చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి మరియు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమకు త్వరలోనే మరో పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, చైనా మరియు తైవాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు భారతదేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ తయారీదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చైనా-తైవాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది, ఇరు దేశాల కవ్వింపు చర్యలతో ఇప్పటికే ప్రపంచం వణికిపోతోంది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

ఒకవేళ, ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యం అయితే, ఇప్పటికే కుదేలైన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై మరింత భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా, యావత్ ప్రపంచంలో ఆటోమొబైల్ మార్కెట్లకు చైనా అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. కాబట్టి, ఈ పరిస్థితుల్లో తైవాన్ పై చైనా యుద్ధానికి వెళితే, ఆటోమొబైల్ పరిశ్రమకు చుక్కెదురైనట్లే. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ఏర్పడిన పరిస్థితుల కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీ మందగించింది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

అయితే, ఈ పరిస్థితులు ఇప్పుడిప్పుడే క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి రెండు పెద్ద దేశాలు యుద్ధానికి దిగితే, సెమీకండక్టర్ల తయారీ క్షీణించే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ చిప్స్ కొరత కారణంగా, వాహన తయారీదారులు తగిన మోతాదులో వాహనాలను ఉత్పత్తి చేయలేకపోతున్నారు. ఫ్యాక్టరీలో అధిక సంఖ్యలో వాహనాలను తయారు చేసే సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ, వాటి తయారీలో కీలక పాత్ర పోషిస్తున్న చిప్స్ కొరత కారణంగా ఆయా ఫ్యాక్టరీలను పూర్తి సామర్థ్యంతో నిర్వహించలేకపోతున్నారు.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

భారతదేశంలోనే కాదు వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి. కొత్త కొనుగోలుదారులతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, విడిభాగాల సరఫరాలో జాప్యం కారణంగా ఆటోమొబైల్ తయారీదారులు డిమాండ్ కు అనుగుణంగా కార్లను అందించలేకపోతున్నారు. మనదేశంలో అయితే, కొన్ని రకాల వాహనాలకు 2 నెలల నుండి 2 సంవత్సరాల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉందటే, ఈ చిప్స్ కొరత ఆటోమొబైల్ పరిశ్రము ఎంతగా వేధిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

చైనా మరియు తైవాన్ మధ్య అంతర్గత సంక్షోభం ఉద్రిక్తంగా మారితే గ్లోబల్ సెమీకండక్టర్ తయారీ కంపెనీలు ప్రమాదంలో పడవచ్చు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అనేక రకాల లేటెస్ట్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు కొత్త తరం వాహనాలలో సెమీకండక్టర్ చిప్‌లు చాలా కీలకమైన సాంకేతిక భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, దాదాపు గత రెండేళ్లుగా చిప్ సరఫరా కొరతను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ కంపెనీలు తాజాగా చైనా-తైవాన్ పరిస్థితితో మరింత తీవ్రమైన సమస్యలో పడే అవకాశం కనిపిస్తోంది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

గమనించాల్సిన విషయం ఏంటంటే, గ్లోబల్ మార్కెట్‌కు సరఫరా చేస్తున్న సెమీకండక్టర్ చిప్స్ సప్లయ్ కంపెనీల్లో దాదాపు సగం కంపెనీలు తైవాన్‌లోనే ఉన్నాయి. కాబట్టి, ఇలాంటి పరిస్థితుల్లో చైనా-తైవాన్ ల మధ్య ముదిరిన అంతర్గత సంక్షోభం ఉద్రిక్తంగా మారితే, ఖచ్చితంగా ఆటో పరిశ్రమకు గట్టి దెబ్బ తగులుతుందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్‌లో కొత్త వాహనాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సెమీకండక్టర్ సరఫరాలో కొరత కారణంగా కార్లను సమయానికి డెలివరీ చేయలేక అనేక ఆటోమొబైల్ కంపెనీలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

గతేడాది కోవిడ్ సమయంలో ఏర్పడిన సెమీకండక్టర్ కొరత కారణంగా అనేక కార్ల కంపెనీలు కొన్ని రోజులు మరియు నెలల పాటు తమ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేసి ఖాలీగా కూర్చున్నాయి. ఇప్పుడు, తైవాన్ నుంచి సెమీకండక్టర్ చిప్స్ సరఫరా నిలిచిపోతే, మరోసారి ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికీ, అధిక వెయిటింగ్ పీరియడ్ ను కలిగి ఉన్న కొత్త కార్ల విషయంలో, ఈ వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే, కొత్త కారును సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్ కల కలగానే మిగిలిపోతుంది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ (TSMC), ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్‌మేకర్ మరియు ఇది తైవాన్‌లోనే అత్యంత విలువైన కంపెనీ. చైనాతో ఉద్రిక్తతలు పెరిగితే ఎప్పుడైనా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని ఈ కంపెనీ ఇప్పటికే హెచ్చరించింది. సెమీకండక్టర్ ఉత్పత్తి గ్లోబల్ సప్లై చైన్‌పై ఆధారపడి ఉంటుంది కాబట్టి, ఏ సందర్భంలోనైనా ఉత్పత్తి ఆపివేయబడుతుందని హెచ్చరించబడింది. ఈ చిప్ ఉత్పత్తిని నిలిపివేయడం వలన ఆటో పరిశ్రమపై మాత్రమే కాకుండా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

భారతదేశంలో ఇప్పటి వరకూ భారీ సంఖ్యలో సెమీకండక్టర్ చిప్స్ ను తయారు చేసే పెద్ద కంపెనీ ఏదీ లేదు. మనదేశం ఎక్కువగా ఓవర్సీస్ సెమీకండక్టర్ సరఫరాపై ఆధారపడి ఉంది. కాబట్టి, ఈ ప్రతికూల పరిస్థితులు భారత ఆటోమొబైల్ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

వాహనాలలో సెమీకండక్టర్ చిప్స్ ఉపయోగం ఏమిటి?

ఇటీవల మార్కెట్లోకి ప్రవేశిస్తున్న ప్రతి ఆధునిక వాహనంలో సెమీకండక్టర్లు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ లేకుండా కారులో వివిధ రకాల టెక్నాలజీ ఆధారిత ఫీచర్లను అందించడం సాధ్యం కాదు. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఆధునిక కార్లు చాలా క్లిష్టమైన ఎలక్ట్రానిక్ పరికరాలను కలిగి ఉంటాయి. ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేయాలంటే వాటి కోసం అనేక రకాల సర్క్యూట్లు మరియు కొన్ని కీలకమైన ఎలక్ట్రానిక్ చిప్స్ కూడా అవసరం. అలాంటి ఎలక్ట్రానిక్ చిప్స్‌లో సెమీకండక్టర్స్ చాలా ప్రత్యేకమైనవి.

చైనా-తైవాన్ సంక్షోభంతో ఆటో పరిశ్రమపై మరో పెద్ద పిడుగు పడుతుందా..?

కొత్త తరం వాహనాలు అధునాతన టెక్నాలజీతో వస్తున్న నేపథ్యంలో, వాటిలో అనేక ఎలక్ట్రానిక్ ఫీచర్లు ఉంటున్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్టెన్స్ ఫీచర్లు, నావిగేషన్ ఎక్విప్‌మెంట్‌లు మరియు హైబ్రిడ్-ఎలక్ట్రిక్ సిస్టమ్‌లు మొదలైన వాటికి ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ఎంతో అవసరం. కాబట్టి, కారులోని ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే, వాటిలో సెమీకండక్టర్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది మరియు వీటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలు ఆటోమోటివ్ పరిశ్రమ నుండి వస్తున్న ప్రపంచ డిమాండ్‌ని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ వాటి తయారీ తగినంత మోతాదులో ఉండటం లేదు.

Most Read Articles

English summary
China taiwan issue may affect semiconductor chips manufacturing details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X