టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బ్రాండ్ 'బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో' (BYD Auto), 2022 ప్రథమార్థంలో అమ్మకాల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా (Tesla) ని అధిగమించింది. స్కెంజెన్-ఆధారిత ఎలక్ట్రిక్ వాహన తయారీదారు అయిన BYD, ఈ ఏడాది మొదటి ఆరు (జనవరి నుండి జూన్ వరకూ) నెలల్లో 6.41 మిలియన్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

కాగా, ఇదే సమయంలో టెస్లా ప్రపంచవ్యాప్తంగా విక్రయించిన 5.64 మిలియన్ కార్లతో పోలిస్తే ఇది 13.65 శాతం అధికం. వారెంట్ బఫ్ఫెట్ యొక్క బెర్క్‌షైర్ హాత్వే-మద్దతుగల BYD, చైనా యొక్క కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ (CATL) తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఈవీ బ్యాటరీ తయారీదారుగా దక్షిణ కొరియాకి చెందిన ఎల్‌జి (LG) ని కూడా అధిగమించింది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో కూడా BYD యొక్క ఉత్పత్తి మరియు అమ్మకాలు పెద్దగా ప్రభావితం కాలేదు. ఎందుకంటే ఈ కంపెనీ ఫ్యాక్టరీలలో చాలా వరకు చైనాలో లాక్‌డౌన్ చర్యలు కఠినంగా లేని ప్రాంతాలు మరియు నగరాలకు వెలుపల ఉన్నాయి. అయితే, ఈ లాక్‌డౌన్ మాత్రం NIO, Xpeng మరియు Li Autoతో సహా ఇతర చైనీస్ ఈవీ తయారీదారులతో పాటు అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ పై కూడా ఎక్కువ ప్రభావం చూపింది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

బివైడి ఆటో ఈ ఏడాది 1.5 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించాలని ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో, బివైడి ఆటో ఓ ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. ఈ చైనీస్ కంపెనీ బివైడి ఇ6 (BYD e6) పేరుతో భారత ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే, ప్రస్తుతం ఇది వాణిజ్య వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

గత నెలలో, బివైడి ఆటో 128.8 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 10,15,845 కోట్ల) మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా ఫోక్స్‌వ్యాగన్‌ (Volkswagen) ను అధిగమించి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించింది. ఇదే కంపెనీ విలువ అంతకుముందు 117.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,26,722 కోట్లు) గా ఉండేది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

భారత మార్కెట్లో బివైడి ఆటో విక్రయిస్తున్న ఇ6 ఎలక్ట్రిక్ కారు ఇటీవలే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకుంది. బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ పవర్‌పై గరిష్ట దూరాన్ని కవర్ చేసినందుకు గానూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. ఈ రికార్డులో భాగంగా BYD e6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి 6 రోజుల్లో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లే మార్గంలో 9 నగరాలను కవర్ చేస్తూ 2,203 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

భారతదేశంలో బివైడి ఆటో విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు బివైడి ఇ6 ఎమ్‌పివి. ఇది చూడటానికి ఇంచుమించు మారుతి సుజుకి ఎర్టిగా, టొయోటా ఇన్నోవా మాదిరిగా కనిపిస్తుంది. అయితే, ఇది కేవలం 5-సీటర్ వెర్షన్ లో మాత్రమే విక్రయించబడుతోంది. బివైడి ఇ6 భారతదేశంలో బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీని స్వీకరించిన మొదటి ప్రీమియం ఎమ్‌పివి. ఈ కారులోని బ్యాటరీ ప్యాక్ ఇంత అధిక రేంజ్ ను అందించడానికి ప్రధాన కారణంగా, ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ టెక్నాలజీని ఉపయోగించడమే. ఇది వాల్యూమెట్రిక్ ఎనర్జీ డెన్సిటీని 50 శాతం మెరుగుపరుస్తుంది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

బివైడి ఆటో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీదారు. అయితే అమ్మకాల పరంగా ఇప్పుడు ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ కంపెనీగా అవతరించింది. బివైడి ఆటో అనుబంధ సంస్థ అయిన బివైడి ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తమ ఇ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివిని రూ. 29.15 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వివిక్రయిస్తోంది. ఇది వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే విక్రయించబడే ఎలక్ట్రిక్ కారు. ఇది ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌తో టాక్సీగా విక్రయించబడుతోంది. దీనిని ప్రైవేట్ వాహనంగా నమోదు చేసుకోలేరు.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

బివైడి ఇ6 (BYD e6) ఎలక్ట్రిక్ ఎమ్‌పివిలో పెద్ద 71.7 కిలోవాట్అవర్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇందులోని 70 కిలోవాట్అవర్ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 94 బిహెచ్‌పి పవర్ మరియు 180 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఫ్రంట్ యాక్సిల్ లో అమర్చబడి ఉంటుంది. ఈ పవర్‌ట్రైన్ సాయంతో బివైడి ఇ6 గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 520 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

టెస్లా (Tesla) ని ఓవర్‌టేక్ చేసిన చైనా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ బివైడి (BYD).. ఇప్పుడు భారత్‌లో కూడా..

ఈ ఎలక్ట్రిక్ కారు స్టాండర్డ్ ఏసి చార్జింగ్ మరియు డిసి ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. ఈ కారును DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా చార్జ్ చేసినప్పుడు, ఈ కారులోని బ్యాటరీ ప్యాక్‌ ను కేవలం 35 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే దీని ఫాస్ట్ చార్జర్ ద్వారా పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయాలంటే సుమారు గంటన్నర సమయం పడుతుంది. కస్టమర్లు రూ. 45,000 అదనంగా చెల్లిస్తే, కంపెనీ ఈ కారుతో పాటుగా BYD 7kW అనే AC ఛార్జర్‌ ను కూడా అందిస్తుంది.

Most Read Articles

English summary
Byd auto overtakes tesla in ev sales and becomes top ev seller in the world details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X