సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ (Citroen) భారతదేశంలో తమ సరికొత్త హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ సి3 (Citroen C3) ఇటీవలే అధికారికంగా విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం, దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. కేవలం రూ. 5.70 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైన సిట్రోయెన్ సి3, న్యాచురల్ పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయించబడుతోంది. అయితే, ఈ రెండు ఇంజన్లు కూడా కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ ఇందులో ఓ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వేరియంట్ ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్ విషయంలో లీకైన వివరాల ప్రకారం, కంపెనీ ఈ చిన్న కారులో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ (6-speed torque converter gearbox) ను ఉపయోగించనుంది. ఆటోమేటిక్ కార్లలో ఈ సాంకేతికత సాధారణమైనదే అయినప్పటికీ, ఇది ఎక్కువగా ఖరీదైన మోడళ్లలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది చవకైన సి3 కారులో కంపెనీ ఈ సాంకేతికతను అందించడం గొప్ప విషయమే. ప్రస్తుతం, మార్కెట్లో ఈ ప్రైస్ బ్రాకెట్లో విక్రయించబడుతున్న ఆటోమేటిక్ కార్లలో ఎక్కువగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

సాంప్రదాయ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లతో పోల్చుకుంటే, ఈ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (AMT)లు తక్కువ ధరను కలిగి ఉంటాయి, కాబట్టి కార్ కంపెనీలు చవకైన ఆటోమేటిక్ ఆప్షన్ గా వీటిని ఎంచుకుంటుంటారు. ఏఎమ్‌టి గేర్‌బాక్స్ లు సాధారణ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ల మాదిరిగా మృధువైనవి కావు మరియు అదే స్థాయి శుద్ధీకరణను అందించవు. ఏఎమ్‌టి యూనిట్ కలిగిన కార్లలో గేర్ల మార్పిడి కఠినంగా అనిపిస్తుంది, కొన్ని సమయాల్లో ఇది చాలా 'జెర్కీ'గా ఉంటుంది. అయితే, ట్రెడిషనల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ల పనితీరు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) పనితీరు సాధారణ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ పనితీరుకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండింటిలో పెద్ద తేడా ఏంటంటే, ఏఎమ్‌టి లో క్లచ్ ఉండదు, మ్యాన్యువల్‌ లో క్లచ్ ఉంటుంది. మిగతాదంతా దాదాపు ఒకేలా ఉంటుంది. మ్యాన్యువల్ కార్లలో క్లచ్ ను డ్రైవర్ ఆపరేట్ చేస్తే, ఏఎమ్‌టి యూనిట్‌లో క్లచ్‌ను యాంత్రికంగా కారులోని ఆన్-బోర్డ్ కంప్యూటర్ కంట్రోల్ చేస్తుంది. ట్రెడిషనల్ ఆటోమేటిక్ కార్లలో అసలు క్లచ్ అనే కాన్సెప్ట్ ఉండదు, పైగా ఇందులో సున్నితమైన గేర్ చేంజ్ కోసం ఎక్కువ గేర్లు కూడా ఉంటాయి.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

సి3 కారులో ఉపయోగించనున్న ఈ ప్రత్యేకమైన టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, సాధారణ ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కన్నా ఎన్నో రెట్లు మెరుగైనది మరియు ఇది పవర్, మైలేజ్ మధ్య మంచి సమతౌల్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకించి భారతీయ రోడ్డు పరిస్థితులకు ఈ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

సరే ఆ విషయం అటుంచితే, రాబోయే కొత్త సిట్రోయెన్ సి3 ఆటోమేటిక్ వేరియంట్లలో ఐసిన్ బ్రాండ్ నుండి సేకరించిన 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న ఎమ్‌జి ఆస్టర్, స్కోడా కుషాక్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ వంటి ఖరీదైన మోడళ్లలో కూడా ఇదే గేర్‌బాక్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇదే నిజమైతే, కొత్త Citroen C3 AT దాని విభాగంలోనే అత్యుత్తమమైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లలో ఒకటిగా నిలుస్తుంది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

అంతేకాకుండా, ఎంట్రీ-లెవల్ ఆటోమేటిక్ కార్ రేసులో ఇది (సిట్రోయెన్ సి3 ఆటోమేటిక్) ఈ విభాగంలోని ప్రధాన మోడళ్లయిన టాటా పంచ్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి స్విఫ్ట్, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనో కైగర్ వంటి మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది మరియు వాటితో పోల్చుకుంటే, ఇందులో మెరుగైన ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లభిస్తుంది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

ప్రస్తుతం, సిట్రోయెన్ సి3 1.2 లీటర్ న్యాచురల్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని 1.2-లీటర్, న్యాచురల్లీ-ఆస్పిరేటెడ్, 3-సిలిండర్ ప్యూర్‌టెక్ 82 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ లీటరుకు 19.8 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇకపోతే, ఇందులోని 1.2 లీటర్ టర్బో ప్యూర్‌టెక్ 110 టర్బో పెట్రోల్ ఇంజన్ ను అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 110 బిహెచ్‌పి శక్తిని మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది లీటరుకు 19.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బహుశా, కంపెనీ ఇదే టర్బో ఇంజన్ వేరియంట్‌లో తమ కొత్త 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

సిట్రోయెన్ సి3 హ్యాచ్‌బ్యాక్‌లో 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, త్వరలోనే విడుదల!

మార్కెట్లో సిట్రోయెన్ సి3 లైవ్ మరియు ఫీల్ అనే రెండు ట్రిమ్ లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ కారులో కంపెనీ అందిస్తున్న ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 10 ఇంచ్ సిట్రోయెన్ కనెక్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వన్-టచ్ డౌన్ విండోస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ డోర్స్ చైల్డ్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, స్పీడ్-సెన్సిటివ్ డోర్ లాక్, EBDతో కూడిన ABS మొదలైనవి ఉన్నాయి.

Most Read Articles

English summary
Citroen c3 automatic gearbox details leaked online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X