దేశీయ మార్కెట్లో భారీ ధరతో విడుదలైన BMW XM - విశేషాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'బిఎండబ్ల్యు' (BMW) భారతీయ మార్కెట్లో కొత్త 'ఎక్స్ఎమ్' (XM) ఎస్‌యువిని అధికారికంగా విడుదల చేసింది. 'బిఎండబ్ల్యు ఎక్స్ఎమ్' ధర రూ. 2.60 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా), ఈ SUV డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర అన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

బిఎండబ్ల్యు విడుదల చేసిన ఈ కొత్త 'ఎక్స్ఎమ్' అనేది 1978 లో ప్రారభించబడిన M1 తరువాత M బ్రాండ్ లో రెండవ స్వతంత్య్ర ఉత్పత్తి, అయితే హైబ్రిడ్ టెక్నలజీతో M బ్రాండ్ నుంచి వచ్చిన మొదటి SUV ఇదే అవుతుంది. బిఎండబ్ల్యు XM ప్రస్తుతం 50e ట్రిమ్ స్థాయిలో మాత్రమే అందించబడుతోంది. ఇది మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ తో అద్భుతమైన పనితీరుని అందించేలా రూపొందించబడింది. కావున ఇది తప్పకుండా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో భారీ ధరతో విడుదలైన BMW XM

BMW XM కంపెనీ యొక్క S68 ట్విన్ టర్బోచార్జ్డ్ 4.4 లీటర్ V8 ఇంజన్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటారుతో వస్తుంది. S68 ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కలిపి 644 బిహెచ్‌పి పవర్ మరియు 800 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తాయి. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేయబడి ఉంటుంది. ఇది M xDrive సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త BMW XM కేవలం కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ లగ్జరీ SUV యొక్క గరిష్ట వేగం గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. కాగా ఇది M డ్రైవర్ ప్యాకేజీతో గంటకు 270 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది హైబ్రిడ్ వెర్షన్ కావున ఇందులో 29.5kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ మోడ్‌లో 88 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

దేశీయ మార్కెట్లో భారీ ధరతో విడుదలైన BMW XM

కొత్త BMW XM పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. కావున ఇది 5,110 మిమీ పొడవు, 2,210 మిమీ వెడల్పు మరియు 1,755 మిమీ ఎత్తు కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. XM SUV యొక్క వీల్‌బేస్‌ 3,105 మిమీ కాగా బూట్‌ స్పేస్ 527 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఇందులో లగేజ్ ఉంచుకోవడానికి కూడా ఎలాంటి లోటు లేదు.

BMW XM డిజైన్ విషయానికి వస్తే, ఇందులో కిడ్నీ గ్రిల్‌ చూడవచ్చు. ఇందులో గోల్డ్ యాక్సెంట్స్ మరియు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ కూడా ఉంది. ముందు బంపర్ దిగువ భాగంలో పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్‌ను కూడా చూడవచ్చు. వెనుకవైపు BMW బ్యాడ్జెస్ మరియు LED టెయిల్‌లైట్స్ ఉంటాయి. సైడ్ ప్రొఫైల్ 21-ఇంచెస్ వీల్స్ పొందుతుంది. కానీ వినియోగదారులు ఇందులో 22-ఇంచెస్ లేదా 23-ఇంచెస్ వీల్స్ ఎందుకోవచ్చు.

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్రైవింగ్ డిస్‌ప్లే మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఉన్న14.5 ఇంచెస్ స్క్రీన్‌లను చూడవచ్చు. లోపలి భాగం వింటేజ్ కాఫీ మెరినో లెదర్ మరియు సాఫ్ట్ బ్లూ నాప్పా లెదర్ అపోల్స్ట్రే తో చాలా వరకు డ్యూయెల్ థీమ్ పొందుతుంది. ఇందులో ADAS టెక్నాలజీ, యాంబియంట్ లైటింగ్, ఫోర్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ BMW XM ఆధునిక డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఈ SUV మార్కెట్లో లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే, ఆస్టన్ మార్టిన్ DBX 707 మరియు పోర్షే కయెన్నే టర్బో GT వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది. ఇలాంటి మరిన్ని కొత్త వాహనాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Bmw xm launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X