ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

భారతీయ వాహన వినియోగదారులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'సిట్రోయెన్ సి3' (Citroen C3) దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 5.71 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 8.06 లక్షలు. ఈ ఎస్‌యూవీ కోసం కంపెనీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారభించింది. కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎస్‌యూవీ గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

సిట్రోయెన్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎస్‌యూవీ ప్రస్తుతం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి లైవ్ మరియు ఫీల్ వేరియంట్. ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ.21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఇది డీలర్‌షిప్‌లను చేరుకోవడం కూడా ప్రారంభించింది.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

సిట్రోయెన్ సి3 భారతదేశంలో ఉత్పత్తి కానున్న మేడ్-ఇన్-ఇండియా ప్రోడక్ట్. ఎందుకంటే ఇది భారతదేశంలో ఉత్పత్తి కానున్న సిట్రోయెన్ కంపెనీ యొక్క మొదటి ఉత్పత్తి. కొత్త ఎస్‌యూవీ ఆధునిక డిజైన్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలోని బంపర్‌లపై కలర్-కోడెడ్ ఇన్‌సర్ట్‌లు, గ్రిల్‌తో కలిసే స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, హెక్సా గోనల్ ఎయిర్ డ్యామ్, X-షేప్ లో ఉండే ఫాక్స్ స్కఫ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ మరియు బాడీ క్లాడింగ్‌ ఉన్నాయి. ఇది 15 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇక వెనుక భాగంలో ర్యాపరౌండ్ టెయిల్-లైట్స్ చక్కగా అమర్చబడి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

కొత్త సి3 ఎస్‌యూవీలోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, ఫోర్-స్పీకర్స్, యుఎస్బి ఛార్జింగ్ సాకేట్ వంటివి మాత్రమే కాకుండా మిర్రర్ స్క్రీన్ ఫంక్షన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, వర్టికల్ ఏసీ వెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

కొత్త సిట్రోయెన్ సి3 నాలుగు మోనో-టోన్ మరియు రెండు డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్‌లలో అందించబడుతుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, జెస్టీ ఆరెంజ్ మరియు ప్లాటినం గ్రే అనే మోనో కలర్స్ మరియు జెస్టీ ఆరెంజ్ విత్ ప్లాటినం గ్రే రూఫ్ మరియు పోలార్ వైట్‌తో జెస్టీ ఆరెంజ్ కలర్ రూఫ్ అనే డ్యూయెల్ టోన్ కలర్స్.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

సిట్రోయెన్ సి3 పరిమాణం గమినించినట్లైతే ఇది 3,981 మిమీ పొడవు, 1,733 మిమీ వెడల్పు, 1,586 మిమీ ఎత్తు మరియు వీల్‌బేస్ 2540 మిమీ వరకు ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ మరియు బూట్ స్పేస్ 315 లీటర్ల వరకు ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందుతుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వెర్షన్ 81 బిహెచ్‌పి పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. టర్బోచార్జ్డ్ వెర్షన్ యొక్క 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 108 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబిడి, సెంట్రల్ లాక్/అన్‌లాక్ బటన్, డీఫాగర్, పవర్డ్ వింగ్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్‌ వంటివి ఉన్నాయి. దేశీయ మార్కెట్లో విడుదలైన కోట్ సిట్రోయెన్ సి3 టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ మరియు మారుతి సుజుకి ఇగ్నిస్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో విడుదలైన విడుదలైన సిట్రోయెన్ సి3: ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో విడుదలై కొత్త సిట్రోయెన్ సి3 ఎస్‌యూవీ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో మంచి కలర్ ఆప్సన్స్ పొందుతుంది. కావున దేశీయ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలను పొందే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. మేము ఇప్పటికే సిట్రోయెన్ సి3 టెస్ట్ డ్రైవ్ కూడా చేసాము. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Citroen c3 launched in india price features engine delivery details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X