Just In
- 3 hrs ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 20 hrs ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 23 hrs ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- 1 day ago
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
Don't Miss
- Finance
February 1st: కొత్త నెల మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి.. గోవా పర్యాటకులకు ప్రత్యేకం..
- Sports
INDvsNZ : సిరీస్ డిసైడర్‌లో టీమిండియా హిస్టరీ రిపీట్ చేస్తుందా?
- News
రెండోరోజు హైదరాబాద్‌లో కొనసాగుతున్న ఐటీ దాడులు: ఆ సంస్థలతో పాటు టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ!!
- Movies
Waltair Veerayya's 19 Days Collections కలెక్షన్ల జోష్ తగ్గిన వాల్తేరు వీరయ్య.. చిరంజీవి మూవీపై ఆ సినిమా దెబ్బ!
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
1,500 కి చేరుకున్న BYD ATTO 3 బుకింగ్స్.. కొత్త సంవత్సరంలో ప్రారంభం కానున్న డెలివరీలు
ఇటీవల భారతీయ మార్కెట్లో విడుదలైన 'బివైడి ఆటో3' ఎలక్ట్రిక్ కారు మంచి స్పందన పొందుతుంది. ఇందులో భాగంగానే తక్కువ కాలంలో మంచి బుకింగ్స్ కూడా పొందగలిగింది. బివైడి ఆటో3 ఇప్పటివరకు పొందిన బుకింగ్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
BYD ATTO 3 ఎలక్ట్రిక్ కారుని కంపెనీ రూ. 33.99 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) ధర వద్ద విడుదల చేసింది. అయితే ATTO 3 కోసం 2022 అక్టోబర్ 11 నుంచి బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ SUV కోసం ఇప్పటికి 1,500 బుకింగ్స్ వచ్చినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారుని డెలివరీలు 2023 ప్రారంభంలో అంటే 2023 జనవరిలో ప్రారంభమవుతాయి.

BYD ATTO 3 మంచి డిజైన్ కలిగి, లేటెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇది మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి బౌల్డర్ గ్రే, పార్కర్ రెడ్, స్కీ వైట్ మరియు సర్ఫ్ బ్లూ కలర్స్, ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ కారు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొంది అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా మారింది.
కొత్త BYD అటో 3 ఎలక్ట్రిక్ SUV లో ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పెద్ద 60.48kWh బ్యాటరీ ప్యాక్ పొందుతుంది, కావున ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ SUV కేవలం 7.3 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇది రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని కూడా పొందుతుంది.
BYD Atto 3 ఎలక్ట్రిక్ కారు 80 kW DC ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 50 నిమిషాల్లో 0-80 శాతం వరకు ఛార్జ్ చేసుకుంటుంది. అదే సమయంలో టైప్ 2 AC ఛార్జర్‌ని ఉపయోగించి, బ్యాటరీ ప్యాక్‌ను ఛార్జ్ చేసుకోవడానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ SUV కొనుగులుదారులకు 7kW AC హోమ్ ఛార్జర్‌తో పాటు 3kW AC పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్ వంటి వాటిని కూడా అందిస్తుంది.
BYD ATTO 3 ముందు భాగంలో BYD అక్షరాలతో కూడిన సిల్వర్ గ్రిల్, దానికి కింది భాగంలో Atto 3 అనేది ఉంటుంది. అంతే కాకుండా ఇందులో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో కూడా సొగసైన హెడ్‌లైట్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 18-ఇంచెస్ ఫైవ్ స్పోక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రియర్ ప్రొఫైల్ లో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్ మరియు 'బిల్డ్ యువర్ డ్రీమ్స్' అని ఉండటం చూడవచ్చు.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, BYD ATTO 3 ఎలక్ట్రిక్ కారు 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ కలిగి ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు మరియు 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన బివైడి ఆటో3 ఎలక్ట్రిక్ కారు మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, బెల్ట్ ప్రిటెన్షనర్, బెల్ట్ లోడ్ లిమిటర్, ఐసోఫిక్స్, సీట్‌బెల్ట్ రిమైండర్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్పీడ్ అసిస్టెన్స్ మరియు లేన్ అసిస్ట్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది. మొత్తం అన్ని విధాలా అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ కారు రానున్న రోజుల్లో మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉంది.