రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించిన కొత్త చిత్రం ధాకడ్ (Dhaakad) ఈ వారం చివరిలో థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే, ఈ బాలీవుడ్ భామ సినిమా విడుదలకు ముందే కోట్ల రూపాయల ఖరీదు చేసే ఓ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడ్ బెంజ్ () భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసిన తమ సరికొత్త 2022 మోడల్ మెర్సిడెస్-మెబాక్ ఎస్-క్లాస్ (Mercedes-Maybach S-Class) ను కంగనా కొనుగోలు చేసింది. మేబాక్ (Maybach) మెర్సిడెస్ యొక్క ఆల్ట్రా-లగ్జరీ బ్రాండ్, ఇది స్టాండర్డ్ బెంజ్ కార్ల కన్నా విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

మెర్సిడెస్ బెంజ్ మేబాక్ ఎస్-క్లాస్ ఈ ఏడాది ప్రారంభంలో భారతదేశంలో అమ్మకానికి పరిచయం చేయబడింది మరియు ఆ వెంటనే చాలా మంది ప్రముఖులు, చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ఖరీదైన ఈ కారును తమ గ్యారేజీలలో భాగంగా చేసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా బాలీవుడ్ సినీ నటి మరియు నిర్మాత కంగనా రనౌత్ వచ్చి చేరారు. ఆమె ఇటీవలే తమ కొత్త మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్-క్లాస్ సెడాన్ ను డెలివరీ తీసుకుంది. భారత మార్కెట్లో ఈ కారు ధర సుమారు రూ.3 కోట్లకు పైమాటే.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన కార్లలో మేబాక్ ఎస్-క్లాస్ ఒకటి. ఇది స్టాండర్డ్ ఎస్-క్లాస్ కన్నా పొడవుగా ఉండి, కారు లోపల విలాసవంతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా గడచిన మార్చి నెలలో భారత మార్కెట్లో తమ కొత్త 'మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్-క్లాస్' (Mercedes-Maybach S-Class) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ ప్రారంభ రూ. 2.50 కోట్లు. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.3.2 కోట్లు.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

భారత మార్కెట్లో మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి - S580 మరియు S680 4MATIC. వీటిలో మెర్సిడెస్ S580 అనేది స్థానికంగా అసెంబుల్ చేయబడుతుంది. కాగా, మెర్సిడెస్ మేబాక్ S680 4MATIC అనేది కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సిబియూ) రూట్ లో పూర్తిగా విదేశాలలో తయారు చేయబడిన కారును ఇంపోర్టెడ్ మోడల్ గా భారతదేశానికి దిగుమతి చేసుకోబడుతుంది. ఇందులో S680 4MATIC భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన మేబాక్ మోడల్. కంగనా కొనుగోలు చేసింది కూడా ఇదే టాప్-ఎండ్ వేరియంట్ అని సమాచారం.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

భారత మార్కెట్లో మెర్సిడెస్-మేబాక్ ఎస్-క్లాస్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. సమాచారం ప్రకారం, 2023 వరకు విక్రయించాల్సిన అన్ని యూనిట్లు ఇప్పటికే పూర్తిగా విక్రయించబడ్డట్లు తెలుస్తోంది. మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ కంపెనీ యొక్క S-క్లాస్ లైనప్‌లో అత్యంత ప్రీమియం సెడాన్. ఇది స్టాండర్డ్ ఎస్-క్లాస్ కన్నా 180 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉండి, మరింత లెగ్‌రూమ్ ను అందిస్తుంది. అంతేకాకుండా, ఇందులో లేన్ అసిస్ట్ ఫీచర్‌తో పాటు లెవెల్-2 అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

ఈ కారులో బర్మీస్టర్ హై-ఎండ్ 4డి సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. క్యాబిన్‌ను నిశ్శబ్దంగా ఉంచడానికి, ఇది అడ్జస్టబుల్ డంపింగ్ ADS+తో కూడిన ఎయిర్‌మేటిక్ ఎయిర్ సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇది పవర్‌ట్రెయిన్, ఈఎస్‌పి, సస్పెన్షన్ మరియు స్టీరింగ్‌ను డైనమిక్ సెలెక్ట్ ద్వారా అడ్జస్ట్ చేస్తుంది. ఇవే కాకుండా, కారులో మేబ్యాక్ డ్రైవింగ్ మోడ్ కూడా ఉంటుంది, ఇది పూర్తిగా రైడ్ సౌకర్యాన్ని అందిస్తుంది. మేబ్యాక్ ఎస్-క్లాస్‌లో MBUX ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన ఐదు డిస్‌ప్లే స్క్రీన్‌లు ఉంటాయి.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

కారుకి ఎడమ మరియు కుడి వైపులా ఎగ్జిక్యూటివ్ సీట్లతో కూడిన డ్రైవర్ ప్యాకేజీ ఉంటుంది. ఎత్తైన పైల్ ఫ్లోర్ మ్యాట్ మరియు డైనామికా రూఫ్ లైనర్‌తో ప్రత్యేకమైన నప్పా లెదర్‌ ఉంటుంది. స్టీరింగ్ వీల్ వుడ్ మరియు నప్పా లెదర్ ముగింపును పొందుతుంది. హై ప్రెసిషన్ లేజర్ కెమెరాల సహాయంతో అనేక గ్యాస్ట్రో కంట్రోల్స్ కూడా కారులో అందుబాటులో ఉన్నాయి. డిజైన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో పెద్ద క్రోమ్ గ్రిల్, ఎల్ఈడి హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, బంపర్‌లపై క్రోమ్ ఫినిషింగ్‌, విండోస్ మరియు సైడ్ మిర్రర్లపై క్రోమ్ గార్నిష్ మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ మొదలైన హైలైట్స్ ఉన్నాయి.

రూ.3.2 కోట్ల ఖరీదైన బెంజ్ కారును కొనుగోలు చేసిన బాలీవుడ్ కాంట్రావర్సీ క్వీన్..

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త మెర్సిడెస్ మేబాక్ ఎస్-క్లాస్ ఎస్580 లో 4.0-లీటర్ వి8 మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 503 బిహెచ్‌పి పవర్ ను మరియు 700 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఎస్680 వేరియంట్ లో ఇదే ఇంజన్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇది గరిష్టంగా 612 బిహెచ్‌పి పవర్ ను మరియు 900 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటాయి. ఈ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా ఇంజన్ నుంచి వచ్చే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది.

Most Read Articles

English summary
Bollywood actress kangana ranaut buys mercedes maybach s class
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X