్ట్ డిజైన్ ప్యాకేజీ హైలైట్ గా నిలుస్తుంది. ఈ ప్యాకేజీలో M-స్పెక్ ఫ్రంట్ ఆప్రాన్, సైడ్ స్కర్ట్‌లు మరియు బాడీ కలర్‌ లో ఉండే వీల్ ఆర్చ్ ట్రిమ్‌లు, M-స్పెక్ బ్లూ కలర్ బ్రేక్ కాలిపర్స్, M స్పోర్ట్-స్పెక్ కారు కీ, సైడ్ ప్రొఫైల్‌లో M స్పోర్ట్ లోగో వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 (2022 BMW X4) విడుదల

ఇదిలా ఉంటే, బిఎమ్‌డబ్ల్యూ తమ ఎక్స్ లైనప్ లో కొత్త 2022 మోడల్ ఎక్స్4 ఎస్‌యూవీని కుడా ఇటీవలే మార్కట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త 2022 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్4 (2022 BMW X4) ధర రూ. 70.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉంది. ఈ కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి: ఎక్స్‌డ్రైవ్ 30ఐ ఎమ్ స్పోర్ట్ డార్క్ షాడో ఎడిషన్ కాగా మరొకటి ఎక్స్‌డ్రైవ్ 30డి ఎమ్ స్పోర్ట్ డార్క్ షాడో ఎడిషన్. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 70.50 లక్షలు మరియు రూ. 72.50 లక్షలుగా ఉన్నాయి.

భారత్‌లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీలో కొత్త టాప్-ఎండ్ వేరియంట్ విడుదల: ధర, ఫీచర్లు

పాత మోడల్ ఎక్స్‌4తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 మోడల్ BMW X4 ఫేస్‌లిఫ్ట్ అనేక అప్డేటెడ్ ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కొత్త BMW X4 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని బ్రూక్లిన్ గ్రే, మినరల్ వైట్ మరియు బ్లాక్ సఫైర్ కలర్లలో అందిస్తున్నారు. ఇందులో అడాప్టివ్ ఎల్ఈడి హెడ్‌లైట్లు, కొత్త 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌, పెద్ద కిడ్నీ గ్రిల్, స్లిమ్ ఎల్ఈడి టెయిల్ లైట్స్, కొత్త ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మొదలైన మార్పులు ఉన్నాయి. ఇందులోని బ్లాక్ షాడో ఎడిషన్‌లో గ్రిల్, సైడ్ మిర్రర్స్, ఎగ్జాస్ట్ పైప్ మరియు అల్లాయ్ వీల్స్ మొదలైన వాటిని గ్లోసీ బ్లాక్ కలర్ లో ఫినిష్ చేశారు.

Most Read Articles

English summary
Bmw x5 xdrive 30d m sport launched in india at inr 97 90 lakh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X