EMI కట్టే అందరికి ఝలక్ ఇచ్చిన RBI.. భారీగా పెరిగిన రెపో రేటు: వివరాలు

భారతదేశపు కేంద్ర బ్యాక్ అయిన 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్‌బీఐ) రెపో రేటును ఈ రోజు (బుధవారం) ఏకంగా 35 బేసిస్ పాయింట్లకు పెంచి 6.25 శాతానికి చేరుకుంది. ఆర్‌బీఐ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం EMI చెల్లించే వారిపైన భారీ ప్రభావం చూపుతుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రస్తుతం కార్లు, ఇల్లు మరియు ఇతర లోన్స్ చెల్లించే వారి ఇఎమ్ఐ (EMI) భారీగా పెరుగుతుంది. ఇది సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక ఆందోళనల నేపథ్యంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ రెపో రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

 EMI కట్టే అందరికి ఝలక్ ఇచ్చిన RBI

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో చేసిన అంచనాల ఆధారంగా ప్రస్తుత నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత మూడు రోజుల నుంచి జరుగుతున్న కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంతా దాస్ తెలిపారు. ఈ పెరుగుదల వెంటనే అమల్లోకి రానున్నట్లు కూడా తెలిపారు. ఈ ఏడాదిలో రెపోరేటును ఆర్బీఐ పెంచడం వరుసగా ఐదవ సారి కావడం గమనార్హం.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు పెంచిన రెపో రేటుతో పోలిస్తే ఇప్పుడు పెరిగిన రెపో రేటు 2018 తరువాత ఇదే ఎక్కువ. ఈ సంవత్సరం మే నెలలో 0.50 శాతం రెపో రేటు మొదటి సారిగా పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెపో రేటు 1.90 శాతం పెరిగింది. కానీ ఇప్పుడు పెరిగిన రెపో రేటు 5.90 శాతానికి చేరిపోయింది.

కరోనా సమయంలో RBI రుణ భారాన్ని తగ్గించడానికి మరియు సామాన్యులకు ఉపశమనం కలిగించడానికి రెపో రేటు చాలా వరకు తగ్గించింది. అయితే ఇప్పుడు ఏర్పడిన ద్వవ్యోల్బణం కారణంగా ఈ రెపో రేటుని పెంచవలసిన అవసరం వచ్చింది. 2022 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం 7.4 శాతానికి చేరుకోగా, అక్టోబర్‌లో 6.7 శాతానికి స్వల్పంగా తగ్గింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీ రేట్లను పెంచవలసి ఉన్నట్లు కమిటీ నిర్ణయించింది.

రోజు రోజుకి పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు వినియోగంలో తగ్గుదల కారణంగా, రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా కూడా వృద్ధి రేటు అంచనాను తగ్గించింది. ఇందులో భాగంగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో RBI వృద్ధి రేటును 7 శాతంగా అంచనా వేసింది, కాగా దానిని ఇప్పుడు 6.8 శాతానికి తగ్గించింది. మొత్తం మీద పెరిగిన రెపో రేటు తప్పకుండా అందరి మీద ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం RBI పెంచిన రెపో రేటు బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇచ్చే లోన్స్ మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం తీసుకున్న లోన్ మీద పడుతుంది. ఈ కారణంగా ప్రతి నెలా చెల్లించాల్సిన EMI రేటు కూడా పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం పెరిగిన రెపో రేటు కారణంగా బ్యాంకుల రుణాల రేట్లు పెరుగుతాయి. ఇది వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

ఇంతకీ రెపో రేటు అంటే ఏమిటి అని చాలా మందికి తెలిసి ఉండక పోవచ్చు. నిజానికి రెపో రేటు ఆర్‌బిఐ ద్వారా ఏదైనా బ్యాంకు లోన్ ఇచ్చే రేటు. దీని ఆధారంగా చేసుకుని బ్యాంకులు వినియోగదారులకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే కాకుండా రివర్స్ రెపో రేటు అనేది బ్యాంకులకు వారి డిపాజిట్లపై వడ్డీని ఇచ్చే రేటు. రెపో రేటు పెరగటం వల్ల నేరుగా బ్యాంకులపై ప్రభావం పడుతుంది, బ్యాంకులు ఈ భారాన్ని వినియోగదారుల మీద మోపుతారు.

Most Read Articles

English summary
Reserve bank of india increases repo rate details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X