విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ ప్రెంచ్ కార్ల తయారీ సంస్థ 'సిట్రోయెన్' (Citroen) దేశీయ మార్కెట్లో తన 'సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్‌' (Citroen C5 Aircross) తో అడుగుపెట్టి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. అయితే ఇప్పుడు కంపెనీ మరో కొత్త SUV ని దేశీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. కంపెనీ విడుదల చేయనున్న కొత్త SUV 'సిట్రోయెన్ సి3' (Citroen C3). ఈ కొత్త SUV కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభమైనట్లు తెలిసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సిట్రోయెన్ కంపెనీ భారతీయ మార్కెట్లో విడుదల చేసే రెండవ మోడల్ 'సిట్రోయెన్ సి3' (Citroen C3). ఇది ఇప్పటికే చాలా సార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇప్పుడు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి కావున, ఇక లాంచ్ కూడా త్వరలోనే ఉంటుందని ఆశిస్తున్నాము. అంటే బహుశా ఇది 2022 జూన్ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ ఆధునిక SUV ని విడుదల చేయకముందే కొన్ని డీలర్‌షిప్‌లు బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే అధికారిక బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు, త్వరలో అవి కూడా ప్రారంభమవుతాయి.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కానున్న ఈ కొత్త SUV లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం, ఇది డ్యూయల్ టోన్ రూఫ్ టాప్‌ కలిగి ఉందని స్పష్టమైంది. సిట్రోయెన్ C3 ఆరెంజ్ కలర్ రూఫ్ టాప్‌ కలిగి మిగిలిన బాడీ మొత్తం వేరే కలర్ లో ఉంది. కంపెనీ భారతదేశంలో మొదటి సారిగా ఈ కలర్ లో ప్రవేశపెట్టడం జరుగుతోంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సిట్రోయెన్ సి3 SUV ప్రత్యేకంగా భారతీయ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఇది కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (CMP) పై నిర్మించబడుదుతోంది. ఈ డిజైన్ ప్లాట్‌ఫారమ్ భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ SUVని మరింత సరసమైనదిగా చేయడానికి అనుకూలంగా ఉంటుంది. కావున దీని ధర కూడా కొంత తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సిట్రోయెన్ కంపెనీ విడుదల చేయనున్న కొత్త సిట్రోయెన్ సి3 SUV మార్కెట్లో అడుగుపెట్టనున్న చిన్న SUV అవుతుంది. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది రూ. 6 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే దీని ప్రొడక్షన్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు ప్లాంట్‌లో జరుగుతుంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సిట్రోయెన్ సి3 కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క స్పోర్టీ ఎక్స్టీరియర్‌కు తగినట్లుగానే, కంపెనీ దాని ఇంటీరియర్‌ను కూడా బయటి కలర్స్ మ్యాచ్ అయ్యే స్పోర్టీ థీమ్‌తో అందించే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీలో 1 లీటర్ గ్లోవ్ బాక్స్, ముందు మరియు వెనుక డోర్లపైన 2 లీటర్ల డోర్ పాకెట్‌లు, సెంట్రల్ కన్సోల్‌లో స్టోరేజ్ కంపార్ట్‌మెంట్, వెనుక భాగంలో రెండు కప్ హోల్డర్‌లతో కూడిన రియర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

అంతే కాకుండా ఇందులో 10 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాస్ట్-ఛార్జింగ్ యూఎస్‌బి పోర్టులు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటితో పాటు 315 లీటర్ల బూట్ స్పేస్ మరియు డ్రైవర్, కో-ప్యాసింజర్ కోసం స్మార్ట్‌ఫోన్ క్లాంప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, కంపెనీ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లతో తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇది 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?

సిట్రోయెన్ సి3 SUV భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా ఎక్స్యువి300 వంటి సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ SUV లకు ప్రత్యర్థిగా ఉంటుంది. మొత్తం మీద ఇది తప్పకుండా భారతీయ వాహన వినియోగదారులను ఆకర్శించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Citroen c3 compact suv unofficial booking starts expected launch next month details
Story first published: Wednesday, May 25, 2022, 9:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X