బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ (BMW), భారతదేశంలో గత కొన్ని వారాలుగా తమ ప్రోడక్ట్ లైనప్‌లో 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ పేరిట కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ ఎడిషన్ కార్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసినదే. బిఎమ్‌డబ్ల్యూ యొక్క పెర్ఫార్మెన్స్ కార్ విభాగం ఎమ్ డివిజన్ (M Division) యొక్క గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎమ్ ఎడిషన్ కార్లలో కంపెనీ 50వ వార్షికోత్సవ ఎడిషన్లను విడుదల చేస్తోంది.

Recommended Video

New 2022 BMW X4 Launched In India | Design, Features, Engine | Telugu Details

తాజాగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ లో కూడా కంపెనీ ఈ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ ను విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో ఈ ప్రత్యేకమైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ (BMW X7 40i M Sport 50 Jahre M Edition) ధర రూ.1.2 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కేవలం 10 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది. అంటే, భారత మార్కెట్లో కేవలం 10 బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్లు మాత్రమే అమ్ముడుకానున్నాయి. బిఎమ్‌డబ్ల్యూ ఇండియా ఇప్పటికే 5-సిరీస్, 6-సిరీస్ మరియు ఎమ్4 కాంపిటీషన్ మోడళ్లలో 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ లను విడుదల చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

ప్రస్తుతం, కొత్తగా ప్రారంభించబడిన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ కోసం బుకింగ్‌లు ఓపెన్ చేయబడి ఉన్నాయి మరియు ఆసక్తి గల వినియోగదారులు ఈ ఎస్‌యూవీని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డిజైన్ పరంగా, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ ఎస్‌యూవీని స్టాండర్డ్ మోడల్‌ నుండి ప్రత్యేకంగా ఉంచడానికి కంపెనీ తమ ఇతర 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ల మాదిరిగానే ఎక్స్ట్రీరియర్ లో అనేక మార్పులు చేర్పులు చేసింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

ఎక్స్టీరయర్‌లో చేసిన మార్పులలో స్టాండర్డ్ లోగో కొత్త M లోగో రిప్లేస్ చేశారు, ఇది M డివిజన్ యొక్క 50వ వార్షికోత్సవాన్ని ప్రతిబింబిస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 ఓ మంచి రోడ్ ప్రజెన్స్ కలిగిన ఎస్‌యూవీ, కాబట్టి ఇందులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, కంపెనీ ఇందులో పెద్ద హై-గ్లోస్ కిడ్నీ గ్రిల్, నీలిరంగు X-ఆకారపు ఎలిమెంట్స్ తో కూడిన లేజర్ హెడ్‌లైట్లు, పొడవాటి రూఫ్‌లైన్, సన్నటి టెయిల్ ల్యాంప్స్ మరియు స్ప్లిట్ టెయిల్‌గేట్‌లు మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ జోడించింది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

కస్టమర్లు ఈ ప్రత్యేకమైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ ను అదనపు M యాక్సెసరీ ప్యాకేజీతో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇందులో కార్బన్ ఫైబర్ M పెర్ఫార్మెన్స్ స్టీరింగ్ వీల్, కార్బన్ ఫైబర్ మిర్రర్ క్యాప్స్, అల్కాంటారా ఇంటీరియర్ వంటి మరికొన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవర్ సమాచారం కోసం 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ప్రయాణీకుల వినోదం కోసం 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 3D నావిగేషన్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

అంతేకాకుండా, ఇందులో వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణీకుల వినోదం కోసం ఫ్రంట్ సీట్లపై అమర్చిన రెండు పెద్ద 10.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్‌లు, 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ స్పీకర్ సిస్టమ్ వంటి మరిన్నో లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ లో శక్తివంతమైన 3.0 లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 6 సిలిండర్ ఇంజన్‌ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 340 బిహెచ్‌పి పవర్ ను మరియు 450 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జత చేయబడి ఉంటుంది మరియు ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ కేవలం 6.1 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇంకా ఈ లగ్జరీ కారులో ఇంజన్ ఆటో స్టార్ట్ / స్టాప్, ఎకో ప్రో మోడ్, బ్రేక్-ఎనర్జీ రీజెనరేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ రీజెనరేషన్ వంటి అధునాతన సాంకేతికతలను కలిగి ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 (BMW X7 40i M Sport)లో ప్రత్యేకమైన 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ విడుదల

సేఫ్టీ సిస్టమ్స్ విషయానికి వస్తే, కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 40ఐ ఎమ్ స్పోర్ట్ 50వ జహ్రే ఎమ్ ఎడిషన్ లగ్జరీ ఎస్‌యూవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, సరౌండ్-వ్యూ కెమెరా, ISOFIX చైల్డ్ సీట్ మౌంటు పాయింట్లు మరియు పార్కింగ్-అసిస్ట్ ప్లస్ వంటి మరెన్నో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
Bmw x7 40i m sport 50 jahre m edition launched in india price and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X